సాక్షి, విశాఖపట్నం: ఆదిపురుష్ సినిమాలో రావణుడు వేషధారణ మార్చాలని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం వాసు మాట్లాడుతూ నేటి తరానికి రామాయణం చాలా అవసరమని, దర్శకుడు ఓంరౌత్ సినిమాగా తీసుకురావడం మంచిదే అయినప్పటికీ రావణుడు పాత్ర స్వరూపాన్ని పూర్తిగా మార్చేయడాన్ని హిందూ సమాజం అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.
పరమ శివభక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడు పాత్రధారునికి కళ్లు, విచిత్రమైన హెయిర్ కటింగ్, పొడవాటి గెడ్డాన్ని చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఒసామాబిన్ లాడెన్‌గా ఉన్నారన్నారు. తక్షణమే దర్శకుడు ఓంరౌత్ తప్పును సరిదిద్దుకోవాలని, లేకపోతే సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమితి నాయకులు రవికిరణ్, దీపక్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
చదవండి: (ఆదిపురుష్: 3డీలో టీజర్ చూసి థ్రిల్ అయ్యాను : ప్రభాస్)
Comments
Please login to add a commentAdd a comment