రావణ పాత్రధారి అరవింద్‌ త్రివేది కన్నుమూత | Arvind Trivedi Ravana of Ramayana Dies Of Heart Attack at home | Sakshi
Sakshi News home page

రావణ పాత్రధారి అరవింద్‌ త్రివేది కన్నుమూత

Published Thu, Oct 7 2021 6:27 AM | Last Updated on Thu, Oct 7 2021 6:27 AM

Arvind Trivedi Ravana of Ramayana Dies Of Heart Attack at home - Sakshi

ముంబై: 1986లో వచ్చిన రామాయణం సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్‌ త్రివేది కన్నుమూశారు. మంగళవారం రాత్రి  ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన బంధువు కౌస్తుభ్‌  తెలిపారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చాలా కాలం నుంచి బాధపడుతు న్నారని పేర్కొన్నారు.  బుధవారం ఉదయం దహనుకార్‌ వాడి ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అరవింద్‌ మృతిపై ప్రధాని∙మోదీ స్పందించారు. రామాయణం సీరియల్‌లో ఆయన పాత్రను ప్రజలు చిరకాలం గుర్తుంచు కుంటారని అన్నారు. 1991లో అరవింద్‌ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement