Ravisastri
-
భయపడకు కోహ్లి.. నీ స్టైల్లో ఆడు: రవిశాస్త్రి
చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో ఔటైన కోహ్లి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో దొరికి పోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విరాట్ రివ్యూ తీసుకుని ఉండి ఉండే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడు. ఎందుకంటే అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తాకినట్లు తేలింది. ఏదమైనప్పటికి గత కొంత కాలంగా స్పిన్నర్లను ఆడటానికి కోహ్లి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో కింగ్ కోహ్లికి ఆఫ్ స్పిన్నర్ ఔట్ కావడం ఇది 39వ సారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు.భయపడకు కోహ్లి.."విరాట్ కోహ్లి గత 2-3 ఏళ్లగా స్పిన్నర్లకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కానీ అతడు స్పిన్నర్లకు వ్యతిరేకంగా భారీగా పరుగులు సాధించాడు. స్పిన్నర్లను ఆడేటప్పుడు అతడి ఫుట్ మూమెంట్ సరిగ్గా లేదు. తన పాదాలను మరింత ఎక్కువగా ఉపయోగించాలి.పిచ్‌పై బంతి పడినప్పుడు స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాలి. సమయానికి తగ్గట్టు మీ బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవాలి. ఫీల్డ్ పైకి ఉండేటప్పుడు ఏరియల్ షాట్లు ఆడేందుకు ఏ మాత్రం భయపడకూడదు. స్పిన్నర్లను ఆరంభం నుంచే ఎటాక్ చేయాలి. వారికి మనపై పై చేయి సాధించే అవకాశం ఇవ్వకూడదు. కోహ్లి గతంలో చాలాసార్లు ఇదే పనిచేశాడు. భారత్‌లో కొన్ని ట్రాక్‌లపై ఆడటం అంత సులభం కాదు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో గిల్ ఔటైన తీరు నా చాలా ఫన్నీగా అన్పించింది.లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని వెంటాడి మరి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. అయితే అలాంటి బంతులపై అప్రమత్తంగా ఉండాలి. గిల్ మరోసారి ఆ తప్పుచేయుడు అనుకుంటున్నాను. ఆటగాళ్లకు ఒక సమస్య ఉంటే పరిష్కారం కోసం అన్వేషించాలి. అది విరాట్ అయినా గిల్ అయినా కావచ్చు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.చదవండి: BAN vs IND: చరిత్ర సృష్టించిన పంత్.. ఎంఎస్ ధోని రికార్డు సమం -
'అతడు అద్భుతాలు సృష్టిస్తాడు.. టీమిండియాలోకి రావడమే లేటు'
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ యువ సంచలనం, హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులతో అదరొట్టిన తిలక్.. ముంబై తొలి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ.. 147 పరుగులతో ముంబై తరపున టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న తిలక్‌వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ హైదారాబాదీని పొగడ్తలతో ముంచెత్తాడు. తిలక్ వర్మ అతి త్వరలోనే భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. "తిలక్ వర్మ రూపంలో భారత జట్టుకు మరో యువ సంచలనం దొరికాడు. అతడు ఇప్పటికే టీమిండియా ఆటగాడిగా భావిస్తున్నాను. తిలక్ మరో ఐదు-ఆరు నెలలో టీమిండియా తరపున ఆడకపోతే.. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా వర్మకు ఉంది. ప్రస్తుతం అతడికి కేవలం 20 ఏళ్ల వయస్సు మాత్రమే. ఈ వయస్సులో అతడు ఆడుతున్న ఆటతీరు గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముంబైకే కాకుండా భారత జట్టుకు అతడు అద్భుతాలు సృష్టిస్తాడు" అని స్టార్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: #Tilak Varma: ఐపీఎల్లో దుమ్మురేపుతున్న హైదరాబాదీ.. టీమిండియా ఎంట్రీ ఖాయం! -
