raw eggs
-
ఒకేసారి వంద పచ్చిగుడ్లను తిన్న యూట్యూబర్, వీడియో వైరల్
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. దీంట్లో ప్రోటీన్లతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయన్నది నిజమే. కొందరు రోజూ ఉడికించిన గుడ్డు తీసుకుంటే మరికొందరు పచ్చిగుడ్డు తీసుకుంటారు. అయితే ఓ యూట్యూబర్ మాత్రం ఏకంగా ఒకేసారి వంద పచ్చి గుడ్లను తిని నెట్టింట సెన్సేషన్‌గా మారాడు. జిమ్ చేసేవాళ్లలో చాలామంది తమ డైట్లో తప్పకుండా గుడ్లు ఉండేలా చూసుకుంటారు. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుందని, శరీరానికి కావల్సినంత ప్రోటీన్‌ను అందిస్తుందని చాలామంది గుడ్లను తప్పకుండా రోజూ తీసుకుంటారు. అయితే ఓ ఫిట్నెస్ ఇన్ఫ్యూయెన్సర్,యూట్యూబర్ మాత్రం పెద్ద సాహసమే చేశాడు. తన యూట్యూబ్ చానల్‌కు లక్ష ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా ఆడియెన్స్ కోసం ఏదైనా సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా జిమ్‌లో ఓ పెద్ద మగ్గు నిండా 100 పచ్చి గుడ్లను నింపుకున్నాడు. ఇదేం చేస్తాడబ్బా అని చుట్టూ ఉన్నవాళ్లు చూసేలోపు మగ్గులోని సగానికి పైగా గుడ్లను ఖాళీ చేసేశాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి పుషప్స్ చేసి మళ్లీ పచ్చి గుడ్లను తాగడం కంటిన్యూ చేశాడు. అలా మొత్తం మగ్‌లోని వంద గుడ్లను తాగేసరికి అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫాలోవర్స్ కోసం ఇలాంటి పిచ్చి స్టంట్లు చేస్తే ప్రాణానికి ప్రమాదం..ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గుడ్డు తినడం మంచిది కదా అని అతిగా తీసుకుంటే చాలా ప్రమాదం అని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Vince Iannone (@vince_aesthetic) -
పచ్చి గుడ్లతో దీర్ఘాయువు!
న్యూయార్క్: పచ్చి గుడ్లు, ఒంటరి జీవితమే తన దీర్ఘాయువు రహస్యమని చెబుతోంది 115 ఏళ్ల ఎమ్మా మోరానో. ఈ శతాధిక వృద్దురాలు యూరోప్‌లోనే అత్యంత పెద్ద వయస్కురాలు. అంతే గాకుండా ప్రపంచంలోనే అధిక వయసున్న వారి జాబి తాలో ఐదో స్థానంలో ఉంది. తాను యుక్త వయసులో ఉండగా గుడ్డు తాగితే ఎనీమియా తగ్గుతుందని ఓ డాక్టర్ చెప్పడంతో, అప్పటి నుంచి రోజుకు మూడు గుడ్లు తాగుతున్నానని మోరానో చెప్పింది. 1938లో వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి ఒం టరిగానే ఉంటుంది. అయితే ఒంట రిగా ఉండటం కూడా దీర్ఘాయువుకు కారణమంటోంది.వెర్బానియాలో ఉం టున్న మోరానో ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. -
పచ్చి గుడ్లు, ఒంటరిగా ఉండటమే నా సీక్రెట్...
న్యూయార్క్: గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఇది తరచుగా అందరికీ వైద్యులు చెప్పేమాట. ఇదే మాట 115 ఏళ్ల 3 నెలల యూరప్ బామ్మ చెప్పింది. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా... పచ్చి గుడ్డు తాగడమే తన అధిక ఆయుష్షుకు కారణమంటుంది. దీంతో పాటు అధికకాలం ఒంటరిగా ఉండటం కూడా తన జీవితకాలాన్ని పెంచిందని యూరోప్ లోనే అధిక వయస్కురాలైన ఇటలీకి చెందిన బామ్మ ఎమ్మా మోరానో చెప్తోంది. ఇంకో విశేషమేమంటే ప్రపంచంలోనే అధిక వయసున్న వారి జాబితాలో ఆమె ఐదో స్థానంలో ఉంది. తాను టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ డాక్టర్ గుడ్డు తాగమని ఆరోగ్యానికి మంచిదని ముఖ్యంగా ఎనీమియా తగ్గిస్తుందని సలహా ఇచ్చాడట... అప్పటినుంచి రోజుకు కచ్చితంగా 3 గుడ్లు తీసుకుంటున్నానని బామ్మ తెలిపింది. ఇబ్బందులతో కూడిన తన వైవాహిక జీవితాన్ని 1938లో కూమారుడు చనిపోవడంతోనే వదులుకున్నానని ఆమె తెలిపింది. తనపై వేరొకరు పెత్తనం చేయడం ఇష్టం లేక రెండో పెళ్లి చేసుకోలేదని ఎమ్మా మోరానో అన్నారు. అప్పటి నుంచి వెర్బానియాలో కేవలం రెండు గదుల ఇంట్లో ఉంటున్నానని, కొన్నిసార్లు అనారోగ్యానికి గురయినప్పటికీ ఆసుపత్రిలో కాలుపెట్టడానికి నిరాకరించనన్నారు. ఎమ్మాకు రక్తం మార్పిడి చేయడం, ఇతర చికిత్స నిమిత్తం తానే ఆ ఇంటికి వెళ్లానని డాక్టర్ కార్లొ బవ తెలిపారు. ఆ బామ్మకు 90 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నానని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ చెప్పడం విశేషం.