విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Published Tue, Jun 27 2017 10:52 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer dies of vidyut shock

యాడికి (తాడిపత్రి రూరల్‌) : యాడికి మండలంలోని నగరూర్‌ గ్రామానికి చెందిన రైతు రవిచంద్ర చౌదరి(42) విద్యుత్‌ షాక్‌కు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. నగరూరుకు చెందిన రవిచంద్రచౌదరి మంగళవారం దానిమ్మ తోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్‌ మోటార్‌ వేస్తుండగా షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మృతుని భార్య గౌతమి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి ముగ్గురు సంతానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement