raythu barosa yatra
-
సంక్రాంతి కానుకగా రైతు భరోసా
-
రైతన్నల ఆత్మాభిమానమే నా లక్ష్యం
సాక్షి, అమరావతి : రైతన్నలు ఆత్మాభిమానంతో జీవించేలా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. అన్నదాతలు పండించిన ప్రతి గింజకూ న్యాయం జరగాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల కళ్లల్లో వెలుగులు చూడడమే తన ఆశయమని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతు బాంధవుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు తొలి లేఖ రాశారు. ఇందులో తన ప్రాధమ్యాలను వివరించారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు... ఆత్మ బంధువులు, అన్నదాతలైన రైతన్నలకు మీ జగన్ నమస్కరిస్తూ రాస్తున్న లేఖ.. డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతిఏటా జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన బాటను మరింత మెరుగు పరిచేందుకు మన ప్రభుత్వం నవరత్నాలతో ముందుకు వచ్చింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా. ఈ ఏడాది అక్టోబరు నుంచే ప్రతి రైతు కుటుంబానికీ రూ.12,500 రైతు భరోసా కింద అందించబోతున్నాం. ఈ డబ్బును బ్యాంకులు ఇంతకు ముందున్న మీ అప్పులకు జమ చేసుకోకుండా నేరుగా మీ చేతికే అందించబోతున్నాం. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.8,750 కోట్ల మేర పెట్టుబడి సహాయం అందబోతోంది. 15.36 లక్షల కౌలు రైతులకూ మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. రూ.2 వేల కోట్లతో విపత్తుల సహాయనిధి తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రూ.2,000 కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని నెలకొల్పుతున్నాం. శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 ప్రోత్సాహకంగా ప్రకటిస్తూ జీవో జారీ చేశాం. ఈ రోజు నుంచే ఆ డబ్బును అందించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ శీతల గిడ్డంగులు, గోదాముల నిర్మాణంతో పాటు అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాం. కౌలుదారులకు మేలు చేస్తాం.. భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతూ, కౌలుదారులకు సైతం మేలు చేసేలా 11 నెలల పాటు సాగు ఒప్పందం ఉండేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకురాబోతున్నాం. తద్వారా కౌలు రైతులకు అన్ని రకాలుగా మంచి చేయాలని నిర్ణయించాం. వ్యవసాయానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోయిన రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందిస్తాం. ఆ డబ్బు రైతు కుటుంబం చేతికే అందిస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందిస్తున్నాం. సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు అదనంగా రూ.4 బోనస్ రెండో ఏడాది నుండి ఇవ్వబోతున్నాం. పామాయిల్ రైతులకు రూ.85 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించబోతున్నాం. పొగాకు ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకున్నాం. నాఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు భూసార కార్డులు, రాయితీపై విత్తనాల సరఫరా, సకాలంలో ఎరువుల పంపిణీ, రాయితీపై సూక్ష్మపోషకాల సరఫరా వంటి వాటికి చర్యలు తీసుకుంటున్నాం. కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిరోధించడానికి చర్యలు చేపడతాం. ప్రతి నియోజకవర్గంలో ప్రయోగశాలలు, ప్రతి గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. చివరిగా ఒక్క మాట... పండించిన ప్రతి ధాన్యపు గింజపై అది ఎవరు తినాలో దేవుడు రాసి పెడతాడన్నది నానుడి. కష్ట జీవులైన రైతులు, వారి కుటుంబాల్లో ఆనందాలను నింపేలా మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రయత్నానికీ.. అవినీతిని నిర్మూలించడానికి సాగిస్తున్న కృషికి దేవుడి దీవెనలు, మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నా. ప్రతి రైతన్నకూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు’’ రూ.84 వేల కోట్ల పంట రుణాలు బ్యాంకుల నుంచి ఈ ఏడాది రైతులకు రూ.84,000 కోట్లు రుణాలుగా అందజేయాలని నిర్ణయించాం. రూ.లక్ష వరకు పంట ఋణాలు తీసుకున్న రైతులు గడువు లోపు తిరిగి చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీ ఉండదు. వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియంను ఇక ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.2,163 కోట్ల బీమా ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంది. పగటి పూటే 9 గంటల విద్యుత్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇచ్చే సామర్థ్యాన్ని తీసుకువచ్చేలా రూ.1,700 కోట్లు ఖర్చు చేసున్నాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 200 రిగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం. -
‘రైతు’కు జగన్ భరోసా..
