arvind trivedi
-
రావణ పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత
ముంబై: 1986లో వచ్చిన రామాయణం సీరియల్లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన బంధువు కౌస్తుభ్ తెలిపారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చాలా కాలం నుంచి బాధపడుతు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం దహనుకార్ వాడి ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అరవింద్ మృతిపై ప్రధాని∙మోదీ స్పందించారు. రామాయణం సీరియల్లో ఆయన పాత్రను ప్రజలు చిరకాలం గుర్తుంచు కుంటారని అన్నారు. 1991లో అరవింద్ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు. -
ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూత
ప్రముఖ నటుడు, ‘రామయణ్’ ఫేం అరవింద్ త్రివేది(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న త్రివేది మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన బంధువులు వెల్లడించారు. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్ టీవీ, సినీ నటీనటుల సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా అరవింద్ త్రివేది ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ సీరియల్లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. చదవండి: తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్ ఖాన్ 1980లో వచ్చిన ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అపురూప దృశ్య కావ్యానికి ఉన్న క్రేజ్‌ను బట్టి ఇటీవల ఫస్ట్ లాక్డౌన్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దూరదర్శన్ ‘రామాయణ్’ను పున:ప్రసారం చేసింది. 2020 ఏప్రిల్ 16న తిరిగి ప్రసారమైన రామయణ్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది. రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్’ విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా ఈ సీరియల్‌కు అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. చదవండి: ఆర్యన్ ఖాన్‌పై ఆరోపణలు నిరాధారం: అర్బాజ్ తండ్రి అయితే గతంలో అరవింద్ కరోనా మృతి చెందినట్లు వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ స్పందించారు. అరవింద్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఇప్పుడు అరవింద్ మృతి వార్తను కూడా ఆయన వెల్లడించారు. కాగా ఈ సీరియల్లో రావణుడిగా అరవింద్ త్రివేదీ నటించగా అరుణ్ గోవిల్.. రాముడిగా, సునీల్ లాహిర్.. లక్ష్మణ్‌గా, దీపిక చిఖిలియా.. సీతగా నటించారు. View this post on Instagram A post shared by Sunil Lahri (@sunil_lahri) -
రాముడు, సీత, రావణుడు.. అంతా ఒకటే పార్టీ!
రామాయణంలో సీతారాములు ఇద్దరూ ఒక చోట ఉంటారు కానీ, వాళ్లతో కలిసి రావణుడు ఉండటం ఎప్పుడైనా చూశారా? పురాణాలతో పాటు సినిమాల్లో కూడా ఎక్కడా అలా జరగదు కానీ.. రామానంద్ సాగర్ తీసిన సూపర్ హిట్ టీవీ సీరియల్ రామాయణంలోని రాముడు, సీత, రావణాసురుడు పాత్రధారులు ముగ్గురూ ఇప్పుడు ఒకటే పార్టీ.. బీజేపీలో ఉండబోతున్నారు. రావణాసురుడి పాత్ర ధరించిన అరవింద్ త్రివేదీ ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన గుజరాత్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే సీత పాత్రధారిణి దీపికా చికాలియా కూడా రెండుసార్లు బీజేపీ తరఫున గుజరాత్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా.. రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ సైతం బీజేపీలో చేరుతున్నారు. మహాభారతంలో ధర్మరాజు పాత్ర పోషించిన గజేంద్ర చౌహాన్ కూడా ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన ప్రస్తుతం పుణె ఫిలిం ఇన్స్టిట్యూట్ చైర్మన్‌గా ఉన్నారు. బీహార్ లేదా యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు అరుణ్ గోవిల్ బీజేపీలో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినా.. అరుణ్ గోవిల్ తిరస్కరించారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావడంతో పాటు.. బీజేపీలోనే చేరుతానని కూడా చెబుతున్నారు.