‘డీజే శాస్త్రి’ న్యూ ఇయర్ విషెస్
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికాలో ఉన్న రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందచేశారు. డీజేగా కనిపిస్తున్న తన ఫోటోను పోస్ట్ చేసిన శాస్త్రి అందరికీ న్యూ ఇయర్ విషెస్ అంటూ రాసుకొచ్చారు. రవిశాస్త్రి డీజే పోస్టు వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ దీనిపై సానుకూలంగా స్పందిస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా కోచ్‌ను డీజే వాలేబాబు అంటూ కామెంట్లు పెట్టారు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో టీమిండియా విజయం సాధించాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇరవయ్యో శతాబ్దపు సందేశం
అద్భుతమైన రచనలు చేసినటువంటివారు గురజాడ, రావిశాస్త్రి. నేను పుట్టిన ఏడో, తర్వాత సంవత్సరమో గురజాడ వారు చనిపోయారు. గురజాడ కన్యాశుల్కం రాసింది 1897లో. ఇప్పుడు 1993 డిసెంబర్ నెల నడుస్తోంది. ఈ వంద సంవత్సరాల నుంచి మన సమాజం ఇంకా గురజాడ రచనలోని అద్భుతాలను కొత్త కొత్త కోణాల్లో కనిపెడుతూనే ఉంది. జ్వాలాముఖి వంటి అనే క మంది ప్రముఖులు కన్యాశుల్కంలోని విశేషాలు, రహ స్యాల మీద వ్యాఖ్యానాలూ, విశ్లేషణలూ చేస్తున్నారు. గురజాడ వారి అనుయాయి అయినటువంటి రాచ కొండ విశ్వనాథశాస్త్రిగారు రాసినటువంటి కథలు, ముఖ్యంగా ‘పిపీలికం’ కథ గురించి ఇవాళ కూడా చాలా అద్భుతంగా చెబుతారు. ‘పిపీలికం’ కథనే తీసుకుందాం! 1993 డిసెంబర్ 4 - ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామని! పిపీలికం కథ లోపలి పేర్కొన్నటువంటి రకరకాల జీవుల్లో మనం ఏ కోవకు చెందినవాళ్లం? సరే ఆ చీమల్లోనైనా ‘నేనెవర్ని?’ అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన చీమలో అయినా మనమున్నామా? లేక ఆడా మగా, ఎర్ర, నల్ల రకరకాల చీమల తగాదాల మధ్యనే ఉన్నామా? ఇంకా మనకు జరిగే అన్యాయాలు... మనకు కావలసిన భూమి, మన తిండిని గుంజుకునే వాళ్ల విషయం లోపట ‘మహాప్రభో! ఇది మా ఇల్లు, మా తిండి’ అని చెప్పుకునే దశలో ఉన్నా మా? సరే, ‘ఇది మా ఇల్లు’ అని చెప్పుకునే స్థితికైనా వచ్చినామా? ఇది మనం ఆలోచించాలి. ‘ఉల్లంబున పల్లేరులు పొర్లగా, కల్లబొల్లి నవ్వులు వెదజల్లుతూ/ తల్లడిల్లు బానిస ప్రాణాలకు గొల్లున ఏడ్చే స్వాతంత్య్ర మెప్పుడో!?’ అది ఇరవయ్యో శతాబ్దం అయితేనేమి? ఇరవై ఒక టో శతాబ్దం అయితేనేమి? ఎన్ని యుగాలు గడిస్తేనేమి? ప్రహ్లాదుని కథలో హిరణ్యకశిపుడు- వాడు ఒక్క భూ మండలానికే కాదు, మూడు లోకాల మీద వాడి ఆధిప త్యం. వాని మాట ఔనన్నవానికి ఏ లోటూ లేదు. వాడు ప్రకృతినే శాసించేవాడట. ఎక్కడ ఎండ కాయమంటా వు? ఎంతకాయమంటావు? అని సూర్యుడు అడిగేవాడ ట వాణ్ణి. వాన ఎక్కడ పడాలి? భూమ్మీద నీరు ఎక్కడ పుట్టించాలి? ఎక్కడ ఏ పంటలు పండించాలి? అని అడిగి వాడు ఎట్లా శాసిస్తే అట్లా