మట్టి తల్లినే నమ్ముకున్నారు వారంతా. రేయింబవళ్లు ఆ తల్లి ఒడిలోనే కాలం గడుపుతారు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని వారంతా కరాల సత్తువ..నరాల బిగువుతో స్వేదం చిందించి..ఆరుగాలం ఇంటిల్లిపాది కష్టపడి పంటలు సాగుచేస్తే..అతివృష్టి, లేకపోతే అనావృష్టి కారణంగా వారి శ్రమ మట్టిలో కలిసిపోతోంది. అన్నీ బాగుండి పంట చేతికొచ్చినా సరైన మద్దతు ధర లభించకపోవడంతో పెట్టుబడికి కూడా నోచుకోలేకపోతున్నారు. దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లోను, వ్యాపారుల దగ్గర తెచ్చే రుణాలకు వడ్డీలు పేరుకుపోయి తడిసిమోపెడవుతున్నాయి. ఎవరో వస్తారని..ఏదో చేస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అన్నదాతలు విసిగి వేశారిపోయారు. అంతలో అన్నదాత దీనస్థితిని ఆకళింపు చేసుకుని..రైతులకు భరోసా కల్పించాలని భావించి నేనున్నానంటూ ముందుకు వచ్చారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుకు భరోసా కల్పిస్తానని ధైర్యం చెబుతూ రైతు భరోసా పేరిట అన్నదాతలను ఎలా ఆదుకుంటామో తెలియజేస్తూ వారికి కొండంత మనోస్థైర్యాన్ని కల్పించారు. సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే తినడానికి తిండి లేదు. జీవనం లేదు. ప్రజలందరికీ అన్నం పెట్టే రైతులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న రైతులు ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులకు వ్యవసాయం చేయడం సమస్యగా మారింది. గతి లేక వ్యవసాయం చేస్తే, చివరిలో విపత్తు వస్తే, ఆ ఏడాది పంట తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు రైతాంగానికి, వ్యయసాయ రంగానికి మేలు చేసేందుకు ముందుకువచ్చారు. తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం చెబుతున్నారు. ఈ హామీతో సగటు రైతుకు ఏడాదిలో కనీసం ఒక రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.12,500 ఆర్థిక సాయం, ఉచిత బోరు, ఉచిత విద్యుత్, రోడ్ ట్యాక్స్, సున్నా వడ్డీ వంటి సేవలతో రైతులకు ప్రతి ఏటా ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీతో ప్రతి రైతు ధైర్యంగా వ్యయసాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. గతంలో రైతులు పంటలకు భద్రత లేక, పెట్టుబడికి భరోసా లేక వ్యయసాయాన్ని విడిచి, ఇతర పనులు, ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకండా విద్యుత్ సరఫరా కోసం పొలంలో పడిగాపులు కాసిన సందర్భాలు కోకొల్లలు. పంటలు వేసే సమయంలో పెట్టుబడి లేక, అప్పు దొరక్క అవస్థలు పడిన పరిస్థితులు అధికం. తీరా బ్యాంకు నుంచి రుణం పొందినా, ప్రతిఏటా వడ్డీ కట్టలేని పరిస్థితి. రైతులకు ఎప్పటికప్పుడు అప్పు కావాలంటే దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రతిపక్షనేత, వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో భాగంగా రైతాంగాన్ని ఆదుకోవడం సంతోషమంటూ రైతులు సంబరపడుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఇలా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తాం. ఆ మొత్తాన్ని మే నెలలో పెట్టుబడి కోసం