political punch
-
మంచి చేసే వారికి గౌరవం దక్కదు: నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని గడ్కరి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆరోపించారు. దీంతో, ఆయన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, నితిన్ గడ్కరీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అధికార పార్టీతో అంటకాగాలని చూసే వారే అధికమని అన్నారు. అవకాశవాదులే ఎక్కువ మంది ఉన్నారు. సిద్ధాంతాల భూమిక లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా సరే.. మంచి పనిచేసేవాడికి గౌరవం లభించదని, చెడ్డ పనిచేసే వారికి శిక్ష పడదని తానెప్పుడూ సరదాగా చెప్పేవాడినని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నారనేది మాత్రం వెల్లడించలేదు. పబ్లిసిటీ, పాపులారిటీ చాలా అవసరం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో చెప్పాలంటే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని గడ్కరీ అన్నారు. ఈ ప్రత్యేకత కారణంగానే, మన ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. కానీ వారి వారి నియోజకవర్గాల ప్రజల కోసం వాళ్లు చేసిన పనులే అంతిమంగా ముఖ్యమైనవి, వారికి గౌరవం తెస్తాయి. పబ్లిసిటీ, పాపులారిటీ చాలా అవసరం. అయితే.. పార్లమెంట్లో ఏం మాట్లాడతారో దానికంటే తమ నియోజకవర్గాల్లో ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారనేదే ముఖ్యమని కామెంట్స్ చేశారు. లాలూ, ఫెర్నాండెజ్‌పై ప్రశంసలు.. ఇదే సమయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ప్రశంసించిన గడ్కరీ, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ప్రవర్తన, సరళత, వ్యక్తిత్వం నుంచి కూడా చాలా నేర్చుకున్నానని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత నన్ను ఎంతగానో ఆకట్టుకున్న వ్యక్తి జార్జ్ ఫెర్నాండెజ్ అని ఆయన అన్నారు. ఇటీవలే మరణానంతరం భారతరత్న ప్రదానం చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ను కూడా గడ్కరీ ప్రశంసించారు. అలాంటి వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, అతను (ఠాకూర్) ఆటో రిక్షాలో ప్రయాణించాడు. అతని జీవనశైలి చాలా సాధారణమైనది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కొడంగల్‌లో వేడెక్కుతున్న రాజకీయం
అధికార పార్టీలో ఇంటిపోరు జిల్లా మొత్తానికి పాకింది. గతంలో తాండూరు, వికారాబాద్‌కే పరిమితమైన గ్రూపు రాజకీయాలు.. నెమ్మదిగా పరిగి, కొడంగల్‌కు విస్తరించాయి. ఈసారి బీఆర్ఎస్ టికెట్ తమకే ఇవ్వాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు. కాదు.. కూడదూ..అంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామనే సంకేతాలిస్తున్నారు. వికారాబాద్: కొడంగల్‌లో గులాబీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. మెల్లమెల్లగా కారులో చిచ్చు రగులుతోంది. అధికార పార్టీలో ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు.. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కార్యచరణ ప్రకటనతో బహిర్గతమైంది. దీంతో తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలకే పరిమితమైన ఇంటిపోరు కొడంగల్‌కు సైతం పాకినట్లయింది. త్వరలోనే మండలాల వారీగా తమ అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు గురునాథ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న మీటింగ్ ఏర్పాటుకు నిర్ణయించగా.. కేటీఆర్ నుంచి వచి్చన పిలుపు మేరకు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. గత సోమవారమే గురునాథ్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్‌తో భేటీ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల పాటు వేచిచూసి తమ నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. మా పరిస్థితి ఏంటి..? ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన గురునాథ్‌రెడ్డి కొడంగల్ గడ్డపై ఓ వెలుగు వెలిగిన నేత. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి 7వేల ఓట్ల తేడాతో, 2014లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగి 15 వేల ఓట్లతో రేవంత్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో కొడంగల్ గడ్డపై రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం ఫ్యామిలీ నుంచి నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వంటి హేమాహేమీలకు ప్రచార, గెలుపు బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో పాతుకుపోయే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా కొనసాగిన గురునాథ్‌రెడ్డి రాజకీయంగా వెనుకబాటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. టికెట్ ఇస్తేనే కొనసాగుతాం.. ఒక్క చాన్స్ అంటూ కొడంగల్‌లో అడుగుపెట్టిన నరేందర్‌రెడ్డి ఏకు మేకై కూర్చున్నారు.అధికార పార్టీ తరఫున ఈసారి కూడా ఆయనే బరిలో ఉంటారనే ఊహాగానాల నేపథ్యంలోబీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకునేందుకు గురునాథ్‌రెడ్డి మద్దతుదారులు రెడీ అవుతున్నారు. అప్పట్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి నరేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చామని, ప్రతీసారి ఆయనే పోటీ చేస్తారంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈసారి తన కుమారుడు, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డిని రంగంలో దింపాలని గురునాథ్‌రెడ్డి భావిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తేనే పార్టీలో కొనసాగుతామని, లేదంటే స్వతంత్రఅభ్యరి్థగా పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. 2018లో తాము నిస్వార్థంగా నరేందర్‌రెడ్డికి సపోర్ట్ చేశామని, ఇప్పుడు ఆయన తమకు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ మాటను గౌరవించాం గత ఎన్నికల్లో నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పెద్దలు కేసీఆర్ చెప్పిన మాటను గౌరవించాం. నరేందర్‌రెడ్డి గెలుపుకోసం కృషిచేశాం. కొడంగల్‌లో కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టినం. ఆయన ఈ తూరిగూడ నాకే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మేమెట్ల ఒప్పుకుంటం. స్థానికులకే టికెట్ ఇవ్వాలని లోకల్ క్యాడర్ కోరుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఈసారి మాకే టికెట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ మేము ఎమ్మెల్యే బరిలో ఉంటాం. – గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ -
సంజయ్ సవాల్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధం. బీజేపీలో కోవర్టులు ఉండరు.. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణకు నాలుగో స్థానంలో ఉంది. ఒక్క రైతుబంధు ఇచ్చి మిగతా సబ్సిడీలను రద్దు చేశారు. పంజాబ్‌లో రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చారు. 24 గంటల విద్యుత్‌ను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?. అంటూ సవాల్ విసిరారు. -
అయ్యో.. అయ్యయ్యో.. బాబూ!
