ravindar Rao
-
ఉద్యమకారులకు న్యాయం జరగలేదు
పాలకుర్తి (వరంగల్): తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పని చేసిన నాయకులకు న్యాయం జరగలేదని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో తక్కెళ్లపల్లి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ద్విచక్రవాహనాల ర్యాలీతో బృందావన్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. పబ్బతి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉద్యమ కారులసభలో తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ నా రాజకీయ గురువు ఎన్. యతిరాజారావు ఆశీస్సులు తీసుకుని సభకు హాజరయ్యానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన నాయకులు, కార్యకర్తలను ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు విస్మరించారని ఆరోపించారు. 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన దుగ్యాల శ్రీనివాస్‌రావు పార్టీని మోసగించి కాంగ్రెస్‌లో చేరాడని గుర్తు చేశారు. 2009లో పాలకుర్తి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న తనకు అవకాశం ఇవ్వకుండా మహాకూటమిలో భాగంగా టీడీపీలో ఉన్న దయాకర్‌రావుకు ఇచ్చారని అన్నారు. 2014లో ఇతర పార్టీ నుంచి వచ్చిన డాక్టర్ సుధాకర్‌రావుకు అవకాశం ఇస్తే ఆయన ఓడిపోయారని తెలిపారు. ఉద్యమకారులకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సరైన న్యాయం చేయాలని, వారిని కష్టపెట్టొద్దని ఎమ్మెల్యే దయాకర్‌రావు చెప్పారని చెప్పారు. ఉద్యమకారులకు గుర్తింపునివ్వని ఎమ్మెల్యే ఉద్యమంలో పని చేసిన నాయకులకు తగిన గుర్తింపు స్థానిక ఎమ్మెల్యే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గ్రామస్థాయి నుంచి ఉద్యమకారులు ఐక్యమవుతతున్నారని అన్నారు. ఉద్యమ నేతకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రినే కోరడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. మూడు రోజుల్లో ఉద్యమకారులను సంప్రదించి సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. సమావేశంలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంఘం జిల్లా నాయకులు సందెల సునీల్, గణగాని రాజేందర్, కాశబోయిన యాకయ్య, ప్రభాకర్, కర్ర రవీందర్‌రెడ్డి, అల్లబాబు, తాళ్లపల్లి నర్సయ్య గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
హమ్మయ్య.. కమిషనరొచ్చారు!
తొమ్మది నెలల తర్వాత రెగ్యులర్ కమిషనర్ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా రవీందర్రావు జోగిపేటలో సస్పెన్షన్.. ఇక్కడ పోస్టింగ్ ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేనా? సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ రెగ్యులర్ కమిషనర్‌గా రవీందర్రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ చెర్ పర్సన్ విజయలక్ష్మి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు నెలల క్రితం తెలంగాణ హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని జోగిపేట-అందోల్ నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసిన రవీందర్రావును కలెక్టర్ జూల్12న సరెండర్ చేశారు. అదే అధికారి జిల్లా కేంద్రానికి కమిషనర్‌గా వచ్చారు. దీంతో ఏ మేరకు సమస్యలు పరిష్కారం అవుతాయోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు తొమ్మిది నెలల పాటు ఇన్చార్జి కమిషనర్లతో పాలన కుంటుపడిందని సర్వత్రా ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికి తోడు ప్రధానంగా ఇంటి అనుమతుల సమస్య తీవ్రంగా ఉంది. గత ఆరు నెలలుగా ఇంటి నిర్మాణల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కాని అనుమతులు ఇవ్వ లేదు. దీని కోసంగ గత ఇనచార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఏజేసీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తానని తేల్చి చెప్పేవారు. దీంతో పాలకవర్గ సభ్యులు కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌తో కలిసి మంత్రి పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇన్చార్జి కమిషనర్ బాధ్యతల నుంచి ఏజేసీని తప్పించి రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల వద్దకు పలు మార్లు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జోగిపేటలో సస్పెండ్‌కు గురైన జోగిపేట నగర పంచాయతీ కమిషనర్‌ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. విమర్శల వెల్లువ నగర పంచాయతీకి విధులు నిర్వహిస్తున్న కమిషనర్‌ను గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇవ్వడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో గ్రేడ్-1 అధికారిని నియమించాల్సి ఉంది. కాని నగర పంచాయతీకి కమిషనర్‌గా, ఆపై సస్పెండ్ అయిన అధికారిని ఎలా గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తారని స్వయంగా ఆ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. -
అయ్యా.. ఆసరా..