నడుచుకునేవట. శాస్త్రీయంగా ఫాసిజం అంటే ఏమిటో చదువుకున్న వాణ్ణికాను గానీ, ఫాసిజానికి నా నిర్వచనం ఏంటంటే, ‘ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం’. ఇట్లాంటి మహారాజా హిరణ్యకశిపుని రాజ్యం లోపట ‘నా అభి ప్రాయం వేరు, నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను’ అనెటోడు ఒక్కడు బయలుదేరిండు- ప్రహ్లాదుడు. ‘నాన్నగారు, నా అభిప్రాయం వేరు. మీది చాలా తప్పు’ అని డిసెంట్ ప్రకటించిండు. ‘మూడు లోకాల్లో అంద రూ నా మాట వింటున్నారు. నువ్వేందిరా నన్నే ఎదిరి స్తున్నవ్!’ అన్నడు హిరణ్యకశిపుడు. ‘అవును నా అభిప్రాయం ఇదే’ ‘అట్టైతే నీకు అన్నం పెట్ట’ ‘పెట్టకు’ ‘జైల్లో ఏస్త’‘ఏసుకో’ ‘పాముల్తో కరిపిస్త’ ‘కరిపిచ్చుకో’ ఏనుగులతో తొక్కిస్త’ ‘తొక్కించుకో’ ఇట్లా ప్రహ్లాదుడు చేసింది సత్యాగ్రహం. హిరణ్యక శిపుడు చేసింది అతి పెద్ద హింస. స్టేట్ వయోలెన్స్‌కు ప్రతీక హిరణ్యకశిపుడు. దీనికి వ్యతిరేకంగా అహింసా మార్గంలో సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి సత్యా గ్రహి ప్రహ్లాదుడు. ఇది కృతయుగంలో జరిగింది. సత్యా గ్రహం చేసినట్లైతే దౌర్జన్యం చేసినవానిలో హృదయ పరి వర్తన జరుగుతుందనేది సత్యాగ్రహ ధర్మ మూలసూ త్రం. కానీ హిరణ్యకశిపుని లోపట హృదయ పరివర్తన జరగలేదు. దౌర్జన్యం చేస్తూనే పోయిండు. కథలో అప్పుడేమయింది! నరసింహమూర్తిగా రొచ్చినారు. వారొచ్చి, హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని, తొడ మీద పెట్టుకుని, పొట్టచీల్చి, పేగులు మెడలేసుకుని, రక్తం తాగిండు. నరసింహస్వామి చేసింది- అది ఏమైనా కావచ్చు, అహింస మాత్రం కాదు. పిపీలికం కథలో, అయ్యా! ఇది మా ఇల్లు. ఇది మా కష్టం. దీన్ని మేమే కట్టినం అని తొలుత అహింసా మార్గంలోనే చీమలు పామును ప్రార్థించినయి. కష్టపడ డమే మీ పని. సుఖపడడం మా పని. మీకు సూది మొన మోపేంత జాగ కూడా ఇవ్వను పో అన్న తర్వాతనే చీమ లన్నీ కలసి పామును కరిచి చంపినయట. అహింస అహింస అని గోలపెట్టే మహానుభావులు న్నారు చాలామంది. చీమలు కలసి పామును కరిచి చం పితే అందులో వారికి హింస కనబడతది. వారి దృష్టిలో చీమలంటే తీవ్రవాదులు. ఓ ముసలిపాము చీమలు పెట్టిన పుట్టలో ప్రవేశించింది. పదేండ్లు, ఇరవై ఏండ్లా యె. ఖాళీ చేయలేదు. కష్టపడి ఆ పుట్ట కట్టింది చీమలే కావచ్చు. అంతమాత్రాన చీమలన్నీ కలసి ముసలిపా మును కరిచి చంపుతే అది హింస కాకపోతే మరేమిటని వీరికి పాము పట్లనే సానుభూతి ఉంటుంది. మరి మన సానుభూతి చీమల వైపు ఉన్నదా? లేక చీమలను కాల రాచేవారి వైపు ఉన్నదా? చీమల కష్టాన్ని దోచుకునే వారి వైపు ఉన్నదా? అనేది ప్రశ్న. ఆహా, ఏం కథ రాసిండు విశ్వనాథశాస్త్రి! ఎటు వంటి పాఠం నేర్పిండు! ఇది ఇరవయ్యవ శతాబ్దపు యుగ సందేశం. (సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి- తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా) (రెండు దశాబ్దాల క్రితం నాగార్జునసాగర్‌లో జరి గిన గురజాడ, రావిశాస్త్రి సంస్మరణలో పాల్గొన్న కాళోజీ నారాయణరావుగారు చేసిన ఉపన్యాసంలో కొన్ని భాగా లు ఇవి. కాళోజీ చిత్రంతో పాటు ఉపన్యాసాన్ని సేకరించి పంపినవారు ‘అల’ కళల వేదిక నిర్వాహకుడు, చిత్రకా రుడు ‘దాసి’సుదర్శన్ మొబైల్: 94406 08208)