హుద్‌హుద్’ బాధితులకు
రవీంద్రభారతి స్కూల్ 50 లక్షల విరాళం
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు రవీంద్రభారతి స్కూల్స్ చైర్మన్ ఎం.ఎస్.మణి ముందుకొచ్చారు. శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయనిధికి రూ. 50 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ.. సువిశాల తీరప్రాంతం కలిగిఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపానుల తాకిడి అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమేనన్నారు.
తుపాన్ల ధాటికి పంటలతోపాటు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. తీరప్రాంతాల్లో నివసించే ప్రజలకు నష్టం కలగని రీతిలో సరికొత్త మార్గాలను అన్వేషించేందుకు తమ విద్యార్థులతో సరికొత్త ప్రయోగాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడేలా ఇళ్ల నిర్మాణం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు, సెల్ టవర్లు నేలకూలకుండా.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామని మణి తెలిపారు.