ravikiran arrest
-
నా భర్తను కావాలనే ఇరికించారు: సుజన
విశాఖపట్నం: ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్, సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్త అయిన ఇంటూరి రవికిరణ్ పై సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుందని ఆయన భార్య సుజన ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ పోలీసులు రవికిరణ్ ను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ సెంట్రల్ జైలుకు గురువారం వెళ్లిన సుజన తన భర్త రవికిరణ్ ను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే తన భర్త రవికిరణ్ ను లేనిపోని కేసుల్లో ఇరికించారని ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల హైదరాబాద్ లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని బలవంతంగా ఏపీకి తరలించి రవికిరణ్ ను బెదిరింపులకు గురిచేసినా ప్రయోజనం లేకపోయిందని భావించి ఏకంగా అరెస్ట్ చేయించారు. ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ–1 మోహనరావు ఏప్రిల్ 26న రవికిరణ్‌కు నోటీసులు పంపారు. మే 4న విచారణకు రావాలని ఆదేశించారు. మే9న వచ్చేందుకు అనుమతి తీసుకుని మంగళవారం విశాఖకు వచ్చిన రవికిరణ్‌ను దాదాపు నాలుగు గంటలపాటు పోలీసులు విచారించి, ఆపై అరెస్ట్ చేశారు. రవికిరణ్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. -
‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై విచారణకు పిలిచి అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, విశాఖ/ద్వారకానగర్: ప్రభుత్వం, అధికార టీడీపీ తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్, సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌పై సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవలే హైదరా బాద్‌లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని, ఏపీ కి తరలించి పలు ప్రాంతాల్లో తిప్పుతూ బెది రింపులకు గురిచేసినా ఆయన లొంగకపోవ డంతో ఇప్పుడు ఏకంగా అరెస్టు చేయించిం ది. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు ఆధారం గా రవికిరణ్‌ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామా జిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ రవికిరణ్‌ను టీడీపీ ప్రభుత్వం వేధిస్తున్న విషయం తెలిసిందే. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రవికిరణ్‌పై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ–1 మోహనరావు ఏప్రిల్ 26న రవికిరణ్‌కు నోటీసులు పంపారు. విచారణ నిమిత్తం మే 4న రావాలని ఆదేశించారు. 9న వచ్చేందుకు అనుమతి తీసుకుని మంగళవారం వచ్చిన రవికిరణ్‌ను 4 గంటలపాటు పోలీసులు విచా రించి, అరెస్ట్ చేశారు. అనంతరం రవికిరణ్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధిం చింది. ఈ సందర్భంగా రవికిరణ్ మీడి యాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిత తనపై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయంగా పెట్టారన్నారు. సీఎం బాబు, మంత్రి లోకేశ్ తనపై కక్ష సాధిం పు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులా? వైఎస్సార్సీపీ ‘ఐటీ’ అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రవికిరణ్‌ను ఏపీ పోలీ సులు అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధు సూదన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభు త్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టడం ద్వారా నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేయగలమనుకోవడం అవివేకమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై ఎప్పుడో చేసిన పోస్టును సాకుగా చూపుతూ అప్రజాస్వామి కంగా పోలీసులు రవికిరణ్‌ను అరెస్టు చేశా రని విమర్శించారు. టీడీపీ వైఫల్యాలు, అవి నీతిని, లోకేశ్ అసమర్థతను నెటిజన్లు వ్యంగ్యాస్త్రాల రూపంలో ప్రజల్లోకి తీసు కెళ్తుండడాన్ని తట్టుకోలేక టీడీపీ ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేస్తోందన్నారు. -
పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్
-
అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి
-
అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి: వైఎస్ జగన్
సోషల్ మీడియాను అణగదొక్కుతున్న చంద్రబాబు మీద అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని పోరాటం చేయాలని, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మద్దతుదారులంతా ఈ దారుణంపై స్పందించాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. సోషల్ మీడియా మీద ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న అసహనం, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు. పొలిటికల్ పంచ్ అనే ఫేస్బుక్ పేజీ అడ్మినిస్ట్రేటర్ అయిన రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయంలో సోదాలు చేయడం, అక్కడి సిబ్బందికి నోటీసులు ఇవ్వడం తదితర ఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని, సర్కారు నిరంకుశ వైఖరిపై ధ్వజమెత్తాలని వైఎస్ జగన్ కోరారు. ఏపీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను కలిసకట్టుగా వ్యతిరేకించాలని అన్నారు. Request YSRCP supporters across the globe to condemn CBNs undemocratic tyrannical act in throttling social media, using the very same media. — YS Jagan Mohan Reddy (@ysjagan) 22 April 2017 -
క్రైమ్ స్టోరీలు చూసి క్రిమినల్‌గా మారాడు
అంబర్‌పేట (హైదరాబాద్): టీవీల్లో నేర కథనాలను స్ఫూర్తిగా తీసుకుని ఓ యువకుడు క్రిమినల్‌గా మారాడు. బాలికలకు మాయమాటలు చెప్పి వారి నుంచి ఆభరణాలను కొట్టేస్తున్న ఈ ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు. పోలీసులు నిందితుడి నుంచి రూ. 7.10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అంబర్‌పేటలో విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ వి.రవీందర్ వివరాలు వెల్లడించారు. బర్కత్‌పురలోని రత్నానగర్‌కు చెందిన బాతుల రవికిరణ్(28) అలియాస్ టింకు... ఎలక్ట్రీషియన్‌గా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం చాలకపోవడంతో 2012లో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. కాలనీలు, పాఠశాలల వద్ద 8 నుంచి 12 ఏళ్ల వయసులోపు ఉన్న బాలికలను మాటల్లో దింపి మీ తల్లిదండ్రులు బాగా తెలుసునని నమ్మించేవాడు. క్రీడా పరికరాల బహుమతులు ఇప్పిస్తానని చెప్పి వారిని తన వాహనంపై కొద్ది దూరం తీసుకెళ్లి ఆభరణాలు తీసుకుని పరారయ్యేవాడు. ఇలా సుమారు 150 చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల కాచిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఓ బాలిక నుంచి నిందితుడు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని ఫోటోలు సేకరించి మీడియాకు విడుదల చేశారు. రవికిరణ్ సమాచారం తెలుసుకున్న పోలీసులు రత్నానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతణ్నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, 2.7 కిలోల వెండి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.