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిలో ‘అధికార దాహం’ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రజల సానుభూతి కోసం ఎంతగా వెంపర్లాడుతున్నాడంటే.. ఎమోషనల్ డ్రామాకు తెర తీస్తున్నారు. కర్నూల్ పత్తికొండ పర్యటనలో ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ ప్రకటించి.. పక్కనే ఉన్న సొంత పార్టీ నేతలనే నివ్వెరపోయేలా చేశారు. అందుకే కర్నూల్ పర్యటనలో చంద్రబాబుకు జనం చుక్కలు చూపించారు. తనకు అవమానం జరిగిందని, మీరు(ప్రజలను ఉద్దేశించి..) గెలిపించి అసెంబ్లీకి పంపితే సరేనని, 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే నాకు ఆఖరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చంద్రబాబు ప్రతీ మాటలోనూ కనిపించింది. అన్ని వర్గాలకు సంక్షేమం అత్యంత పారదర్శకంగా అందుతుండడం, ప్రభుత్వానికి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడం.. ముఖ్యంగా టీడీపీ గత ఎన్నికల్లో నెగ్గిన 23 స్థానాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం, చొరవ తీసుకుని అభివృద్ధి చేయిస్తుండడం యెల్లో బ్యాచ్‌కి మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితితో చంద్రబాబుకు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆశలు సన్నగిల్లితున్నట్లు అర్థమయింది. పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో పూర్తిగా అవగతం అయ్యింది. ఇక ఒక అడుగు ముందుకేసి.. ఆయన నియోజకవర్గమూ మారతారనే ప్రచారం, అదీ టీడీపీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. అందుకే కొత్తగా చివరి ఎన్నిక అంటూ ప్రకటనలు ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అందుకే ఇలా భావోద్వేగమైన ప్రకటనలు ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అఫ్కోర్స్.. ఆ ప్రకటనలకు జనాల నుంచి లభించిన స్పందన పెద్దగాఏమీ లేదు. తమ నాయకుడే ఇలా ధైర్యం కోల్పోతే.. ఇక తమ పరిస్థితి ఏంటని అనుకుంటేనే చంద్రబాబుపై జాలి, మరోవైపు పార్టీ పరిస్థితి ఇలా అయ్యిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకోవద్దన్న ప్రజలు.. ముందు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ద్రోహం చేయొద్దంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. తొలుత చంద్రబాబు కాన్వాయ్ పత్తికొండకు చేరుకోగానే అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. గో బ్యాక్ బాబు.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు దేవనకొండలో విద్యార్థి, ప్రజాసంఘాల సంఘాల నేతలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఇలా దొంగ డ్రామాలు ఆడుతూ.. తప్పుడు స్టేట్మెంట్లతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు నిరసన సెగలు తగలడం మాత్రం ఆగట్లేదు!. -
పొలిటికల్ వార్.. అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ కీలక భేటీ
బీజేపీపై వార్ ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినలో చక్రం తిప్పుతున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక, దేశంలో తాజా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. శనివారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్-23లోని కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్.. జాతీయ మీడియా సంస్థలకు చెందిన ప్రముఖ జర్నలిస్టులతో భేటీ కానున్నట్టు సమాచారం. కాగా, కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. గులాబీ బాస్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అర వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్సింగ్ కూడా పాల్గొంటారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి వస్తారు. అనంతరం, ఈ నెల 26న బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో, 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దిలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. షిర్డీ సాయిబాబా దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. తిరిగి ఈ నెల 29 లేదా 30న పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం వెళ్లే అవకాశం ఉంది. Former Uttar Pradesh Chief Minister Sri @YadavAkhilesh met Chief Minister Sri K. Chandrashekar Rao at his residence in New Delhi. The two leaders discussed current national issues. pic.twitter.com/eVKRymyFiE — Telangana CMO (@TelanganaCMO) May 21, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ వ్యతిరేక నినాదాలు.. పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్ -
దీదీ చేతులు రక్తంతో తడిశాయి : నడ్డా
కోల్‌కతా: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినాటి నుంచి కొనసాగుతున్న దాడులు, అల్లర్లు, రాజకీయ హింస నుంచి బెంగాల్‌ను, బెంగాల్ ప్రజలను కాపాడు తానని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రతిజ్ఞ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్‌కు వచ్చిన నడ్డా బుధవారం కోల్‌కతా నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ‘నార్త్ 24 పరగణాల సహా పలు జిల్లాల్లో అమానుష దాడుల్లో చనిపోయిన బీజేపీ సభ్యుల కుటుంబాలను కలుస్తా. ఇక్కడి దారుణ ఘటనల వివరాలను మొత్తం భారతావనికి తెలియజేస్తా. బెంగాల్ ప్రజలకు బీజేపీ సేవా కార్యక్రమాలు ఇకపైనా కొనసాగుతాయి. హింస కారణంగా 14 మంది బీజేపీ కార్య కర్తలు, మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయా రు. మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అల్లర్ల కారణంగా దాదాపు లక్ష మంది స్థానికులు సొంతూర్లను వదిలేసిపోయారు. ఈ కుట్ర వెనుక ఆమె ప్రమేయం ఉందిగనుకే ఆమె నోరు మెదపకుండా ఉన్నారు. హింసను ప్రేరేపించిన మమత చేతులు రక్తంతో తడిశాయి. గత ఏడాది అంపన్ తుపాను కారణంగా గ్రామాల్లో విధ్వంసం చూశాం. నేడు మమత కారణంగా అదే విధ్వంసం పునరావృతమైంది. హింస కారణంగా బెంగాళీలు పొరుగున ఉన్న అస్సాంకు వలసవెళ్లారు’ అని నడ్డా వ్యాఖ్యానించారు. -
బాడీ షేమింగ్
‘బోండాం’ అనడం బాడీ షేమింగ్. ‘బక్క పీనుగ’ అనడమూ బాడీ షేమింగే. స్త్రీని పురుషుడు చేసే బాడీ షేమింగ్ అయితే ఇంకా రకరకాలుగా ఉంటుంది. బాడీ షేమింగ్ అని అతడికి తెలియకపోవచ్చు. ఆమెకు తెలుస్తుంది. హర్ట్ అవుతుంది. ఏ విధంగానైనా స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడం అంటే ప్రకృతి ధర్మాన్నే అవమానించడమే. స్త్రీ దేహధర్మాలు, స్త్రీ దేహ స్వభావాలు విలక్షణమైనవి. ఆ విలక్షణతల కారణంగా కొన్ని విభిన్నతలకూ ఆమె దేహం లోనవుతూ ఉండొచ్చు. ఆ విభిన్నతలను ఎత్తిచూపుతూ ఒక మాట అనడం అంటే.. జన్మనిచ్చే జెండర్‌ను కించపరచడమే. వసుంధరారాజే (65) సీనియర్ లీడర్. రాజస్తాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి. మళ్లీ కనుక ఆమె ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ అవుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆమెను అడ్డుకోవాలంటే ఆమె ప్రభుత్వంలోని బలహీనతలేవో ఎత్తి చూపాలి. చేస్తానని చెయ్యని పనులేవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అయితే శరద్ యాదవ్, వసుంధరా రాజే ‘ఒంటిని’ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు! ఆయన కూడా సీనియర్ లీడరే. 73 ఏళ్లు. ‘ఏళ్లొచ్చాయ్ ఎందుకు?’ అనిపిస్తుంది రాజేను ఆయన చేసిన కామెంట్‌ని వింటే! వినే ఉంటారు. ‘‘వసుంధర కో ఆరామ్ దో. బహుత్ థక్ గయీ హై. మోటీ హో గయీ హై’’ అన్నారు. పోలింగ్‌కి ముందురోజు ప్రత్యర్థిపై ఆయన సంధించిన చివరి అస్త్రం అది! ‘‘వసుంధరకు విశ్రాంతి ఇవ్వండి. మనిషి బాగా లాౖÐð పోయి ఆయాస పడుతోంది’’ అని. స్త్రీని సవ్యంగా ఎదుర్కోలేకపోయినప్పుడే పురుషుడు ఇలా ఉక్రోషంతో ఆమె ఒంటి పైకి నోటిని ప్రయోగిస్తాడు. వాస్తవానికి శరద్, రాజే సమీప ప్రత్యర్థి ఏమీ కాదు. అయన్ది రాజస్తాన్ కూడా కాదు. ఎన్నికల ప్రచారం కోసం బిహార్ నుంచి వచ్చారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పడక, గతేడాది జేడీయూ నుంచి బయటికి వచ్చి, ఈ ఏడాది మే నెలలో సొంతంగా ‘లోక్తాంత్రిక్ జనతాదళ్’ పార్టీ పెట్టుకుని రాజస్తాన్ ఎన్నికల్లో రాజేకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ సందర్భంగానే శరద్, రాజే ఒంటిపై కామెంట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన వివరణ కూడా ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు క్యాబినెట్ మినిస్టర్‌గా చేసిన శరద్ యాదవ్.. ‘ఊరికే జోక్ చేశాను’ అన్నారు! ‘‘ఆమెను హర్ట్ చెయ్యాలని నా ఉద్దేశం కాదు. తనతో నాకు పాత పరిచయం ఉంది. ఆమెను కలిసినప్పుడు కూడా నేనిదే చెప్పాను.. మీరు లావౌతున్నారని’’ అన్నారు. శుక్రవారం జలావర్‌లోని ‘మహిళా పోలింగ్ బూత్’ నుంచి ఓటేసి వస్తూ.. ‘‘అతడి కామెంట్‌పై నేను ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయబోతున్నాను’’ అని రాజే మీడియా ప్రతినిధులతో అనగానే.. శనివారం ఆమెకు క్షమాపణలు చెబుతూ శరద్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్మృతి ఇరానీ (శరద్ యాదవ్) శరద్ యాదవ్ ఇలా మహిళల్ని కించపరుస్తూ, ‘బాడీ షేమింగ్’ (ఒంటి సైజు, ఒంటి షేప్, ఒంటి రంగును అవమానించడం) చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. మూడేళ్ల క్రితం స్మృతి ఇరానీని ఇలాగే పార్లమెంటులో.. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అన్నారు. గత ఏడాది విచిత్రంగా ఓటుకు, ఆడపిల్లలకు ముడిపెట్టి మాట్లాడారు. ఆడపిల్ల పరువు కన్నా ఓటు పరువు ముఖ్యమట. ‘‘ఆడపిల్ల అమ్ముడుపోతే ఇంటి పరువు, ఊరి పరువు మాత్రమే పోతాయి. ఓటు అమ్ముడు పోతే దేశం పరువే పోతుంది’’ అన్నారు. ఏంటో దానర్థం! ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని స్మృతి ఇరానీని అన్న మాటల్లోని పరమార్థం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. రాజ్యసభలో ఇన్సూరెన్స్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు డిబేట్ ఎటు నుంచి ఎటో వెళ్లిపోయి, ‘‘ఇండియాలో అందరికీ తెల్లగా ఉండే అమ్మాయిలే కావాలి. నల్ల అమ్మాయిలను ఎవరూ వధువుగా కోరుకోరు. దక్షిణాది మహిళలంతా నల్లగా ఉంటారు. అయినప్పటికీ వారిలో మెరుపు కనిపిస్తుంది..’’ అని యాదవ్ అన్నారు. అక్కడితో ఊరుకోకుండా ఇంకా వివరణ ఇవ్వబోతుంటే.. మంత్రి స్మృతి ఇరానీ డిప్యూటీ చైర్మన్ వైపు చూస్తూ ‘ఇక ఆపమనండీ’ అని అభ్యర్థించారు. దానికి యాదవ్ అసహనంతో.. ‘ఐ నో వాట్ యు ఆర్’ అని స్మృతిపై మండిపడ్డారు. రేణుకా చౌదరి (వెంకయ్య నాయుడు) ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సభ్యత్వపు పదవీకాలం పూర్తి చేసుకున్నవారిలో రేణుకా చౌదరి ఒకరు. ఆ వీడ్కోలు సభలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు, రేణుకా చౌదరికి మధ్య జరిగిన సంభాషణలోనూ రేణుక బాడీషేమింగ్‌కి గురయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న చిరకాల పరిచయం కారణంగా అది కేవలం ఉల్లాసభరితమైన వాగ్వాదంగా మాత్రమే మిగిలిపోయింది. బరువు టాపిక్ తెచ్చింది మొదట రేణుకే. తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె వెంకయ్యనాయుడును ఉద్దేశించి.. ‘సర్.. నా వెయిట్ గురించి అంతా వర్రీ అవుతున్నారు. కానీ ఇది మన వెయిట్ ఏంటో చూపించాల్సిన జాబ్ కదా’’ అన్నారు. అందుకు వెంకయ్యనాయుడు.. ‘‘మీరు వెయిట్ తగ్గండి. మీ పార్టీ వెయిట్ పెంచండి’’ అని సలహా ఇచ్చా రు. ఆ మాటకు రేణుక హాయిగా నవ్వేస్తూ.. ‘మా పార్టీ వెయిట్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు సర్. ఇటీస్ ఫైన్’ అన్నారు. అప్పటికే నాయుడు ఉపరాష్ట్రపతి. రేణుక గానీ, ఇతర మహిళలు కానీ పాయింట్ అవుట్ చెయ్యకపోవడంతో అది పెద్ద ఇష్యూ కాలేదు. షేక్ హసీనా (నరేంద్ర మోదీ) గత ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ఆడమనిషై ఉండీ టెర్రరిజాన్ని జీరో టాలరెన్స్ (ఏమాత్రం సహించకపోవడం)తో నియంత్రిస్తోంది’ అని ఆయన అన్నారు. ‘ఆడ మనిషై ఉండీ’ అనడంలో మెచ్చుకోలు ఉన్నప్పటికీ.. ‘కంపారిటివ్లీ బలహీనమైన’ అనే అర్థం ధ్వనిస్తుండడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇందులో బాడీ షేమింగ్ ఎక్కడున్నట్లు? ఉంది. ‘ఆడపిల్ల నయం కదా, ధైర్యంగా పోరాడింది’ అంటే.. అంతర్లీనంగా ఆమె బలహీనత స్ఫురిస్తుంది కదా. బలహీనమైన బాడీ అనడం షేమింగ్ కాక మరేమిటి?! మహిళల మీద (అబూ అజ్మీ) ఐదేళ్ల క్రితం సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ అజ్మీ ఒక కామెంట్ చేశాడు. ఆడవాళ్లను స్వేచ్ఛగా వదిలిపెడితే దోపిడికీ గురవుతారట. ఎందుకనంటే.. ‘‘వాళ్లు బంగారంలా విలువైనవారు. బాహాటంగా పెడితే ఆ బంగారాన్ని దోచుకునిపోతారు’’ అని ఆయన ఆందోళన. అందుకే ఆడవాళ్లు.. తోడు లేకుండా బయట తిరగకూడదు. చీకటైతే అసలు బయటికి రాకూడదు అని కూడా అన్నారు అజ్మీ. ఇదొక రకం బాడీ షేమింగ్. తమని తాము కాపాడుకోలేని దేహాలు అని చెప్పడమేగా! చివరికి ఆయన మాటలకు ఆయన కోడలు (కొడుకు ఫర్హాన్ భార్య) అయేషా టాకియా సోషల్ మీడియాలోకి వచ్చి క్షమాపణ చెప్పారు. ‘‘మా మామగారు అలా అని ఉండాల్సింది కాదు’’ అని. భార్యల మీద (శ్రీ ప్రకాశ్ జైస్వాల్) శ్రీ ప్రకాశ్ జైస్వాల్ అయితే ఏకంగా యావత్ద్దేశంలోని భార్యలనే బాడీ షేమింగ్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, మంత్రి ఆయన. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకు రెండేళ్ల క్రితం కాన్పూర్‌లోని ఒక మహిళా కాలేజ్‌లో ప్రసంగిస్తూ... ‘‘ఈ భార్యలున్నారే.. ముసలివాళ్లయిపోతారు. అప్పుడు వాళ్ల మీద ఏ ఆకర్షణా కలగదు’’ అన్నారు. ఎంత ఘోరమైన బాడీ షేమింగ్! పెద్ద చదువులుండి, పెద్ద హోదాలుండీ.. ఎందుకీ పెద్దవాళ్లు ఇలా చిన్న మాటలు మాట్లాడతారు? ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఏ రంగంలోని పురుషులైనా.. స్త్రీలను అవమానించడానికి, వ్యంగ్యంగా మాట్లాడటానికి వారి దేహాలను టార్గెట్ చెయ్యడం సంస్కారమేనా? బలవంతుణ్ని అనుకుంటాడు కదా మగవాడు! స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడమేనా అతడి బలం?! ప్రియాంకా చోప్రా (రాజ్‌నాథ్ సింగ్) కొన్ని కామెంట్లు పైకి బాడీ షేమింగ్‌గా అనిపించవు కానీ, లోతుగా చూస్తే వాటిల్లోనూ బాడీ షేమింగ్ కనిపిస్తుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్‌గా ఎన్నికైనప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా ప్రియాంక లక్నోలో ఉంటోంది. సీఎం స్థాయిలో ఉండి ఆయన ప్రియాంకను ప్రశంసించాల్సింది పోయి, ‘ఈ అందాలపోటీలను బ్యాన్ చెయ్యాలి. మన సంస్కృతిని ఇవి దిగజారుస్తున్నాయి’ అన్నారు. ఆయన ఉద్దేశం.. ఆడపిల్లలు వేదికలెక్కి ఒళ్లు చూపిస్తున్నారని! బ్యూటీ షేమింగ్‌లా కనిపించే బాడీ షేమింగ్ ఇది. -
పట్టు ఎవరిదో?
సాక్షి, మెదక్: పట్టణ ఓటర్లపై పార్టీలు కన్నేశాయి. వారిని ప్రసన్నం చేసుకొని ఆ ప్రభావం పల్లెలపై పడేలాగా పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టణాలపై పట్టు చిక్కితే పల్లె ఓటర్లను సైతం తమవైపు తిప్పుకోవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే జిల్లాలోని రాజకీయ పార్టీలు మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌లు మున్సిపాలిటీల్లో పట్టుపెంచుకుని తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా మెదక్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మూడు మున్సిపాలిటీల్లో 48, 646 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 26,519 మంది ఓటర్లు ఉండగా రామాయంపేట మున్సిపాలిటీలో 10,781 మంది ఓటర్లు ఉన్నారు. నర్సాపూర్ నియోకజవర్గం పరిధిలోని నర్సాపూర్ మున్సిపాలిటీలో 11346 మంది ఓటర్లు ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మున్సిపాలిటీల్లో ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ మున్సిపాలిటీల్లో పట్టుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్‌పై పట్టుకోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎత్తుగడలు మెదక్ మున్సిపాలిటీలో పట్టుకోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. మెదక్ మున్సిపల్ చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లు మెజార్టీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి ఉండటం ఆ పార్టీకి అనుకూలించే అంశం. దీనికి తోడు ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ మున్సిపాలిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్వయంగా తానే పట్టణంలోని ముఖ్యులను, కులసంఘాల నాయకులను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఆమె శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మెదక్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటర్ల మద్దతు కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ సహా కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్ల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నయ్యారు. అయితే పార్టీలోని కొంత మంది కౌన్సిలర్లు, నాయకుల్లో అసంతృప్తి ఉంది. దీనికితోడు మెదక్ పట్టణంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పట్టణ నేతల్లో కొంత అయోమయం ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మాజీ చైర్మన్, కాంగ్రెస్ బీసీ నేత భట్టి జగపతికి మెదక్‌లో మంచి పట్టు ఉంది. ఇది కాంగ్రెస్‌కు అనుకూలించే అంశం. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. అయితే పట్టణ కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ సైతం మెదక్ మున్సిపాలిటీలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన రామాయంపేట మున్సిపాలిటీలో 10,781 మెజార్టీ ఓట్ల సాధన కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి సొంత ప్రాంతం కావడంతో టీఆర్ఎస్కు అనుకూలిస్తుందని ఆ పార్టీ నేతల అంచనా. అయితే డివిజన్ కేంద్రం కోసం రామాయంపేట పట్టణ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నర్సాపూర్‌పై ఇరుపార్టీల కన్ను నియోజకవర్గ కేంద్రంతోపాటు మున్సిపాలిటీ అయిన నర్సాపూర్‌పై పట్టుకోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన నర్సాపూర్ మున్సిపాలిటీలో 11346 మంది ఓటర్లు ఉన్నారు. రెండు పార్టీలు మెజార్టీ ఓట్లు సాధించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి నర్సాపూర్ మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. త్వరలో ఇంటింటి ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సునీతారెడ్డి శుక్రవారం ప్రచారం ప్రారంభించారు. ఇరువురు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నేత మురళీయాదవ్‌కు మంచి పట్టు ఉండటం టీఆర్ఎస్కు అనుకూలించే అంశం. అభివృద్ధి పనులు, నర్సాపూర్‌ను మున్సిపాలిటీగా మార్చడం, బస్టాండు నిర్మాణం తదితర అంశాలు తమకు కలిసివస్తాయని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ పట్టణ నాయకులు రమణారావు, అశోక్‌గౌడ్ తదితరులు ఎమ్మెల్యేకు మద్దతుగా పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సునీతారెడ్డి నర్సాపూర్‌లో మెజార్టీ ఓట్లు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలకు గాలం వేయడంతోపాటు పట్టణ సమస్యలు, అభివృద్ధి పనుల్లో లోపాలు, డబుల్బెడ్రూం ఇళ్లు పూర్తి కాకపోవడం తదితర అంశాలతో ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, నర్సింలు, నయీం తదితరులు నర్సాపూర్ మున్సిపాలిటీలో సునీతారెడ్డికి ఓటర్ల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముందు ముందు రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. -
యాక్షన్ - రియాక్షన్
-
చట్టాలు సామాన్యులపై ప్రయోగించడానికేనా?
‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్ భార్య సుజన సూటిప్రశ్న సాక్షి, విశాఖపట్నం: ‘‘దళితునిగా పుట్టాలని ఎవరు అనుకుంటారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అన్నారు. అప్పుడు గుర్తుకు రాని చట్టాలు మాలాం టి సామాన్యులపై ప్రయోగించడం ఎంత వరకు న్యాయం. మా బతుకు మేం బతు కుతున్నా..మాపై కక్ష సాధిస్తున్నారు’’ అని ‘పొలిటికల్ పంచ్.ఇన్ఫో’ ఫేస్బుక్ పేజీ అడ్మిన్,సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ భార్య సుజన అన్నా రు. రవికిరణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు లు వేధిస్తున్న విషయం తెలిసిందే.టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు ఇటీవల విచారణకు పిలిపించి రవికిరణ్‌ను అరెస్ట్ చేశారు.విశాఖ సెంట్రల్‌జైలులో ఉన్న ఆయనను సుజన గురువారం కలిశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. -
నా భర్తను కావాలనే ఇరికించారు: సుజన
విశాఖపట్నం: ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్, సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్త అయిన ఇంటూరి రవికిరణ్ పై సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుందని ఆయన భార్య సుజన ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ పోలీసులు రవికిరణ్ ను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ సెంట్రల్ జైలుకు గురువారం వెళ్లిన సుజన తన భర్త రవికిరణ్ ను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే తన భర్త రవికిరణ్ ను లేనిపోని కేసుల్లో ఇరికించారని ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల హైదరాబాద్ లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని బలవంతంగా ఏపీకి తరలించి రవికిరణ్ ను బెదిరింపులకు గురిచేసినా ప్రయోజనం లేకపోయిందని భావించి ఏకంగా అరెస్ట్ చేయించారు. ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ–1 మోహనరావు ఏప్రిల్ 26న రవికిరణ్‌కు నోటీసులు పంపారు. మే 4న విచారణకు రావాలని ఆదేశించారు. మే9న వచ్చేందుకు అనుమతి తీసుకుని మంగళవారం విశాఖకు వచ్చిన రవికిరణ్‌ను దాదాపు నాలుగు గంటలపాటు పోలీసులు విచారించి, ఆపై అరెస్ట్ చేశారు. రవికిరణ్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. -
‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై విచారణకు పిలిచి అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, విశాఖ/ద్వారకానగర్: ప్రభుత్వం, అధికార టీడీపీ తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్, సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌పై సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవలే హైదరా బాద్‌లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని, ఏపీ కి తరలించి పలు ప్రాంతాల్లో తిప్పుతూ బెది రింపులకు గురిచేసినా ఆయన లొంగకపోవ డంతో ఇప్పుడు ఏకంగా అరెస్టు చేయించిం ది. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు ఆధారం గా రవికిరణ్‌ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామా జిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ రవికిరణ్‌ను టీడీపీ ప్రభుత్వం వేధిస్తున్న విషయం తెలిసిందే. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రవికిరణ్‌పై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ–1 మోహనరావు ఏప్రిల్ 26న రవికిరణ్‌కు నోటీసులు పంపారు. విచారణ నిమిత్తం మే 4న రావాలని ఆదేశించారు. 9న వచ్చేందుకు అనుమతి తీసుకుని మంగళవారం వచ్చిన రవికిరణ్‌ను 4 గంటలపాటు పోలీసులు విచా రించి, అరెస్ట్ చేశారు. అనంతరం రవికిరణ్‌కు కోర్టు ఈ నెల 23 వరకు రిమాండ్ విధిం చింది. ఈ సందర్భంగా రవికిరణ్ మీడి యాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిత తనపై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయంగా పెట్టారన్నారు. సీఎం బాబు, మంత్రి లోకేశ్ తనపై కక్ష సాధిం పు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులా? వైఎస్సార్సీపీ ‘ఐటీ’ అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రవికిరణ్‌ను ఏపీ పోలీ సులు అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధు సూదన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభు త్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టడం ద్వారా నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేయగలమనుకోవడం అవివేకమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై ఎప్పుడో చేసిన పోస్టును సాకుగా చూపుతూ అప్రజాస్వామి కంగా పోలీసులు రవికిరణ్‌ను అరెస్టు చేశా రని విమర్శించారు. టీడీపీ వైఫల్యాలు, అవి నీతిని, లోకేశ్ అసమర్థతను నెటిజన్లు వ్యంగ్యాస్త్రాల రూపంలో ప్రజల్లోకి తీసు కెళ్తుండడాన్ని తట్టుకోలేక టీడీపీ ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేస్తోందన్నారు. -
పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్
-
ఈ ఉన్మాదంపై చర్యలేవి..?