రూ.12,500 చొప్పున నాలుగేళ్లు చెల్లిస్తాం. రెండవ సంవత్సరం నుంచి, రైతన్నకు వడ్డీలేని రుణాలు, రైతులకు ఉచిత బోర్లువేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కి రూ.1.50 తగ్గింపు రైతుల కోసం రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,రైతులకు రూ.4000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు మొదటి ఏడాది సహకార రంగం పునరుద్ధరణ రెండో ఏడాది సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 సబ్సిడీ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు దురదృష్టవశాత్తు ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు వైఎస్ఆర్ బీమా పేరిట ఆ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం. అంతేకాకుండా ఆ డబ్బు అప్పుల వారికి చెందకుండా అసెంబ్లీ తీర్మానం తీసుకువస్తామని నవరత్నాలు పథకంలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ బీమాతో ఆర్థిక ఆసరా మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పేరిట రూ.5 లక్షలు నగదు ఇస్తామని చెప్పడం చూస్తుంటే ఆ రైతు కుటుంబానికి ఆసరా లభించినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు పేద రైతులు చనిపోతే, బాధిత కుటుంబం రోడ్డున పడుతోంది. ఇక నుంచి ఈ పథకంతో రైతుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది రైతు కుటుంబాలకు నిజంగా మంచి ఆసరా. –సాధు రామారావు, ఏవీ పేట, గార మండలం రైతుకు పెట్టుబడి ప్రకటన ఎంతో మేలు ప్రతి రైతుకు ఏటా రూ.12,500 ఇస్తామని, అది కూడా ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయానికి పెట్టుబడికి పనికి వచ్చేలా సకాలంలో అందజేస్తామని, ఇలా ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ. 50 వేలు ఆర్థిక ప్రోత్సాహం సమకూరుస్తామని చెప్పాడం వల్ల రైతుకు చాలా మేలు జరుగుతుంది. దీని వల్ల రైతుకు వ్యవసాయంపై ఆసక్తి కలుగుతుంది. – గోండు రఘురాం, వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు వడ్డీలేని రుణంతో ప్రయోజం వడ్డీలేని రుణాలను మంజూరు చేయడం వల్ల రైతులు తీసుకున్న అప్పులో అసలు వేగంగా చెల్లించవచ్చు. వడ్డీ పెరిగే ప్రమాదం లేనందున ఏటా అప్పుతీసుకోవడం, సకాలంలో తీర్చుకోవడం కుదురుకుంది. –అనుపోజు నాగరాజు, శ్రీకాకుళం తీరనున్న సాగునీటి సమస్య సాగునీరు అందుబాటులోలేని, వర్షాభావంపై ఆధారపడి ఉన్న భూములలో ఉచితంగా లక్షలాది రూపాయల వ్యయంతో మెట్టు భుముల్లో బోర్లు వేయడం వల్ల పంటలు పండుతాయి. పల్లం, మెట్టు భూముల రైతులకు మేలు చేకూరుతుంది. మూడు పంటలు పండించే అవకాశం ఉంది. –యతిరాజుల ప్రసాదరావు, రైతు, శ్రీకాకుళం జిల్లాలో రైతుల పరిస్థితి....... ఏ జిల్లాలో ఉన్న రైతు కుటుంబాల సంఖ్య –6.70 లక్షలు ఏ రైతులు ప్రతి ఏటా తీసుకున్న రుణాల మొత్తం రూ. 1,400 కోట్లు ఏజిల్లాలో ఉన్న విద్యుత్ బోర్లు 11,000 ఏజిల్లాలో ఆక్వా ప్లాంట్లు 10,000 ఏజిల్లాలో సహకార సంస్థలు 48 (ఎన్జీవో–ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 100) ఏ జిల్లాలో వ్యసాయ ట్రాక్టర్లు 7,000 -
పోరాడుదాం!
