ravindrababu
-
విశాఖ గురించి అన్ని చెప్పి ప్రపోజల్స్ ఏమీ లేవు: రవీంద్రబాబు
-
టీడీపీని వీడిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు
-
225కిపైగా సీట్లతో అసెంబ్లీ భవనం
ఆర్కిటెక్ట్‌ల సమావేశంలో చర్చ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలోని ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీని 225కిపైగా సీట్లుండేలా నిర్మించాలని ఆర్కిటెక్ట్‌లకు సీఆర్డీఏ సూచించింది.ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణ శైలి ఎలా ఉండాలనే దానిపై ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ, ఆర్కిటెక్ట్ బృందాలతో సీఆర్డీఏ నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాపు శనివారం ముగిసింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణంపై చర్చ జరిగింది. శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలు, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ చాంబర్లు ఆయా సభలతో అనుసంధానమై ఉండాలనే నియమాన్ని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ ఆర్కిటెక్ట్‌లకు వివరించారు. సీఎం, మంత్రులు రెండు సభలకు సులువుగా వెళ్లే ఏర్పాట్లు ఉండాలని, శాసనసభ, మండలికి మధ్య సెంట్రల్ హాలులో ఉభయసభల సభ్యులు సమావేశమయ్యేందుకు వీలుగా ఉండాలని సూచించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల సీట్ల అమరిక, స్పీకర్ స్థానం, సిబ్బంది సీట్లు, విలేకరులు, సందర్శకుల గ్యాలరీలు ఎలా ఉండాలో వివరించారు. రాజ్‌భవన్ నిర్మాణంలో గవర్నర్ నివాసానికి, వివిధ సమావేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. హైకోర్టు హాళ్లు విశాలంగా ఉండాలని, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలకు వేర్వేరు ప్రవేశ మార్గాలుండాలని కృష్ణా జిల్లా న్యాయమూర్తి, హైకోర్టు నోడల్ అధికారి రవీంద్రబాబు చెప్పారు. -
అమలాపురం ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులు అందిస్తున్న సేవల తీరుపై అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయన్నారు. 'డబ్బు సంపాదన కోసం వైద్య విలువలు మరిచి.. సిగ్గూ ఎగ్గూ వదిలేసే స్థాయికి దిగజారే ఆస్పత్రులు పుట్టుకురావడం దురదృష్టకరం. చనిపోయినవారికి కూడా వెంటిలేటర్ అమర్చి డబ్బులు గుంజుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను బాగా మోసం చేస్తున్నాయి' అని రవీంద్రబాబు అన్నారు. ప్రభుత్వాస్పత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ప్రైవేట్ ఆస్పత్రులు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. దిక్కూమొక్కూలేని అనాథలు మాత్రమే ధర్మాస్పత్రులకు వెళుతున్నారు' అని ఎంపీ వ్యాఖ్యానించారు. మెజారిటీ వర్గంవారు నిర్వహించే పండుగలు, ఆర్మీ జవాన్లను ఉద్దేశించి కూడా రవీంద్రబాబు గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
అమలాపురం ఎంపీపై కేసు
కదిరి(అనంతపురం): వినాయక విగ్రహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబుపై కేసు నమోదు చేయాలని అనంతపురం జిల్లా కదిరి జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం పట్టణ పోలీసులను ఆదేశించింది. గత నెల 6న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న రవీంద్రబాబు వినాయక విగ్రహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కదిరిలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అయిన ముల్ల ప్రభాకర్‌రెడ్డి గత నెల 7న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వినాయకుడి కి నవరాత్రులు పూజలు చేసి కాలువలు, చెరువుల్లో పడేయడమేంటని హిందువులందరినీ కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ మహిళలను సైతం ఎంపీ అవమానపరిచారని, బాబాల దగ్గర కు పోయి మహిళలు డబ్బుతో పాటు శీలాన్నీ పోగొట్టుకుంటున్నారంటూ మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాను ఫిర్యాదు చేసి నెల రోజులు పూర్తయినా కదిరి పట్టణ ఎస్ఐ సాగర్ కేసు నమోదు చేయలేదంటూ ప్రభాకర్‌రెడ్డి కదిరి కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్పందిస్తూ అమలాపురం ఎంపీపై ఐపీసీ సెక్షన్లు 153బీ, 505, 509 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై పట్టణ ఎస్ఐ సాగర్‌ను వివరాలు అడగ్గా.. కోర్టు కాపీ తనకింకా అందలేదని, రాగానే కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
మిన్నంటిన విషాదం