ఏది ఉన్మాదమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పోస్టులు చూస్తుంటేనే మనకు అర్ధమైపోతుంది. పొలిటికల్ పంచ్, వైఎస్సార్సీపీ అభిమానుల పోస్టులలో సునిశితమైన హాస్యం, వ్యంగ్యం, సమ కాలీన రాజకీయాంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండగా.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల పోస్టులు ఎంతో అసభ్యకరంగా ఉన్నాయి. వారు ఎంత ఉన్మాద పూరితంగా ఉన్నారో అర్ధమౌతుంది. ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాక, అసభ్య కరమైన పదజాలాన్ని ఉపయోగించారు. మరణించినవారి గురించి దుర్భాషలాడరాదన్న కనీస ఇంగితాన్ని కూడా మరచిపోయారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను మాత్రమే కాక ఆయన కుటుంబ సభ్యులను, మహిళలను కూడా కించపరుస్తూ, అసభ్యపదజాలం ఉపయోగిస్తూ, అవాస్తవాలను పోగుచేసి పోస్టులు పెట్టారు. ఇలాంటి అనేక వందల పోస్టులపై అనేక సందర్భాలలో ఫిర్యాదు చేసినా రాష్ట్రప్రభుత్వం, పోలీసులు పట్టించు కోలేదని వైఎస్సార్సీపీ నాయకులంటున్నారు. -
జైల్లో వేస్తాం.. మొద్దుశీనులా జరగొచ్చు!
► రవికిరణ్‌కు పోలీసుల బెదిరింపులు ► విచారణ పేరిట వేధింపులు సాక్షి, అమరావతి బ్యూరో: ‘మేము తలచుకుంటే ఏదైనా చేస్తాం.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాం.. జైల్లో వేస్తాం.. ఎక్కువ రోజులు జైల్లో ఉండేలా చూస్తాం.. అక్కడ నీ పక్కన ఉండే ఖైదీ ఏమైనా చేయొచ్చు.. మొద్దుశీనులా ఏదైనా జరగొచ్చు.. అప్పుడు మాకేమీ సంబంధం ఉండదు..’ అని గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ‘పొలిటికల్ పంచ్’ ఫేస్బుక్ పేజీ అడ్మిన్ రవికిరణ్‌ను బెదిరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వివిధ రకాలుగా వేధించి.. బెదిరించి.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేసిన తీరును రవికిరణ్ శనివారం ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మందడం స్టేషన్లో ఉంచారు.. ‘‘శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు మా ఇంటికి వచ్చారు. నీ మీద ఒక కేసు ఉంది. గుంటూరు రావాలని నన్ను తీసుకెళ్లారు. కేసు ఏమిటని పోలీసులను అడిగినా సమాధానం చెప్పలేదు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మందడం పోలీసు స్టేషన్లో ఉంచారు. అక్కడ నా పేరు, ఇతర వివరాలు అడిగారు. అప్పుడు మరోసారి ‘నాపై కేసు ఏంటి సార్’ అని అడిగితే.. శాసనసభను కించపరుస్తూ పోస్టు పెట్టావు. దానిపై మాకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. పోస్టింగుపై పోలీసులకు వివరణ ఇచ్చాను. శాసనసభ, మండలిని అవమానించడం నా ఉద్దేశం కాదని వివరించాను. పెద్దల సభ అంటే.. పెద్దల సినిమాగా భావించడం వల్లే లోకేష్ అందులో కూర్చుంటానని అడుగుతున్నాడన్న భావనతోనే పోస్టింగ్ పెట్టానని వివరణ ఇచ్చాను. లోకేష్ మీద అది సెటైర్ మాత్రమే గాని, చట్టసభను అవమానపరచడం కాదని చెప్పాను. ఈ పోస్టింగ్ తగదని కామెంట్లు వచ్చాయని, వెంటనే ఆ పోస్టింగ్ తొలగించానని చెప్పా. ఇది జరిగి కూడా 2 నెలలు అయిందన్నాను. ఆ తర్వాత ఎవరో వస్తున్నారని పేర్కొంటూ నన్ను భవనంలోని రెండవ అంతస్తుకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. వాహనాలు మార్చుతూ 4 గంటలు తిప్పారు... మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్ వెనుకవైపు నుంచి నన్ను తీసుకెళ్లి ఆటోలో కూర్చొబెట్టి అరకిలోమీటర్ దూరం తీసుకెళ్లాక.. అక్కడ మారుతీ స్విఫ్ట్ కారులోకి మార్చారు. అక్కడి నుంచి ఓ 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాక.. బ్లాక్ స్కార్పియో వాహనంలోకి నన్ను మార్చి.. సీఎం నివాస ప్రాంతం కరకట్ట చుట్టూ సుమారు 4 గంటలపాటు తిప్పారు. తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పారు. కొంత దూరం వెళ్లాక.. ఓ ఆయిల్ కంపెనీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. మళ్లీ నా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ డబ్బులిస్తే నీవు పొలిటికల్ పంచ్ ను నిర్వహిస్తున్నావు కదా? జగన్ కోసం పనిచేస్తున్నావు కదా? అంటూ నన్ను పలు విధాలుగా ప్రశ్నించారు. నేను సొంతంగా రెండున్నరేళ్లుగా పొలిటికల్ పంచ్ ఫేస్బుక్ పేజీ నిర్వహిస్తున్నాను. నేను వృత్తిపరంగా వెబ్ డిజైనర్‌ని. కాబట్టి డిజైన్స్ అవసరమైతే.. డబ్బులు తీసుకొని చేసి ఇస్తా. వైఎస్సార్సీపీకి కూడా వెబ్ డిజైనింగ్ చేసి ఇచ్చాను. టీడీపీ డబ్బులిస్తే.. వారికి కూడా డిజైనింగ్ చేసిపెడతాను. పొలిటికల్ పంచ్ ను మాత్రం ‘ఫ్రీలాన్సర్’గా నిర్వహిస్తున్నానని చెప్పాను. బెదిరించారు.. జైలులో పెడతామన్నారు.. ఎన్ని రకాలు ప్రశ్నించినా నేను ఒకటే సమాధానం చెప్పడంతో పోలీసులు బెదిరింపులకు దిగారు. లోకేష్ మీదే ఎందుకు పోస్టింగులు పెడుతున్నావన్నారు. లోకేష్‌పై ఇకపై పోస్టింగులు పెట్టొద్దన్నారు. సార్ లోకేష్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు కాబట్టి అతనిపై పోస్టింగులు పెడుతున్నాను. ఆయన అన్న మాటలపైనే పెట్టాను. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ట్రెండ్ అయినప్పుడు అతనిపైనా పోస్టింగులు పెట్టాను. ఇప్పటి వరకు పొలిటికల్ పంచ్‌లో 2,500 వరకు పోస్టింగులు పెట్టాను. అందులో లోకేష్‌పై ఒక 50 వరకు ఉండొచ్చు అన్నాను. అయినా పోలీసులు నామాటలను విశ్వసించలేదు. నిజం చెప్పకుంటే నీకే ఇబ్బందులన్నారు. నీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామని, జైల్లో పెట్టిస్తామని చెప్పారు. అక్కడ మొద్దుశీనులా ఏదైనా జరగొచ్చని బెదిరించారు. చివరకు నిన్ను అరెస్టు చేయడం లేదని, నోటీసులు ఇస్తామని చెప్పారు. టైప్ చేసిన కాగితాలపై మూడు చోట్ల సంతకాలు పెట్టించుకున్నారు. 25వ తేదీన పోలీసుస్టేషన్‌కు వచ్చి నోటీసుపై సమాధానం చెప్పాలన్నారు. నేను సరే అన్నాను. అనంతరం పోలీసులు నన్ను శనివారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌లో దించేసి వెళ్లిపోయారు’’ అని రవికిరణ్ వివరించారు. -
