realese
-
బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో
-
దేవదాస్ టీజర్ విడుదల
-
2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గం రాజేష్ కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గెం రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో పర్యటించి భూనిర్వాసితులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే ఆవేదనతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చల్లా స్వరూప, పత్తిపంట నష్టంతో బలవన్మరణం చెందిన యువరైతు ప్రవీన్ కుటుంబాలను పరామర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు న్యాయమైన పరిహారం కోసం ఏకతాటిపై నిలవాలన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సన్నచిన్నకారు రైతులకు సాగునీరందించేందుకు కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే... ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. భూనిర్వాసితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మల్హర్ మండల అద్యక్షుడు సుంకె వెంకటి, నాయకులు కల్యాణ్, కుమార్ ఉన్నారు. -
కొత్తజిల్లాల మార్గదర్శకాలు ప్రకటించాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ గొల్లపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ డిమాండ్ చేశారు. గొల్లపల్లిలో ఆదివారం మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం, కేసీఆర్ కుటుంబ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, ప్రజా అవసరాలను, భవిష్యత్ అభివృద్ధిని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమండ్ చేశారు. ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటుచేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించొద్దని కోరారు. తెలంగాణలో ఇప్పుడు కొత్త జిల్లాలు ఎవరు అడిగారని, ఎందుకు తొందరపడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న పది జిల్లాల్లోనే పరిపాలన సరిగా లేదని విమర్శించారు. కొత్త జిల్లాలకు అవసరమైన వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు తెలుపాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చిన వేలాది ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎల్లంకి రమేశ్, నాయకులు ఓరుగంటి జాన్, పస్తం సమ్మయ్య, లక్పత్రెడ్డి పాల్గొన్నారు. -
చెరువులను నింపాలని అధికారులకు వినతి
చిలుకూరు: సాగర్ నీటి ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపాలని కోరుతూ బుధవారం ఎన్ఎస్పీ సీఈ సునీల్‌కుమార్ ఎస్ఈ అంజయ్యలకు వినతి పత్రం అందజేసినట్లుగా ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆర్కే మేజర్ ఓటి నుంచి 0.594 కిలోమీటర్ వద్ద నూతన తూము ద్వారా ఉన్న జాలు కాలువ నుంచి చిలుకూరు , నారాయణపురం ఊర చెరువును నింపాలని, ముక్యాల కాలువ 5ఎల్ నుంచి ఫీడర్ చానల్ ద్వారా సీతరాంపురం, పాలె అన్నారం చెరువులు, మండలంలోని చెన్నారిగూడెం పరిధిలోని నరసింహులకుంట, రాముల కుంటకు , జెర్రిపోతులగూడెం, మొగిళ్ల కుంట చెరువును ప్రధాన కాలువ నుంచి∙జాలు కాలువ ద్వారా నింపాలని సంబంధిత అధికారులను కోరినట్లుగా తెలిపారు. దాదాపుగా మండలంలోని అన్ని చెరువులను నింపేందుకు ఎన్ఎస్పీ ఆధికారుల సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, వైస్ ఎంపీపీ వట్టికూటి నాగయ్య చంద్రకళ, బేతవోలు సోసైటీ చైర్మన్ బెక్కం లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ బాదె,అంజనేయులు తదితరులు ఉన్నారు. -
ఫలించిన జలయజ్ఞం
కశింకోట: మండలంలోని అమీన్‌సాహెబ్‌పేట గ్రామం వద్ద శారదానదిపై నిర్మించిన నరసాపురం ఆనకట్ట నుంచి శనివారం ప్రయోగాత్మకంగా సాగునీటిని విడుదల చేశారు. కాలువ నుంచి వంద క్యూసెక్కుల సాగునీరు ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడం, తలుపుల అమరిక పనులు దాదాపు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు. దీంతో రైతుల ఐదేళ్ల కల నెర వేరినట్టయింది. రైతుల కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ఆనకట్టను మంజూరు చేశారు. దీనికి రూ.16.17 కోట్లు మంజూరు చేశారు. నిధులు సరిపోకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు కల్పించుకొని విశాఖ డెయిరీ ద్వారా తలుపుల ఏర్పాటుకు రూ.కోటీ 30 లక్షలు సమకూర్చారు. ఆరు నెలల క్రితం చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వరద నీరు వచ్చి చేరడంతో శనివారం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కాలువ నుంచి వంద క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల కశింకోట, యలమంచిలి మండలాల్లో సుమారు 3,854 ఎకరాలకు సాగునీరు అందనుంది. -
90 ఏళ్ల మహిళా ఖైదీకి విముక్తి
రాజమండ్రి క్రైమ్: సత్ప్రవర్తన కింద 90 ఏళ్ల వృద్ధురాలికి కారాగారవాసం నుంచి విముక్తి లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం 124 మంది ఖైదీలు విడుదలయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీరిని జైలు అధికారులు విడుదల చేశారు. వీరిలో 14 మంది మహిళలు కాగా, 110 మంది పురుషులు ఉన్నారు. వీరిలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వృద్ధురాలు రుక్మిణమ్మ (90) కూడా ఉంది. కోడలు హత్య కేసులో రుక్మిణమ్మ 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. కాగా, విడుదలైన ఖైదీల్లో హర్షం వ్యక్తం అయింది. -
మార్కెట్లోకి HONDA HR-V న్యూకార్