ravi prasad
-
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటుడు మాండ్య రవి(43) అలియాస్ రవిప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. రవిప్రసాద్ హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. కాగా ఫేమస్ రచయిత డాక్టర్ హెచ్ఎస్ ముద్దెగౌడ కుమారుడే ఈ మాండ్య రవి. ఆయన కన్నడలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో సైతం పలు సీరియల్స్‌లో నటించారు. డైరెక్టర్ టీఎన్ సీతారాం తెరకెక్కించిన పలు సీరియల్స్‌లో ఆయన గుర్తింపు పొందారు. డైరెక్టర్ టీఎస్ నాగాభరణ తెరకెక్కించిన మహామయి సిరీయల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన రవిప్రసాద్ ‘చిత్రలేఖ’, ‘వరలక్ష్మి’, ‘ముక్కత ముక్త’, ‘యశోదే’ వంటి సీరియల్స్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా రవిప్రసాద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా సీనియర్ న్యాయ వాది వై.వి.రవిప్రసాద్ ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ మద్దతుతో బరిలో దిగిన రవిప్రసాద్ తన సమీప ప్రత్యర్థి గూడపాటి వెంకటేశ్వరరావుపై 156 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రవిప్రసాద్‌కు 621 ఓట్లు రాగా, వెంకటేశ్వరరావుకు 465 ఓట్లు వచ్చాయి. అధ్యక్ష స్థానానికి పోటీపడిన మరో అభ్యర్థి జాగర్లమూడి కోటేశ్వరిదేవికి కేవలం 60 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా జీవీఎల్ నాగేశ్వరరావు గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఎలీషాపై 304 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక రెండు కార్యదర్శుల పోస్టులకు జేయూఎంవీ ప్రసాద్, పీటా రామన్ ఎన్నికయ్యారు. సం యుక్త కార్యదర్శిగా ఈర్ల సతీష్‌కుమార్, కోశాధికారిగా తోట సునీత విజయం సాధించారు. వీ రితో పాటు మరికొందరు కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించారు. గురువారం 10.30 గంటలకు మొదలైన ఓటింగ్ సాయం త్రం వర కు జరిగింది. ఏపీ హైకోర్టు ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. -
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
వరంగల్ క్రైం: పాత్రికేయం ముసుగులో సంఘవిద్రోహక చర్యలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వరంగల్ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని కొత్తపేట కాలనీకి చెందిన కందుల పవన్‌కుమార్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన పెద్దినేని రవిప్రసాద్.. 'భద్రాద్రి' అనే వారపత్రికలో పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా డబ్బు సంపాదించాలనే దురాశతో వీరు తప్పుడు మార్గాలను అన్వేషిస్తూ.. దొంగనోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ప్రింటర్ సిద్ధంచేసుకొని రూ.43 లక్షలు విలువ చేసే దొంగనోట్లు ముద్రించారు. వీటిని మార్పిడి చేయడానికి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన దిడిగం మనోజ్‌కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోజు ఉదయం రూ.లక్ష నగదు ఇచ్చి పదహారు లక్షల దొంగనోట్లు తీసుకునేందుకు బీటెక్ విద్యార్థిని స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్‌బంక్ వద్దకు రావాల్సిందిగా కోరారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ సీసీఎస్ పోలీసులు పథకం ప్రకారం వారిని పట్టుకున్నట్టు సమాచారం.