మంత్రి పదవికి లోకేశ్ అనర్హుడు: అంబటి
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. సోషల్ మీడియా ఫిప్త్ ఎస్టేట్‌గా మారిందని, దాన్ని అణచివేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే సోషల్ మీడియాలో అన్ని నిజాలే ఉంటాయని తాను అనడం లేదని, అయితే వాస్తవాలకు దగ్గరకు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. మంత్రి పదవికి లోకేశ్ అనర్హుడని, పరిజ్ఞానం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. విమర్శలు చేసినంత మాత్రాన పొలిటికల్ పంచ్ రవికిరణ్‌ను అరెస్ట్ చేశారా అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. అసలు రవికిరణ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని, కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని, దీనిపై పోలీసులపై కూడా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అరెస్ట్‌లు చేసేకంటే లోకేశ్‌కు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తే మంచిదని సూచించారు. పరిణితి లేని వ్యక్తిని తీసుకువచ్చి మూడు శాఖలకు మంత్రిని చేస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. లోకేశ్‌కు మంత్రి స్థాయిలేదని, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఏం చెబితే అది చేయాలనే మైండ్‌సెట్‌తో పోలీసులు ఉన్నారని, ఆ పద్ధతి మార్చుకోవాలన్నారు. అభద్రతా భావంతో ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు అందరూ సోషల్ మీడియావైపు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మీడియాను కంట్రోల్ చేయాలని చూడటం సరికాదని అన్నారు. -
మంత్రి పదవికి లోకేశ్ అనర్హుడు: అంబటి
-
‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్ అరెస్ట్
-
‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్ అరెస్ట్
► అర్ధరాత్రి అతడి ఇంటి నుంచి తీసుకెళ్లిన తుళ్లూరు పోలీసులు ► శంషాబాద్ డీసీపీకి రవికిరణ్ భార్య ఫిర్యాదు ► రాజకీయాలపై స్పందించడం నేరమవుతుందా అని ప్రశ్న ► సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు ► వైఎస్సార్సీపీ నేతల విమర్శ హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పొలిటికల్ పంచ్ వెబ్సైట్ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్ (35)ను గురువారం అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రవికిరణ్.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ ఇంట్లో ఏడాది న్నరగా అద్దెకు నివాసముంటున్నాడు. ఇంట్లోనే వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరా త్రి ఒంటిగంటకు ఆదర్శనగర్ కాలనీలో ఉన్న అత డి నివాసానికి ఐదుగురు పోలీసులు వచ్చారు. ముందుగా ఇంటి యజమాని నీరటి రాజుతో మాట్లాడిన వారు.. ఆ తర్వాత రవికిరణ్ ఇంట్లోకి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మీరు ఎవరని రవికిరణ్ భార్య సుజన ప్రశ్నించగా.. తాము తుళ్లూరు పోలీసులమని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అభ్యంతరక రంగా వెబ్సైట్లో ప్రచారం చేస్తున్న కారణంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లారు. దీంతో సుజన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డీసీపీకి ఫిర్యాదు అర్ధరాత్రి వచ్చి తన భర్తను కొందరు తుళ్లూరు పోలీసులమంటూ తీసుకెళ్లారని, ఇంతవరకు తనకు ఎలాంటి సమచారమూ లేదని, తన భర్త ఆచూకీ కనుగొనాలంటూ రవికిరణ్ భార్య సుజన శంషా బాద్ డీసీపీ పి.వి.పద్మజకు గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన భర్త కిడ్నాప్ అయి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినంత నేరం తన భర్త ఏమి చేశాడని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న పరిస్థితులపై పౌరులుగా స్పందించడం నేరమవుతుందా అని నిలదీశారు. ఏపీ పోలీసులే తన భర్తను తీసుకెళ్లి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అసహనం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పరిపాలన తీరుతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోయిందని వైఎస్సార్సీపీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, అరుణ్‌కుమార్ అన్నారు. రవికిరణ్ కుటుంబానికి మద్దతుగా వారు శంషాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమ వుతున్న బాబు సర్కారు మీడియాతో పాటు సోష ల్ మీడియాను అణగదొ క్కేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించే హక్కు ప్రజలకు లేదా అని నిలదీశారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నిం చారు. రవికిరణ్ అరెస్ట్ అన్యాయమన్నారు. వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉం టుందని తెలిపారు. రవికిరణ్ కుటుంబాన్ని పరా మర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నేత తాడి భాస్కర్‌రెడ్డి, ఆర్.రవిశంకర్ తదితరులున్నారు. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదుతో అరెస్టు: గుంటూరు ఎస్పీ నాయక్ సాక్షి, అమరావతి: శాసనమండలి భవనం ఫొటోపై పోర్నోగ్రఫీ ఫొటో పెట్టినందునే ‘పొలిటికల్ పంచ్’ వెబ్సైట్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ మీడియాకు తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. శానసనసభ కార్యదర్శి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రవికిరణ్‌పై కేసులు నమోదు చేశామన్నారు. విచారణ నిమిత్తం రవికిరణ్‌ను గుంటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. -
సోషల్ మీడియాపై నియంత్రణా..?