భీమదేవరపల్లి : తమ పింఛన్లు తొలగించారని ఆగ్రహం చెందిన వృద్ధులు, వితంతులు, వికలాంగులు మండలంలోని మాణిక్యాపూర్‌లో ఆందోళనకు దిగారు. పింఛన్ల పంపిణీ కోసం బుధవారం గ్రామ పంచాయితీ కార్యాలయానికి వచ్చిన సీనియర్ అసిస్టెంట్ రవీందర్రావు, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, సర్పంచ్ వనపర్తి రాజయ్య, ఉపసర్పంచ్ లక్ష్మయ్య, వార్డుసభ్యులను నిర్బంధించారు. అర్హులకు పింఛన్లు రావడం లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేతిరి లక్ష్మారెడ్డి ఆరోపించారు. గ్రామంలో సర్వే చేసిన ఏఎస్వో విజేందర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పింఛన్ మంజూరుచేస్తామని హామీ ఇచ్చేవరకు విడుదల చేయమని భీష్మించారు. అర్హులకు న్యాయం చేస్తామని ఎంపీడీవో నర్సింహారెడ్డి హామీ ఇవ్వడంతో మూడు గంటల అనంతరం వారిని విడుదల చేశారు. పింఛన్లు తీసేశారంటూ ముస్తఫాపూర్ జీపీ పరిధిలోని పలువురు బుధవారం కొత్తకొండ-ముల్కనూర్ రోడ్డులోని గొల్లపల్లి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. -
సమగ్ర సర్వేపై విస్తృత ప్రచారం
‘గులాబీ’ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు 11న గ్రామాల్లో ర్యాలీలు, సభలు 12న మండల కేంద్రాల్లో సమావేశాలు 16న విద్యార్థులచే ర్యాలీలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు హన్మకొండ సిటీ : సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు దోహదపడే సమగ్ర సర్వేపై టీఆర్ఎస్ తరఫున విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. హన్మకొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలనే లక్ష్యంతోపాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమగ్ర సర్వేకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చా రు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషిచేయూలన్నారు. అనంతరం సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించేందు కు టీఆర్ఎస్ తరఫున నిర్వహించనున్న ప్రచార కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 11న టీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్వర్యంలో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేరోజు గ్రామ నడిబొడ్డున బహిరంగ సమావేశం నిర్వహించి సర్వే ప్రాధాన్యాన్ని వివరిస్తామన్నారు. 12న ఉదయం 11 గంటలకు మండల కేంద్రాల్లో సమావేశాలు, 16న పాఠశాలల విద్యార్థులతో గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ర్యాలీలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. 17 పార్టీ జిల్లా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామన్నారు. వారి విమర్శలు అర్థం లేనివి... రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు అర్థం పర్థం లేని విమర్శ లు చేస్తున్నారని... అవాకులు, చెవాకు లు పెలుతున్నారని రవీందర్రావు ధ్వ జమెత్తారు. రాజకీయ అవినీతి, దళారులు లేని ప్రజాపాలన జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. విద్యుత్ ప్రాజెక్టులన్ని సీమాంధ్రలో ఉన్నాయ ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. విద్యుత్ సరఫరా లోపంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రజలకు వివరించారని, దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. మూడేళ్లలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎయిమ్స్ అస్పత్రి స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం అదేశించిందని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు నాయకులు భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, మార్నేని రవీందర్రావు, ఇండ్ల నాగేశ్వర్రావు, గైనేని రాజన్, సంపత్, అంజయ్య, జయరాజ్, పీఆర్‌రెడ్డి, జోరిక రమేశ్, చాగంటి రమేశ్, నయూమొద్దీన్ పాల్గొన్నారు.