దామరచర్ల (నల్లగొండ): యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులందరికీ నష్ట పరిహారం త్వరగా అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణాన్ని సీపీఐ బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చాడ వెంకటరెడ్డి.. భూములు కోల్పోయిన రైతులకు త్వరగా నష్టపరిహారం అందజేయాలని కోరారు. అలాగే ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.