అందుబాటులోకి ‘హై సెక్యూరిటీ’
మర్రిపాలెం : హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్న వీటిని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వాహన య జమానికి రవాణా శాఖ కార్యాలయం లో ఆర్టీవో ఎ.హెచ్.ఖాన్ బోర్డులు అందజేశారు. కొత్తగా రిజిస్ట్రేషన్ పూ ర్తయిన అన్ని తరహా వాహనాలకు ఈ బోర్డులు అమర్చాలని ఖాన్ తెలిపా రు.
బోర్డుల ప్రత్యేకతను ఆయన వివరించారు. ఆర్ అండ్ బీ జంక్షన్ వాహనాల రిజిస్ట్రేషన్ భవనంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. బోర్డులు తయారు చేస్తున్న లింక్ ఆటో టెక్ సంస్థ ఉద్యోగులు కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కౌంటర్లో వాహన యజమాని వివరాలు తెలపాలి. ఆయా వాహనాలకు తగ్గట్టుగా బోర్డు ధరను చెల్లించాలి. వాహనం వివరాలుగా యజమాని పేరు, చిరునామా, ఇంజన్, చాసిక్ నంబర్లను రవాణా ఉద్యోగులు సంస్థకు చేరవేస్తారు.
ఏపీఎస్ ఆర్టీసీ నేతృత్వంలో రవాణా, లింక్ ఆటో టెక్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బోర్డులు అందజేస్తారు. బోర్డుల తయారీ అనంతరం ఎస్ఎంఎస్ ద్వారా యజమానులకు సమాచారం చేరుతుంది. సంస్థ ఉద్యోగులు బోర్డులు సిద్ధమన్న సందేశం తెలియజేస్తారు. ప్రత్యేక కౌంటర్లో బోర్డులు అమర్చుతారు. బోర్డులు నేరుగా అందజేయరు. వాహనాన్ని తీసుకొస్తే సంస్థ ఉద్యోగులు అమర్చుతారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో బోర్డులు వాహనానికి అమర్చాలని నిబంధన ఉంది.
బోర్డుల తయారీకి కనీసం నాలుగు రోజుల వ్యవధి పడుతుందని సంస్థ తెలిపింది. గతేడాది డిసెంబర్ 11 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు బోర్డులు అమర్చాల్సి ఉంది. బోర్డుల ఏర్పాటులో ఎటువంటి సందేహాలు తలెత్తినా సంస్థ ఉద్యోగులను సంప్రదించవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు వస్తున్న యజమానులకు ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు.