సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికాలో ఉన్న రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందచేశారు. డీజేగా కనిపిస్తున్న తన ఫోటోను పోస్ట్ చేసిన శాస్త్రి అందరికీ న్యూ ఇయర్ విషెస్ అంటూ రాసుకొచ్చారు.
రవిశాస్త్రి డీజే పోస్టు వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ దీనిపై సానుకూలంగా స్పందిస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా కోచ్‌ను డీజే వాలేబాబు అంటూ కామెంట్లు పెట్టారు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో టీమిండియా విజయం సాధించాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment