Ravinder Kumar
-
బహిరంగ మూత్రవిసర్జన వద్దన్నందుకు..
ఢిల్లీ: దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తాము భోజనం చేసే చోట.. మూత్రవిసర్జన చేస్తోన్నయువకులను అడ్డుకున్న ఓ వ్యక్తి.. చివరికి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై ఈ ఘాతుకానికి పాల్పడిన యువకులు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులుగా అనుమానిస్తున్నారు. వాయువ్య ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ మిలింద్ దంబ్రే చెప్పిన వివరాలిలాఉన్నాయి.. స్థానిక జీటీబీ నగర్‌కు చెందిన రవీందర్ కుమార్(33) ఈ-రిక్షా డ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం జీబీటీ నగర్ మెట్రో స్టేషన్ ముందున్న పార్కింగ్‌లో ఆటోను నిలిపి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా.. పార్కింగ్ గోడ పక్కనే చేతిలో బీర్ క్యాన్లున్న ఇద్దరు యువకులు మూత్రవిసర్జన చేస్తుండటం కనిపించింది. అది.. ఆటో డ్రైవర్లు భోజనానికి కూర్చునే చోటు కావడంతో రవీందర్ పరుగున వెళ్లి వాళ్లను అడ్డుకున్నాడు. పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లాల్సిందిగా సూచించాడు. ‘కావాలంటే నా దగ్గర చిల్లరుంది. ఇవి తీసుకుని టాయిటెల్లోకి వెళ్లండి..’ అని అన్నాడు. రవీందర్ మాటలతో రెచ్చిపోయిన యువకులు అతనితో గొడవపెట్టుకుని, తీవ్రంగా హెచ్చరించి వెళ్లిపోయిన యువకులు.. తిరిగి సాయంత్రం 4 గంటలకు 30 మంది స్నేహితులతో కలిసి ఆటోస్టాండ్‌కు వచ్చారు.. ఆకుపచ్చ చొక్కా వేసుకున్న రవీందర్ అక్కడ కనిపించకపోవడంతో దాదాపు నాలుగు గంటలు నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో రవీందర్ ఆటో స్టాండ్‌లోకి రాగానే చుట్టుముట్టి దాడిచేశారు. ఇనుపరాడ్లు, ఇటుకలు, రాళ్లతో దారుణంగా కొట్టారు. అడ్డుకోబోయిన ఇతర డ్రైవర్లను బెదిరించారు. చివరికి రవీందర్ కిందపడిపోవడంతో యువకులు అక్కడినుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న రవీందర్ కుటుంబసభ్యులు అతన్ని ముందుగా ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే అతను కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తేల్చారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రవీందర్‌ను చావబాదింది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులే అయిఉంటారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. బహిరంగ మూత్రవిర్జన నేరం కాదు, కానీ.. బస్లాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కులు, మైదానాల్లాంటి బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయడాన్ని నేరంగా పరిగణించారు. కానీ సమాజానిక నియమంగా భావిస్తారు. పబ్లిక్ టాయిటెల్లు అందుబాటులో ఉండికూడా బహిరంగంగా మలమూత్రాలను విసర్జించడాన్ని ఏ ఒక్కరూ హర్షించరు. దాని ద్వారా ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. అందుకే క్లీన్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున టాయిలెట్లను నిర్మిస్తోంది. రవీందర్ మరణవార్తపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. -
'రైతులందరికీ నష్ట పరిహారం అందజేయండి'
దామరచర్ల (నల్లగొండ): యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులందరికీ నష్ట పరిహారం త్వరగా అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని సీపీఐ బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చాడ వెంకటరెడ్డి.. భూములు కోల్పోయిన రైతులకు త్వరగా నష్టపరిహారం అందజేయాలని కోరారు. అలాగే ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
మానవ మృగానికి నిలువెత్తు రూపం
న్యూఢిల్లీ: పైశాచికత్వానికి ప్రతిరూపం.. మానవ మృగానికి నిలువెత్తు రూపం రవీందర్ కుమార్. దేశరాజధానిలో వెలుగుచూసిన వరుస హత్యాచారాల కేసులో నిందితుడే ఇతడు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 30 మందిపైగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు రవీందర్ చెప్పాడని డిప్యూటీ పోలీసు కమిషనర్ విక్రంజిత్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని కాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన రవీందర్ ఢిల్లీలో నివసిస్తూ ఐదేళ్ల కాలంలో ఈ కిరాతకాలకు ఒడిగట్టాడు. ఇంటరాగేషన్ లో భాగంగా ఢిల్లీ శివారు ప్రాంతాలైన నరెలా, బవానా, అలీపూర్ లకు అతడిని పోలీసులు తీసుకెళ్లారు. 24 ఏళ్ల రవీందర్ కుమార్ 2008 నుంచి నేరాలు ప్రారంభించినట్టు సింగ్ తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని బేగంపూర్ లో ఓ బాలుడిని అపహరించి హత్యాయత్నం చేసినందుకు గతేడాది అతడిని అరెస్ట్ చేశారు. అయితే బాలుడు ప్రాణాలతో బయటపడడంతో అతడిని వదిలేశారు. ఆరేళ్ల బాలికను అపహరించి, హత్య చేశారనే ఆరోపణలతో ఈనెల 16న అతడిని అరెస్ట్ చేశారు. అతడు బలితీసుకున్న చిన్నారుల సంఖ్య 40కు చేరొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
15 మంది చిన్నారుల్ని చిదిమేశాడు..
న్యూఢిల్లీ: ఓ చిన్నారిపై అఘాయిత్యం జరిపి హత్యచేసిన కేసులో పట్టుబడ్డ నిందితుడు.. పోలీస్ ఇంటరాగేషన్‌లో వెల్లడించిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. గడిచిన ఆరేళ్ల నుంచి ఒక్క నోయిడాలోనే 15 మంది చిన్నారుల్ని బలితీసుకున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు 24 ఏళ్ల రవీందర్ కుమార్. జులై 15న ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో నిషిరాత్రి వేళ బహిర్భూమికోసం బయటికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిని అటకాయించి రేప్ చేసి, హత్యచేశాడు. పాప తప్పిపోయిందన్న తల్లిదండ్రుల ఫిర్యాదుపై గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మరుసటిరోజు నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో పాప శవం కనిపించింది. పక్కనే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కూడా దొరికింది. దాని ఆధారంగా రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్‌లో అతను చెప్పిన విషయాలు విస్తుకలిగించాయి. చిన్నారులపై లైంగికదాడులు చేయడం, ఆపై చంపేయడం లాంటి కిరాతక పనులు 2009 నుంచి చేస్తున్నట్లు రవీందర్ ఒప్పుకున్నాడు. అలా ఇప్పటివరకు 15 మంది చిన్నారుల్ని బలితీసుకున్నాడు. వారిలో అమ్మాయిలే కాదు అబ్బాయిలూ ఉండటం గమనార్హం. రవీందర్‌ది కూడా 2006లో వెలుగులోకి వచ్చిన 'నిఠారీ హత్యలు' ఉదంతంలాంటిదేనని పోలీసులు అంటున్నారు. అన్ని కేసులకు సంబంధించి త్వరలోనే చార్జిషీటు దాఖలుచేసి, నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చేస్తామంటున్నారు.