చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో ఔటైన కోహ్లి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో దొరికి పోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విరాట్ రివ్యూ తీసుకుని ఉండి ఉండే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడు.
ఎందుకంటే అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తాకినట్లు తేలింది. ఏదమైనప్పటికి గత కొంత కాలంగా స్పిన్నర్లను ఆడటానికి కోహ్లి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో కింగ్ కోహ్లికి ఆఫ్ స్పిన్నర్ ఔట్ కావడం ఇది 39వ సారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు.
భయపడకు కోహ్లి..
"విరాట్ కోహ్లి గత 2-3 ఏళ్లగా స్పిన్నర్లకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కానీ అతడు స్పిన్నర్లకు వ్యతిరేకంగా భారీగా పరుగులు సాధించాడు. స్పిన్నర్లను ఆడేటప్పుడు అతడి ఫుట్ మూమెంట్ సరిగ్గా లేదు. తన పాదాలను మరింత ఎక్కువగా ఉపయోగించాలి.
పిచ్‌పై బంతి పడినప్పుడు స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాలి. సమయానికి తగ్గట్టు మీ బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవాలి. ఫీల్డ్ పైకి ఉండేటప్పుడు ఏరియల్ షాట్లు ఆడేందుకు ఏ మాత్రం భయపడకూడదు.
స్పిన్నర్లను ఆరంభం నుంచే ఎటాక్ చేయాలి. వారికి మనపై పై చేయి సాధించే అవకాశం ఇవ్వకూడదు. కోహ్లి గతంలో చాలాసార్లు ఇదే పనిచేశాడు. భారత్‌లో కొన్ని ట్రాక్‌లపై ఆడటం అంత సులభం కాదు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో గిల్ ఔటైన తీరు నా చాలా ఫన్నీగా అన్పించింది.
లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని వెంటాడి మరి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. అయితే అలాంటి బంతులపై అప్రమత్తంగా ఉండాలి. గిల్ మరోసారి ఆ తప్పుచేయుడు అనుకుంటున్నాను. ఆటగాళ్లకు ఒక సమస్య ఉంటే పరిష్కారం కోసం అన్వేషించాలి. అది విరాట్ అయినా గిల్ అయినా కావచ్చు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: BAN vs IND: చరిత్ర సృష్టించిన పంత్.. ఎంఎస్ ధోని రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment