Rayagada district
-
బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్
-
రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం జగన్
-
బాధితుల ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం
-
రైలు ప్రమాద ఘటనలో లోకో పైలట్ మధుసూదన్ రావు మృతి
-
నిండు గర్భిణిని మంచంపై మోసుకుంటూ.!
రాయగడ: తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఓ గర్భిణిని ఆంబులెన్స్ ఎక్కించేందుకు గ్రామస్తులు మూడు కిలోమీటర్లు మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కాసీపూర్ సమితిలోని బొడొఫసా గ్రామంలో చోటుచేసుకుంది. బొడొఫసా గ్రామానికి చెందిన బిబిన్ మజ్జి భార్య థాసాయికి ఆదివారం సాయంత్రం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. భార్య ప్రసవవేదన పడుతుండటం గమనించిన భర్త బిబిన్ ఆంబులెన్స్‌కు సమాచారం అందించాడు. గ్రామానికి వస్తున్న ఆంబులెన్స్ సరైన దారిలేకపోవడంతో మూడు కిలోమాటర్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో గ్రామస్తుల సాయంతో గర్భిణిని మంచంపైనే మోస్తూ ఆంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో థాసాయి..పండంటి బిడ్డకి జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. -
చూస్తుండగానే క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లోకి..
సాక్షి, భువనేశ్వర్(రాయగడ): పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి, కొరండిగుడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం వైద్యసేవల నిమిత్తం బిసంకటక్ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. కొరండిగుడకి చెందిన భార్యాభర్తలు మినియాక బుర్షా(56), మినియాక రామి(53), తమ కొడుకు కోడలు కస్తరి మినియాక(25), వలా మినియాక(29)లతో కలిసి ఉదయం పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వీరంతా తలదాచుకునేందుకు అక్కడి ఓ చెట్టు కిందకు చేరారు. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో.. ఈ క్రమంలో అదే చెట్టుపై పడిన పిడుగుతో మినియాక బుర్షా, అతడి భార్య రామి మినియాక అక్కడికక్కడే మృతి చెందగా, వలా మినియాక, కస్తరి మినియాకలకు తీవ్రగాయలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, పోలీసులు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులంతా ఇలా పడుగుపాటుకు గురవ్వడం పట్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఆంబులెన్స్ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు.. -
వలస కార్మికుల నమోదుపై సమావేశం
రాయగడ : ఇతర రాష్ట్రాల వ్యాపారులు, పరిశ్రమలు, ఇటుకబట్టీల్లో దళారుల వల్ల మోసపోతూ ఇబ్బందులకు గురవుతున్న వలసకార్మికుల పేర్లు కానీ, చిరునామా కానీ దళారుల పేర్లు కానీ లభించక అటు కార్మికులు ఇటు ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది తెలుసుకున్న రాయగడ జిల్లా పోలీసు అధికారి ఎస్పీ రాహుల్ పీఆర్ దీనిపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రణాళికను తయరు చేశారు. ఈ మేరకు ఇకపై కార్మికశాఖ మాత్రమే కాకుండా ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్, సమితి మెంబర్, వార్డుమెంబర్, ద్వారా గ్రామం నుంచి వలస వెళ్లేవారి పేర్లు, అడ్రస్‌లు, వెళ్లేసమయం, ఏ ప్రాంతానికి వెళ్లేది, మధ్యవర్తి ఎవరు, వారి ఫోన్ నంబర్లు నమోదు చేయడం అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల వివరాలు నమోదు చేసి పోలీసుల ద్వారా కార్మికశాఖకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎయిడ్ ఈటీ ఏక్షన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ ఉమ్రిడాన్యాల్ సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లా కేంద్రంలో కార్మిక చైతన్య కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. చట్టాలపై చర్చ కార్యక్రమంలో 16పోలీస్స్టేషన్లు, 32అవుట్‌పోస్టుల అధికారులు, కార్మికశాఖ అధికారులు, జిల్లా సంక్షేమశాఖ అధికారులు, డీఎస్ఎస్ విభాగం, చైల్డ్‌లైన్ విభాగంతో సహా ఇతర సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. సచేతన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ది బాండెడ్ లేబర్ సిస్టమ్ ఎబొలేషన్ యాక్ట్–1976, ఒడిశా ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్‌మన్ మాన్యువల్‌లో ఉన్న నిబంధనలు, సూచనలు, చట్టపరమైన చర్యలు, వాటికి సంబంధించి చర్చించారు. జిల్లాలోని కాశీపూర్‌సమితి, రేంగ, టికిరి, చందిలి పంచాయతీ, ముకుందప్రాంతాల