ఆసీస్‌తో నాలుగో టెస్టు.. ముంబై యువ సంచలనానికి పిలుపు!?
ముంబై స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనుష్ కోటియన్‌కు తొలిసారి భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టుల కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మూడో టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ స్ధానాన్ని 26 ఏళ్ల తనీష్ భర్తీ చేయనున్నాడు.స్పోర్ట్స్‌స్టార్ నివేదిక ప్రకారం..కోటియన్ మంగళవారం (డిసెంబర్ 24) ఆస్ట్రేలియాకు పయనం కానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ నుంచి కోటియన్ వైదొలగనున్నాడు. ఈ టోర్నీలో సోమవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తనుష్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తాచాటిన ఈ ముంబైకర్.. బ్యాటింగ్‌లో 39 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు తనుష్కు దక్కింది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదుర్స్.. కాగా తనీష్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కోటియన్.. 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ కోటియన్‌కు సూపర్ ట్రాక్ రికార్డు ఉంది. 33 మ్యాచ్‌ల్లో 41.21 2523 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ విజేతగా ముంబై నిలవడంలో కోటియన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 29 వికెట్లతో పాటు 500 పైగా పరుగులు చేశాడు.అంతేకాకుండా బీజీటీ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో భారత్-ఎ జట్టు తరపున అనాధికారిక టెస్టు మ్యాచ్ కూడా ఆడాడు. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన తనుష్.. బ్యాటింగ్‌లో 44 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో అతడు అశ్విన్ వారుసుడిగా ఎదిగే ఛాన్స్ ఉంది. ఇక ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్ జట్టు ఇదే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, తనుష్ కోటియన్*