reality shares
-
మరోసారి హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, హీరో రానా దగ్గుబాటి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఐఫా వేడుకల్లో సందడి చేసిన రానా సరికొత్త షోలో హోస్ట్‌గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సరికొత్త 'ది రానా దగ్గుబాటి షో'తో అభిమానులను అలరించనున్నారు.ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. దీంతో రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The stars you know, the stories you don’t✨🤭Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024 -
రియల్టీ షేర్ల జోరు...ఫొనిక్స్ 10% అప్
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభల్లో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో రియల్టీ షేర్లు సైతం జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నిబంధనలను భారీగా సడలించడంతో నిర్మాణ రంగ పనులు పుంజుకుని అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని ఇన్వెస్టర్లు భావిస్తుండడతో రియల్టీ షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11:40 గంటల ప్రాంతంలో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.6 శాతం లాభపడి 188.45 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో 182.90 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 189.10 వద్ద గరిష్టాన్ని, 182.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఫొనిక్స్ లిమిటెడ్ 9.8 శాతం లాభపడి రూ.576.95 వద్ద, ఒబేరాయ్ రియల్టీ 5.3 శాతం లాభపడి రూ.337 వద్ద, డీఎల్ఎఫ్ 4.3శాతం పెరిగి రూ.157.20 వద్ద, గోద్రేజ్ప్రాపర్టీస్ 4.2 శాతం పెరిగి రూ.717.75 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్రిగేడ్ ,ఐబీ రియల్ఎస్టేట్లు 3శాతం పెరిగి, సన్‌టెక్,శోభా రియల్టీలు 2.5శాతంలాభపడి ట్రేడ్ అవుతున్నాయి. మహీంద్రాలైఫ్స్పేస్ డెవలపర్స్, ప్రెస్టేజ్లు1-1.7శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. -
బ్రిగేడ్, ఒబేరాయ్ రియల్టీల జోరు
మే నెలలో చివరి ట్రేడింగ్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఎన్ఎస్ఈలో రియల్టీ షేర్లు మాత్రం జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఉదయం 11:30 ప్రాంతంలో నిఫ్టీ రియల్టీ 2.2 శాతం లాభపడి రూ.176.60 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో రూ.171.25 వద్ద ప్రారంభమైన నిఫ్టీ రియల్టీ ఒక దశలో రూ.177 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన బ్రిగేడ్ దాదాపు 4 శాతం పెరిగి రూ.105 వద్ద, ఒబేరాయ్ రియల్టీ 3 శాతం పెరిగి రూ.316.6వద్ద, గోద్రేజ్ ప్రాపర్టీస్ 3 శాతం పెరిగి రూ.673 వద్ద,ప్రెస్టేజ్ 3 శాతం పెరిగి రూ.149.40 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డీఎల్ఎఫ్ 2 శాతం పెరిగి రూ.147 వద్ద, ఫోనిక్స్ లిమిటెడ్ 2 శాతం లాభపడి రూ.501 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లోని మరికొన్ని కంపెనీలు శోభా,మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ స్వల్పలాల్లో ట్రేడ్ అవుతుండగా.. సన్‌టెక్, ఐబీ రియల్ఎస్టేట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
గోద్రేజ్ ప్రాపర్టీస్, ఐబీ రియల్ఎస్టేట్ షేర్లు హై జంప్
బుధవారం ఎన్ఎస్ఈలో రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాక్‌డౌన్‌లోనూ నిర్మాణ రంగానికి పరిమితులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో భవన నిర్మాణ రంగ పనులు పుంజుకున్నాయి. దీంతో రియల్టీ షేర్లు జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. మధ్యహ్నాం 12:40 గంటల ప్రాంతంలో నిఫ్టీ రియల్టీ 1.7 శాతం లాభంతో రూ.168.45 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో నిఫ్టీ రియల్టీ రూ.166.40 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.168.90 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన గోద్రేజ్ ప్రాపర్టీస్ 6శాతం లాభపడి రూ.638.65 వద్ద, ఐబీ రియల్ఎస్టేట్ 5 శాతం లాభపడి రూ.45 వద్ద, ప్రెస్టేజ్ 4.3 శాతం లాభపడి రూ.142.90 వద్ద , ఒబేరాయ్ రియల్టీ 2.5 శాతం లాభపడి రూ.309.70 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.సోబా,మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుండగా, బ్రిగేడ్, డీఎల్ఎఫ్, ఫోనిక్స్ లిమిటెడ్, సన్టెక్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
బ్యాంకు, రియాల్టీలకు ఉర్జిత్ షాక్!
పెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువరించే మొదటిపాలసీపై భారీగా ఆశలు పెట్టుకున్న రేట్ సెన్సిటివ్ రంగాల షేర్లకు ఆర్బీఐ షాకిచ్చింది. కీలక వడ్డీరేట్లు రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడంతో ఆ రంగాల షేర్లన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న లాభాలన్నీ ఈ ప్రకటనతో తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు వరకు లాభాల్లో నడిచిన కెనరా బ్యాంకు, ఐడిబీఐ, ఓబీసీ, పీఎన్బీ, కొటక్ మహింద్రా, సిండికేట్, యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు పడిపోయాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం క్షీణించి 17,953 పాయింట్లకు దిగజారింది.. అయితే డిసెంబర్ 10 నుంచి పెంచిన ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను ఉపసంహరించుకోనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రియల్ ఎస్టేట్ సెక్టార్ షేర్లు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 1శాతం నుంచి 3 శాతం వరకు పడిపోయాయి. అయితే నిఫ్టీ ఆటో ఇండెక్స్ మాత్రం ఆర్బీఐ ప్రకటనకు తన లాభాలను చేజార్చుకోలేదు. ఈ ఇండెక్స్ 0.56 శాతం లాభాల్లోనే నడుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నిఫ్టీ రియాల్టీ(16శాతం), నిఫ్టీ ఆటో(11శాతం), నిఫ్టీ బ్యాంకు(5.5శాతం)లు పడిపోయాయి. కాగ, ఆర్బీఐ నేడు వెలువరించిన పాలసీ సమీక్షలో రెపోను 6.25గా, రివర్స్ రెపోను 5.75గా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన మార్కెట్లన్నీ దెబ్బకొట్టింది.