నుంచి కేరళ రాష్ట్రానికి వలస కార్మికుల సంఖ్య అధికమని సమావేశంలో తెలియవచ్చింది. ఇంటర్‌స్టేట్ మైగ్రేషన్ వల్ల ప్రభుత్వం అనేక కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటోందని వివరిస్తూ ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికులకు రాయగడలో దళారులు ఉండగా ప్రధాన కేంద్రం బల్లుగాం అని వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌పీఆర్ సహా కలెక్టర్ గుహపూనాంతపస్‌కుమార్, గుణుపురం ఐటీడీఏ పీఓ ఘొరచంద్‌గొమాంగో, రాయగడ ఐటీడీఏ పీఓ మురళీధర్‌స్వొంయి, రాయగడ సబ్‌కలెక్టర్ ప్రవీర్‌కుమార్ నాయక్, గుణుపురం సబ్‌కలెక్టర్ అమృతరుతురాజు, డీఎల్ఓ ప్రదీప్‌కుమార్‌భొయి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముగ్గురు మహిళల ఆత్మహత్య
రాయగడ : రాయగడ జిల్లాలో ఇద్దరు వివాహిత కుమార్తెలతో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడింది. వార్డు సభ్యురాలితో విభేదాలు, ఏడీఎం వేధింపులు కారణమని కొందరు పేర్కొన్నారు. కాగా, కుటుంబ కారణాలు కారణమని కొందరు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జాజ్‌పూర్ జిల్లా గుమ్మ గ్రామానికి చెందిన ఉత్పల సుఖల కల్యాణసింగుపురం సమితి సికరపాయి గ్రామ పంచాయతీ బెల్కోన గ్రామంలో అంగన్వాడీ వర్కర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు పింకి సుఖల, రింకి సుఖల. వారికి వివాహమైంది. పింకి సుఖలకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. అంగన్వాడీ వర్కర్ ఉత్పల సుఖలకు బెల్కోనలో వార్డు సభ్యురాలైన సుశీల మండంగికి మధ్య విభేదాలు ఉన్నాయి. గ్రామ కల్యాణ సమితి నిధులకు సంబంధించి విభేదాలు తలెత్తాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్పల ఇద్దరు వివాహిత కుమార్తెలతో ఆదివారం తెల్లవారుజామున విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలిసిన వెంటనే కల్యాణసింగుపురం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉత్పల, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్డు సభ్యురాలితో విభేదాలు ఉండడమే కారణమైతే ఆమె ఒక్కర్తే ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. జిల్లా ఏడీఎం వేధింపులు కారణమని కొందరు ఆరోపించారు. అంగన్వాడీ వర్కర్‌గా రాజీనామా చేయాలని ఉత్పలపై ఏడీఎం ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్డీపీఓ వై.జగన్నాథం, తహసీల్దార్ గౌరచరణ్ పట్నాయక్, బీడీవో ప్రవీణ్‌కుమార్‌కు స్థానికులు చెప్పినట్లు తెలిసింది. వార్డు సభ్యురాలితో విభేదాలు, అధికారుల వేధింపులు ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండవచ్చునని, కుటుంబంలో ఏదో సమస్య తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ కారణాలతోనే వారు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పరిహారం చెల్లించాలని ఆందోళన ఉత్పల, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్యతో పింకి సుఖల నాలుగేళ్ల కుమార్తె అనాథగా మిగిలింది. వారి మృతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు బెల్కోనలో రాస్తారోకో నిర్వహించారు. రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సినీ నటుల దిష్టిబొమ్మల దహనం
రాయగడ జిల్లా : చిట్‌పండ్ అక్రమాల్లో పాలుపంచుకున్నారని ఆరోపిస్తూ ఒడియా సినీ నటులు పప్పు పంపం, సిద్ధాంత్ మహాపాత్రో, అనుభవ్, ఆకాశ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. శుక్రవారం రాయగడ జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కపిలాస్ జంక్షన్లో చిట్‌ఫండ్ అక్రమాల్లో భాగస్వాములైన సినీ నటుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ బీజేడీలో ఉంటూ ప్రజల డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నవీన్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. చిట్‌ఫండ్ , గనులు, ఖనిజం, పప్పుధాన్యాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, భూకబ్జాలకు బీజేడీ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేడీ అవినీతి అక్రమాలమయమైందన్నారు. పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నా మాతృభాష రాని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు ఎలా పాలన అందించగలరని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా సభాపతి, భాస్కర నాయక్, హోల్దార్ మిశ్రో, లక్ష్మీపట్నాయక్, శ్రీఫాల్‌జైన్, సుశాంత్ మహరాణా, కె.అశ్వని, తిలక్‌చౌదురి పాల్గొన్నారు.