తమలా కష్టపడ కూడదని అష్టకష్టాలు పడి బిడ్డలను చదివించారు. అందరి కళ్లావేళ్లాపడి ఓ పెద్ద పరిశ్రమలో ఉద్యోగంలో కుదిర్చారు. కడ దాక తమకు తోడుంటారనుకున్న కన్నవాళ్ల ఆశలను సమాధి చేస్తూ కన్నీటి శోకాన్ని మిగిల్చారు. మూడు కుటుంబాలను విధి వక్రీకరించి దుఃఖసాగంలో ముంచేసింది. తడ మండలం మాంబట్టు సెజ్‌లోని ఇండస్ కాఫీ పరిశ్రమలో మంగళవారం చోటు చేసుకున్న దుర్ఘటనతో మూడు మండలాల్లో విషాదం మిన్నంటింది. పరిశ్రమ పూర్తిస్థాయిలో ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్న దశలో తమకు ప్రాధాన్యం ఉంటుందని ఆశించే సమయంలో అకాల మృత్యువు కబళించింది. తడ/సూళ్లూరుపేట/దొరవారిసత్రం : ఇండస్ కాఫీ పరిశ్రమలో మంగళవారం జరిగిన దుర్ఘటనలో మృత్యువు పాలైన ముగ్గురి కుటుంబాల పరిస్థితి వేర్వేరు. రెక్కలు ముక్కలు చేసి బిడ్డలను చదివించారు. చదివిన చదువుకు సరైన ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. తెలిసిన వాళ్లను పట్టుకుని చివరకు చదువుకు తగిన ఉద్యోగాలు కాకపోయినా ఇండస్ కాఫీ పరిశ్రమలో ఉద్యోగాల్లో చేరారు. పరిశ్రమ ప్రస్తుతం ట్రయల్న్ ్రచేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో పరిశ్రమ రన్ అయ్యే అవకాశం ఉండటంతో అప్పడు తమకు మంచి ప్రాధాన్యత ఉంటుందని ఆశపడ్డారు. అంతలోనే ఆ ముగ్గురిని మృత్యువు కబళించింది. తడ మండలం నామర్లమిట్టకండ్రికకు చెందిన చేని ఈశ్వర్, సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్యనగర్‌కు చెందిన నీరుపాక రవి, దొరవారిసత్రం మండలం కల్లూరుకు చెందిన చిట్టిబోయిన రవీంద్రబాబు ఏడాది క్రితం కాఫీ పరిశ్రమలో చేరారు. ఒకరికొకరు స్నేహభావంగా మెలుగుతున్నారు మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరిని కాపాడేందుకు మరొకరు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నిండు నూరేళ్లు జీవితాలను పణంగా పెట్టారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే కన్నవాళ్ల ఆశలను సమాధి చేశారు. చెల్లెలికి పెళ్లి చేయాలని.. నామర్లమిట్టకండ్రిగకు చెందిన చేని వెంకటేశ్వర్లు, వజ్రమ్మలకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు. ఈశ్వర్ ఒక్కడే కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ ఎంఏ, బీఈడీ వరకు చదివించారు. ఈశ్వర్‌ను కష్టం తెలియకుండా పెంచి మంచి చదువు చదివించారు. ఉద్యోగం రాకపోవడంతో ఇంటికి దగ్గరలోనే ఉన్న కాఫీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కకు వివాహం కాగా చెల్లెలి పెళ్లి కోసం తండ్రికి తోడుగా తన సంపాదన కూడా ఉపయోగపడుతుందని చదువుకు తగిన ఉద్యోగం కాకపోయినా కంపెనీలో పనికి చేరాడు. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆధారంగా ఉండే బిడ్డ పోవడంతో.. తల్లిదండ్రుల పోషణ తనపై వేసుకుని అన్నీ తానై చూసుకునే బిడ్డ ఇక లేడనే విషయం తెలియడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించడం అందరి కలిచి వేసింది. కల్లూరుకు చెందిన చిట్టిబోయిన రత్నయ్య, సుగుణమ్మకు ముగ్గురు సంతానం. వీరిలో చివరి వాడైన రవీంద్రబాబు. అన్న చెంగయ్య పెళ్లయి వేరుగా ఉన్నాడు. అక్కకు వివాహమై వెళ్లిపోయింది. రవీంద్రబాబు తల్లిదండ్రులను పోషిస్తూ ఉన్నాడు. ఐటీఐ వరకు చదివిన రవీంద్రబాబు ఏడాది కింద వరకు చెన్నై ప్రాంతం గుమ్మిడిపూండిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడు. ఆ తర్వాత మాంబట్టులోని కాఫీ పొడి పరిశ్రమలో చేరాడు. మంగళవారం జరిగిన దుర్ఘటనలో రవీంద్రబాబు మృతి చెందడటంతో వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులు కడుపు శోకంతో తల్లడిల్లిపోయారు. పెళ్లి చేయాలని అనుకున్నామురా కొడుకా.. వినాయక చవితి పండగ పోగానే పెళ్లి చేయాలనుకుంటే అంతకు ముందే వెళ్లిపోయావురా కొడుకా అంటూ సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్య నగర్‌కు చెందిన నీరుపాక రవి తల్లిదండ్రులు రాఘవయ్య, వెంకటమ్మలు ఆసుపత్రిలో ప్రాంగణంలో గుండెలవిసేలా రోదించడంతో పలువురిని కలిచివేసింది. బజారులో పూలు అమ్ముకుంటూ జీవించే వీరికి రవి చిన్నకుమారుడు. ఇతన్ని ఐటీఐ వరకు చదివించి ఉద్యోగంలో చేరాడు. పెళ్లి చేస్తామని వెంకటగిరి ప్రాంతంలో అమ్మాయిని కూడా చూశారు. అంతలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన తమ కొడుకును అకాల మృత్యువు కాటికి పంపిందంటూ గుండెలు బాదుకున్నారు. -
టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
-
టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాకినాడ: ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడంపట్ల టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు ముఖ్యమా? రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. పండగల్లాంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. వినాయక చవితి, దీపావళి పేరుతో నీటిని, వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఏఎంజీ పాఠశాలలో జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్‌ను ఎంపీలు తోట నర్సింహం, రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఇటువంటి పండుగలు భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని చెప్పారు. రాష్ట్రంలో బడ్జెట్ లేనందున పండుగలను కంట్రోల్ చేద్దామని చెప్పారు.