రెండోరోజు రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్ రైతులకు న్యాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీద్దాం 79 కిలోమీటర్లు... 3 కుటుంబాలకు భరోసా అనంతపురం: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక మంది అన్నదాతలు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగిస్తున్నారు. రోడ్డున పడిన ఆ కుటుం బాలను ఆదుకోవాల్సిన అధికారులు, పాల కులు చనిపోయింది రైతులు కాదని, అప్పుల వల్ల అసలే కాదని తప్పుడు పద్ధతిలో ప్రజలను మోసగిస్తున్నారు. అటువంటి ఈ ప్రభుత్వం మెడలు వంచేందుకు కలిసి కట్టుగా పోరాడు దామని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు భరోసాయాత్రలో రెండోరోజు బుధవారం జగన్ మూడు రైతు కుటుంబాలను పరామర్శించారు. కళ్యాణదుర్గం నుంచి జగన్ రెండోరోజు యాత్రను ప్రారంభించారు. ముందుగా పట్టణంలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. ఆపై వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు జగన్‌ను కలిశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై చంద్రబాబు మాట తప్పారని, వాల్మీకులకు న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఉప్పవంక మీదుగా యాటకల్లు చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు దారిపొడవునా బంతిపూలు చల్లి స్వాగతం పలికారు. మహిళలు రోడ్డుపైకి వచ్చి జగన్‌కు హారతి ఇచ్చి, దిష్టితీశారు. వృద్ధులు, పిల్లలకు ఆప్యాయంగా ముద్దులు పెట్టారు. తర్వాత కోనాపురం, మామిడూరు, ఎర్రడికెర, పడమటికోడిపల్లి మీదుగా పొబ్బర్లపల్లి చేరుకున్నారు. ఈ నెల 20న ఆత్మహత్య చేసుకున్న రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఈరన్న చనిపోయారని తెలిసి వెంటనే షెడ్యూలు మార్చుకుని పొబ్బరపల్లి వచ్చినందుకు గ్రామంలోని రైతులంతా ఆనందపడ్డారు. రైతులకు అండగా తాను ఉన్నానని జగన్ భరోసా ఇచ్చారని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత ముదిగల్లుకు చేరుకున్నారు. దారిలో న్యాయవాదుల సంఘం ప్రతినిధులు జగన్ కలిశారు. కళ్యాణదుర్గంలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని విన్నవించారు. తర్వాత గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థులు కలిసి విద్యార్థి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ముదిగల్లు గ్రామస్తులు జగన్‌కు అఖండ స్వాగతం పలికారు. ఓవైపు వర్షం పడుతుంటే... వర్షంతో పోటీగా జగన్‌పై పూలవర్షం కురిపించారు. డప్పులమోతతో జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మల్లిపల్లికి చేరుకున్నారు. అక్కడ తనను చూసేందకు వచ్చిన కుష్టురోగులను జగన్ ఆప్యాయంగా పలకరించారు. తర్వాత తూర్పుకోడిపల్లి మీదుగా వర్లి చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న గంగన్న అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తర్వాత నేరుగా కళ్యాణదుర్గం చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బస చేశారు. రెండోరోజు యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉషాశ్రీచరణ్, వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శులు తిప్పేస్వామి, ఎల్ఎం మోహన్‌రెడ్డి, మీసాల రంగన్న, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయయాదవ్, మహిళా నేత శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పామిడి వీరాంజనేయులు, పసుపుల బాలకృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు. మూడోరోజు పర్యటన ఇలా రైతు భరోసాయాత్రలో భాగంగా మూడోరోజు గురువారం జగన్ నాలుగు కుటుంబాలను పరామర్శించనున్నారు. కళ్యాణదుర్గం నుంచి కంబదూరు మండలం తిమ్మాపురం చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న నారాయణప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఒంటారెడ్డిపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామాంజనేయులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లికి చేరుకుంటారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న లక్ష్మిదేవి, పెద్దపాతన్న కుటుంబాలను పరామర్శిస్తారు.