ravanudu
-
'ఆ పాత్ర చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఒసామాబిన్ లాడెన్ గుర్తొస్తున్నారు'
సాక్షి, విశాఖపట్నం: ఆదిపురుష్ సినిమాలో రావణుడు వేషధారణ మార్చాలని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వాసు మాట్లాడుతూ నేటి తరానికి రామాయణం చాలా అవసరమని, దర్శకుడు ఓంరౌత్ సినిమాగా తీసుకురావడం మంచిదే అయినప్పటికీ రావణుడు పాత్ర స్వరూపాన్ని పూర్తిగా మార్చేయడాన్ని హిందూ సమాజం అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. పరమ శివభక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడు పాత్రధారునికి కళ్లు, విచిత్రమైన హెయిర్ కటింగ్, పొడవాటి గెడ్డాన్ని చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఒసామాబిన్ లాడెన్‌గా ఉన్నారన్నారు. తక్షణమే దర్శకుడు ఓంరౌత్ తప్పును సరిదిద్దుకోవాలని, లేకపోతే సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమితి నాయకులు రవికిరణ్, దీపక్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: (ఆదిపురుష్: 3డీలో టీజర్ చూసి థ్రిల్ అయ్యాను : ప్రభాస్) -
రావణ పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత
ముంబై: 1986లో వచ్చిన రామాయణం సీరియల్లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన బంధువు కౌస్తుభ్ తెలిపారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చాలా కాలం నుంచి బాధపడుతు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం దహనుకార్ వాడి ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అరవింద్ మృతిపై ప్రధాని∙మోదీ స్పందించారు. రామాయణం సీరియల్లో ఆయన పాత్రను ప్రజలు చిరకాలం గుర్తుంచు కుంటారని అన్నారు. 1991లో అరవింద్ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు. -
రావణుడిగా ఎన్టీఆర్.. జై లవకుశ ఫస్ట్ లుక్
-
రావణుడిగా ఎన్టీఆర్.. జై లవకుశ ఫస్ట్ లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలోనటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం, ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండటం లాంటి అంశాలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ఉగాది కానుకగా సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేశారు. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ ను రివీల్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో పది తలల రావణుడ్ని హైలెట్ చేస్తు కారు దిగుతున్న స్టైలిష్ ఎన్టీఆర్ లుక్ సూపర్బ్ గా ఉంది. మరో పోస్టర్ లో చేతికి ఇనుప సంకెళ్లతో దండం పెడుతున్న స్టిల్ ను రిలీజ్ చేసిన యూనిట్, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేసింది. Roudhram... Rajasam... kalagalipithe maa ee Ravanudu.. Here is Jai #JaiLavaKusaFirstLook pic.twitter.com/tek3wLl5uv — Mahesh S Koneru (@smkoneru) 19 May 2017