
‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై విచారణకు పిలిచి అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, విశాఖ/ద్వారకానగర్: ప్రభుత్వం, అధికార టీడీపీ తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్, సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌పై సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవలే హైదరా బాద్‌లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని, ఏపీ కి తరలించి పలు ప్రాంతాల్లో తిప్పుతూ బెది రింపులకు గురిచేసినా ఆయన లొంగకపోవ డంతో ఇప్పుడు ఏకంగా అరెస్టు చేయించిం ది. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు ఆధారం గా రవికిరణ్‌ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామా జిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ రవికిరణ్‌ను టీడీపీ ప్రభుత్వం వేధిస్తున్న విషయం తెలిసిందే.
పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్
రవికిరణ్‌పై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ–1 మోహనరావు ఏప్రిల్ 26న రవికిరణ్‌కు నోటీసులు పంపారు. విచారణ నిమిత్తం మే 4న రావాలని ఆదేశించారు. 9న వచ్చేందుకు అనుమతి తీసుకుని మంగళవారం వచ్చిన రవికిరణ్‌ను 4 గంటలపాటు పోలీసులు విచా రించి, అరెస్ట్ చేశారు. అనంతరం రవికిరణ్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధిం చింది. ఈ సందర్భంగా రవికిరణ్ మీడి యాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిత తనపై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయంగా పెట్టారన్నారు. సీఎం బాబు, మంత్రి లోకేశ్ తనపై కక్ష సాధిం పు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
ప్రశ్నిస్తే అరెస్టులా?
వైఎస్సార్‌సీపీ ‘ఐటీ’ అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రవికిరణ్‌ను ఏపీ పోలీ సులు అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధు సూదన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభు త్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టడం ద్వారా నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేయగలమనుకోవడం అవివేకమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై ఎప్పుడో చేసిన పోస్టును సాకుగా చూపుతూ అప్రజాస్వామి కంగా పోలీసులు రవికిరణ్‌ను అరెస్టు చేశా రని విమర్శించారు. టీడీపీ వైఫల్యాలు, అవి నీతిని, లోకేశ్ అసమర్థతను నెటిజన్లు వ్యంగ్యాస్త్రాల రూపంలో ప్రజల్లోకి తీసు కెళ్తుండడాన్ని తట్టుకోలేక టీడీపీ ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేస్తోందన్నారు.