కొన్నేళ్లుగా చర్చకు వస్తున్న అంశం... సోషల్ మీడియాపై నియంత్రణ. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాలు, తమకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై చట్టాన్ని ఆధారం చేసుకుని నియంత్రణా (నియంతృత్వ) చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఏపీ శాసన మండలిపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలపై రవికిరణ్ అనే వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంశాలపై ప్రజలకు సరైన అవగాహన ఉందా..? ఈ విషయంలో చట్టం ఏం చెబుతోంది..? సోషల్ మీడియా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? సోషల్ మీడియా అడ్మిన్ అరెస్టు.. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిపై సోషల్ మీడియాలో అసత్య, అభ్యంతరకర ప్రచారం చేస్తున్నాడనే కారణంతో పొలిటికల్ పంచ్ అనే ఫేస్బుక్ పేజీ నిర్వాహకుడైన రవికిరణ్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తెలిపారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘శాసనమండలి పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దల సభను అసభ్యకరంగా చిత్రించిన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. అక్కడి నుంచి తీసుకొచ్చిన అనంతరం, విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీని మార్ఫింగ్ చేస్తూ అడల్ట్ పిక్చర్ ఫోటోలను పోస్ట్ చేసినందుకు గాను అతని పై సెక్షన్ 67 ఐటీ యాక్ట్, ఐపీసీ 299 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం’ అన్నారు. రవికిరణ్ ఏం చేశాడు..? ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి పొలిటికల్ పంచ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పేజ్‌ను నిర్వహిస్తున్నాడు. రాజకీయ అంశాలు, నేతలపై సెటైర్లు ఇందులో ఉంటాయి. కాగా సోషల్ మీడియాలో ఏపీ శాసన మండలిలో అసభ్యకర ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. గతంలో సంఘటనలు.. ► 2012లో శివసేన అధినేత బాల్‌థాక్రే మరణించిన సందర్భంగా ముంబైలో బంద్ పాటించారు. ఓ వ్యక్తి మరణించినంత మాత్రాన బంద్ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని ఓ యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. మరో యువతి దీనికి లైక్ కొట్టింది. దీంతో బంద్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేసినందుకు వారిద్దరినీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువతుల అరెస్టుపై పెద్ద దుమారమే రేగింది. చాలా మంది ప్రముఖులు ఈ అరెస్టులను ఖండించారు. అప్పటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ మార్కండేయ ఖట్జూ కూడా అరెస్టును తీవ్రంగా తప్పుబట్టారు. ► 2012 ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శిస్తూ ఉన్న ఓ కార్టూన్‌ను అంబికేష్ మహాపాత్ర అనే ఓ ప్రొఫెసర్ తన స్నేహితుడికి షేర్ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు అంబికేష్ని, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ఆధారంగా అంబికేష్ను అరెస్టు చేయడాన్ని కలకత్తా కోర్టు తప్పుబట్టింది. నిందితులపై కేసు కొట్టివేయడంతోపాటు, చెరో రూ.50 వేలను నష్టపరిహారంగా అందజేయాలని మమత ప్రభుత్వానికి సూచించింది. సెక్షన్ 66 (ఎ) రద్దు.. సోషల్ మీడియా ద్వారా, వెబ్సైట్లలో అభ్యంతరకర అంశాల్ని ప్రచారం చేస్తే గతంలో 66 (ఎ)–2008 చట్టప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. అయితే రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని, పౌరుల భావవ్యక్తీకరణ హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పౌరుల భావవ్యక్తీకరణ హక్కును సెక్షన్ 66(ఎ) నిరోధిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సెక్షన్‌పై గతంలో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ 2012లో తొలిసారి న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘాల్ కోర్టులో పిటిషన్ వేసింది. శివసేన అధినేత బాల్‌ఠాక్రే చనిపోయినప్పుడు ముంబైలో బంద్ పాటించడంపై ఓ విద్యార్థిని ఫేస్బుక్లో వ్యతిరేకతను వ్యక్తంచేసింది. ఈ కామెంట్‌కు మరొకరు లైక్ కొట్టడంతో నేరంగా పరిగణించి వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఈ సెక్షన్‌ను సవరించాలని శ్రేయ తన పిటిషన్లో కోర్టును కోరింది. అంతేకాకుండా పౌరుల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి సెక్షన్లను రద్దుచేయాలని కూడా ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేసింది. శ్రేయ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తుదితీర్పును వెలువరించింది. జాగ్రత్తలేంటి..! ► గత సంఘటనల్లో ప్రభుత్వాలు చేసిన అరెస్టులను కోర్టులు తప్పుబట్టాయి. సోషల్ మీడియాలో వారు చేసిన పోస్టుల ఆధారంగా అరెస్టు చేయడాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని కోర్టులు వ్యాఖ్యానించాయి. ► అలాగని ఏది పోస్టు చేసినా శిక్ష నుంచి తప్పించుకోవచ్చనుకుంటే పొరపాటే. ► అందుకే సోషల్ మీడియాలో కొనసాగుతున్న పోస్టింగులపై అవగాహన ఉండాలి. వాట్సప్‌నకు సంబంధించి ఏ గ్రూప్‌లో అభ్యంతరకర అంశం పోస్ట్ చేసినా, దానికి అడ్మినిస్ట్రేటర్‌దే బాధ్యత. అనుచిత పోస్టులు చేసే వారిని గ్రూపు నుంచి తొలగించాలి. అవసరమైతే అనుచిత పోస్టుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ► ఇక ఫేస్బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్ మీడియా వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మతాలను కించపరిచేలా, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ► భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగపరచకుండానే సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవాలి. ► సమాజంలో ఉద్రిక్తతలు పెంచే, ఘర్షణలు తలెత్తే పోస్టులు చేయకుండా ఉండడమే మేలు. ► అసత్యపు ప్రచారాలతో కూడిన పోస్టులు షేర్ చేయకూడదు. ► ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు సోషల్ మీడియాని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అప్రమత్తతతో, అవగాహనతో మసలుకోవడం తప్పనిసరి. – సాక్షి, స్కూల్ ఎడిషన్