సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభల్లో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో రియల్టీ షేర్లు సైతం జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నిబంధనలను భారీగా సడలించడంతో నిర్మాణ రంగ పనులు పుంజుకుని అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని ఇన్వెస్టర్లు భావిస్తుండడతో రియల్టీ షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11:40 గంటల ప్రాంతంలో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.6 శాతం లాభపడి 188.45 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్‌లో 182.90 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 189.10 వద్ద గరిష్టాన్ని, 182.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన ఫొనిక్స్ లిమిటెడ్ 9.8 శాతం లాభపడి రూ.576.95 వద్ద, ఒబేరాయ్ రియల్టీ 5.3 శాతం లాభపడి రూ.337 వద్ద, డీఎల్‌ఎఫ్ 4.3శాతం పెరిగి రూ.157.20 వద్ద, గోద్రేజ్‌ప్రాపర్టీస్ 4.2 శాతం పెరిగి రూ.717.75 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్రిగేడ్ ,ఐబీ రియల్‌ఎస్టేట్‌లు 3శాతం పెరిగి, సన్‌టెక్,శోభా రియల్టీలు 2.5శాతంలాభపడి ట్రేడ్ అవుతున్నాయి. మహీంద్రాలైఫ్‌స్పేస్ డెవలపర్స్, ప్రెస్టేజ్‌లు1-1.7శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment