అక్షరాస్యతతోనే అభివృద్ధి
- జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు అయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. స్థానిక రవీంద్ర ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో ‘ ముగ్ధ2కే17 (ముగ్ధమనోహరం) కార్యక్రమాన్ని గత ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించారు. సాంస్కృతిక, సాహిత్య, ఆటల పోటీలు శనివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. రవీంద్ర డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ మమత మాట్లాడారు. అనంతరం విద్యార్థినుల మోడలింగ్ నిర్వహించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కళాశాల వైస్ చైర్మన్ వంశీధర్, ప్రిన్సిపాల్ సతీష్‌బాబా, అధ్యాపక బృందం జయలక్ష్మి, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.