realty industry
-
దేశీ రియల్టీలో భారీ పెట్టుబడులు: ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు!
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో(2023-24) దేశీ రియల్టీ రంగంలో 13 బిలియన్ డాలర్ల(రూ. 1,07,081 కోట్లు) వరకూ ఈక్విటీ పెట్టుబడులు లభించవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. గత ఐదేళ్లలో 32 బిలియన్ డాలర్ల(రూ. 2,63,584 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులు రియల్టీలోకి ప్రవహించినట్లు సీబీఆర్ఈ పేర్కొంది. రానున్న రెండేళ్లలో పెట్టుబడులు గరిష్టంగా కార్యాలయ ఆస్తులకు మళ్లవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ అభిప్రాయపడింది. ఏడాదికి 6-7 బిలియన్ డాలర్ల చొప్పున రెండేళ్లలో దేశీ రియల్టీ రంగం 12-13 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు అందుకునే వీలున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), పెన్షన్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లతోపాటు రీట్స్ తదితరాలు చేపట్టే ఈక్విటీ పెట్టుబడులపై సీబీఆర్ఈ నివేదిక రూపొందించింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) ఇతర విభాగాలకూ రియల్టీ రంగ ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం ఆఫీస్ ఆస్తుల విభాగంలోకి ప్రవహించనుండగా.. ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్, స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ తదుపరి స్థానాల్లో నిలవనున్నాయి. ఇక వీటికి అదనంగా డేటా సెంటర్లకు ప్రధానంగా ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) లభించనున్నాయి. దేశీయంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు శక్తి వంటి మూలాలు బలంగా ఉన్నట్లు సీబీఆర్ఈ చైర్మన్(ఆసియా, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. వీటికితోడు వివిధ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వాణిజ్యం రానున్న ఏడాదిలో రియల్టీ రంగ పెట్టుబడులకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. సరఫరా చైన్ అవసరాల రిస్కులను తగ్గించుకునేందుకు పలు ప్రపంచ కార్పొరేట్లు చైనా+1 వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఉత్పాదక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైతం దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇండియాకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. వెరసి రానున్న ఐదారేళ్లలో గ్లోబల్ సప్లై చైన్ రంగంలో ఇండియా మార్కెట్ వాటా బలపడనున్నట్లు అంచనా వేశారు. ఈ సానుకూల అంశాలతో ఆర్థిక వ్యవస్థ వార్షికంగా వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రపంచ సగటును మించుతూ దేశీ రియల్ ఎస్టేట్ రంగం భారీ పెట్టుబడులను ఆకట్టుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన ) నగరాల ముందంజ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రధానంగా మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాలు రియల్టీ రంగంలో ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించనున్నాయి. 2018లో దేశీ రియల్టీ రంగంలో 5.9 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు లభించగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ బాటలో 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు దేశీ రియల్టీలో నమోదైనట్లు సీబీఆర్ఈ గణాంకాలు తెలియజేశాయి. (స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) 2018-22 కాలంలో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు అత్యధిక పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2018 నుంచి పెట్టుబడుల్లో ఈ నగరాలు 63 శాతం వాటాను ఆక్రమించాయి. అంటే గత ఐదేళ్లలో నమోదైన 32 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు ఇక్కడికే ప్రవహించాయి. కాగా.. కార్యాలయ ఆస్తులు 13 బిలియన్ డాలర్లతో 40 శాతం వాటాను ఆక్రమించాయి. ఇదేవిధంగా స్థలాలు, ల్యాండ్ పార్శిల్స్ 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకున్నాయి. ఇది ఐదేళ్ల మొత్తం పెట్టుబడుల్లో 39 శాతం వాటాకు సమానం! ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చు 2023-24పై ఇండియా రేటింగ్స్ 2022–23లో 8-10 శాతం మేర పెరగొచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 5 శాతం పెరగొచ్చని ఇళ్ల ధరలు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర ధరలు పెరిగాయని తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి తటస్థ అంచనాలతో ఉన్నట్టు తెలిపింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2022–23లో క్రమబద్ధమైన అప్డ్రెంట్లో ఉంది. టాప్ 8 రియల్ ఎస్టేట్ క్లస్టర్లలో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. నిర్మాణ వ్యయాలు పెరిగినా, మార్ట్గేజ్ రేట్లు పెరిగినా, దేశీయంగా, అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి తగ్గినా అమ్మకాలు పెరగడం ఆశాజనకనం’’అని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్వల్పకాలానికి డిమాండ్‌పై కొంత ప్రభావం చూపించొచ్చని, మొత్తం మీద నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ ఒత్తిళ్లను సర్దుబాటు చేసుకోగలదనే అంచనాలను వ్యక్తం చేసింది. డిమాండ్ పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపింది. అమ్మకాల ఊపు కొనసాగుతుందని, మొత్తం మీద వార్షికంగా చూస్తే విక్రయాలు 9 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. 2022-23లో నిర్మాణ వ్యయాలు 8–10 శాతం మేర పెరిగాయని, దీంతో డెవలపర్లకు నిర్మాణ బడ్జెట్ 5–6 శాతం మేర అధికం కావొచ్చని పేర్కొంది. అయినప్పటికీ డెవలపర్లు వచ్చే ఆరేడు నెలలపాటు ధరలు పెంచకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో డిమాండ్ బలపడే వరకు వేచి చూడొచ్చని పేర్కొంది. అందుబాటు ధరలు.. అందుబాటు ధరలు 2021-22లో ఇళ్ల అమ్మకాలను నడిపించినట్టు ఇండియా రేటింగ్స్ తెలిపింది. ‘‘అయితే ద్రవ్యోల్బణం అమ్మకాల ధరలను పెంచేలా చేశాయి. 2022 మే నుంచి ఆర్బీఐ వరుసగా రెపో రేటు పెంపు 2022- 23లో అందుబాటు ధరల ఇళ్ల విభాగం డిమాండ్‌కు సవాలుగా నిలిచాయి. అంతేకాదు, మధ్య, ప్రీమియం విభాగంలోనూ కొనుగోళ్లను వాయి దా వేయడానికి దారితీశాయి. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని పెద్ద సంస్థలు, మంచి బ్రాండ్ విలువ కలిగినవి, 2023-24లో బలమైన నిర్వహణ పనితీరు చూపిస్తాయి. తద్వారా వాటి మార్కెట్ షేరు పెరగొచ్చు’’అని పేర్కొంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని డెవలపర్లు బలహీన అమ్మకాలు, వసూళ్లు, నిధుల లభ్యత పరంగా సమస్యలను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
Hyderabad: వరుస ఐటీ దాడులు.. రియల్టీలో కల్లోలం!
సాక్షి, హైదరాబాద్: మూడు వెంచర్లు.. ఆరు ప్రాజెక్టులతో జోరు మీద ఉన్న రియల్టీ రంగం కుదుపునకు లోనైంది. వరుసగా జరుగుతున్న ఆదాయపన్ను దాడులు స్థిరాస్తి వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రోజుకో సంస్థపై ఐటీ, ఈడీ సంస్థల దాడులతో స్థిరాస్తి రంగంలో అనిశ్చితి నెలకొంది. ఫీనిక్స్, వాసవి గ్రూప్, సుమధుర, హానర్ హోమ్స్, మంత్రి, అరబిందో, స్పెక్ట్రా, వంశీరామ్ బిల్డర్స్ వంటి నిర్మాణ సంస్థలపై ఆదాయపన్ను (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల నేపథ్యంలో డెవలపర్లలో అలజడి నెలకొంది. అనధికార లావాదేవీలు, ఆదాయ పన్ను, జీఎస్టీ ఎగవేతలే సోదాలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న డెవలపర్లలో వణుకు మొదలైంది. మరోవైపు ప్రీలాంచ్ పేరిట ముందస్తుగా సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులకు ఆయా ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయో లేదోననే ఆందోళన నెలకొంది. మొత్తంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగం కల్లోల పరిస్థితిలో ఉంది. ప్రాజెక్ట్‌లు నిలిచిపోయి.. నగర రియల్టీ రంగంలో గుత్తాధిపత్యం సాధించేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. సామర్థ్యానికి మించి ఒకేసారి నివాస, వాణిజ్య సముదాయాలను ప్రకటిస్తున్నాయి. ఆయా ప్రాజెక్ట్‌లో విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిధులను అదే ప్రాజెక్ట్‌కు వినియోగించాలనే ‘రెరా’నిబంధనలు భేఖాతరు చేస్తూ నిధులను ఇతర ప్రాజెక్ట్‌లకు, అవసరాలకు మళ్లిస్తున్నాయి. దీంతో విక్రయాలు మందగించినా లేదా ఇతరత్రా లీగల్ సమస్యలు తలెత్తినా దాని ప్రభావం అన్ని ప్రాజెక్ట్‌ల మీద పడుతోంది. ఫార్మా రంగం నుంచి సడెన్‌గా రియలీ్టలోకి వచి్చన ఓ కంపెనీ.. వచ్చి రాగానే మాదాపూర్, కొండాపూర్‌లో పలు భారీ నివాస, వాణిజ్య సముదాయాలకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో ప్రీలాంచ్ సందర్భంగా సంపన్నులు, ప్రవాసులు, బ్యూరోక్రాట్స్ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కానీ, ఊహించని రీతిలో ఆ కంపెనీ ప్రతినిధి అరెస్టు కావడంతో ఇప్పుడా ప్రాజెక్ట్‌ల భవిష్యత్తుపై కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఐటీ దాడులు జరిగిన మరో కంపెనీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పుప్పాలగూడలో ఆ సంస్థ నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం నిర్మాణ పనులకు నిధుల గ్రహణం పట్టుకుంది. లెక్కలు సరిదిద్దే పనిలో.. వరుస ఐటీ దాడుల నేపథ్యంలో ఆ కంపెనీలన్నీ నల్లధనాన్ని దారిమళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. బ్యాలెన్స్ షీట్లు, రికార్డ్‌లు, డేటా వంటి వాటిని ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేసుకొని సమీక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలతో కొనుగోలుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. విచారణలో కంపెనీల ఖాతాల్లోని లెక్కల్లో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ విలువ కంటే పదింతల సొమ్మును కంపెనీలకు ముట్టజెప్పారు. ఈక్రమంలో ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచి్చందో చెప్పాలంటూ తమకెక్కడ నోటీసులు వస్తాయోనని మధనపడుతున్నారు. దీంతో ప్రీలాంచ్లో విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు డబ్బులు వాపసు ఇవ్వాలంటూ కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లెక్కల్లో దొరక్కుండా.. ఐటీకి చిక్కకుండా.. రిజి్రస్టేషన్ విలువ కొండాపూర్‌లో చదరపు అడుగు రూ.4,500 మించి లేదు. కానీ, రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. పుప్పాలగూడలో చ.అ.కు రూ.2,200 ఉండగా.. రూ.10 వేలకుపైనే అమ్మకాలు చేస్తున్నారు. నగదు రూపంలో ఫ్లాట్లను విక్రయించేందుకే బిల్డర్లు ఆసక్తి చూపిస్తుంటారు. రిజి్రస్టేషన్ విలువకు, అమ్మే రేట్లకు మధ్య అంతులేని వ్యత్యాసం ఉంటుంది. కనీసం 20 శాతం కూడా స్టాంప్ డ్యూటీ చెల్లించరు. మిగిలినదంతా బ్లాక్ మనీగా మార్చుతారనే అభియోగాలున్నాయి. ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌లోనే సుమారు లక్ష ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా కాగా వీటిల్లో చాలావరకు శంకుస్థాపన నాటి నుంచే విక్రయాలు సాగిస్తున్నవే. అటు స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి, ఇటు నగదు లావాదేవీల లెక్కలు ఐటీకి దొరక్కుండా నిర్మాణ సంస్థల యజమానులు మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వెంచర్లలో నల్లధనం ఎక్కువ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల వెంచర్లలో అనధికార లావాదేవీలు, నల్లధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 90 శాతం వరకూ భవన నిర్మాణ పనులకే వెచి్చంచాల్సి ఉంటుంది. అలాగైతేనే నిర్మాణం పూర్తవుతుంది. పైగా కస్టమర్లు బ్యాంకు రుణం రూపంలో గృహాలను కొనుగోలు చేస్తారు కాబట్టి అవన్నీ లెక్కల్లోకి వస్తాయి. అదే వెంచర్లలో అయితే బిల్డర్ వెచి్చంచే వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఓపెన్ ప్లాట్లను ఎక్కువగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేస్తుంటాయి. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసిన సొమ్మునే పెట్టుబడి పెడతారే తప్ప రుణంతో కొనరు. దీంతో వెంచర్లలో అనధికార లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయని రామ్ డెవలపర్స్ ఎండీ రాము తెలిపారు. -
రికవరీ ఆశలు- రియల్టీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఒడిదొడుకుల మార్కెట్లోనూ రయల్టీ రంగ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం 3 శాతం ఎగసింది. పలు కౌంటర్లకు డిమాండ్ ఏర్పడటంతో లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం.. షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 285 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 289 వరకూ ఎగసింది. ఈ బాటలో గోద్రెజ్ ప్రాపర్టీస్ దాదాపు 4 శాతం పెరిగి రూ. 1,105 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,122 వరకూ లాభపడింది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ సైతం 3 శాతం వృద్ధితో రూ. 196 వద్ద కదులుతోంది. తొలుత రూ. 201 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇతర కౌంటర్లలో ఇండియాబుల్స్ రియల్టీ 2.7 శాతం బలపడి రూ. 63 వద్ద ట్రేడవుతోంది. శోభా లిమిటెడ్ 1.25 శాతం పుంజుకుని రూ. 318 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 323 వరకూ పురోగమించింది. ఇదే విధంగా ఒబెరాయ్, సన్‌టెక్, బ్రిగేట్ సైతం 0.5 శాతం స్థాయిలో బలపడి ట్రేడవుతున్నాయి. కారణాలివీ.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో రియల్టీ రంగ కంపెనీలు సగటున ప్రోత్సాహకర ఫలితాలు సాధించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్)లో రెసిడెన్షియల్ విభాగం పటిష్ట పనితీరును చూపినట్లు తెలియజేశారు. తద్వారా నిర్వహణ లాభాలను సాధించినట్లు వివరించారు. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక రికవరీ రియల్టీకి డిమాండ్‌ను పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, ఆతిథ్య రంగం నుంచి డిమాండ్ పెరిగే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెసిడెన్షియల్ విభాగానికి పన్నుసంబంధ మినహాయింపులను ప్రకటించడంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశాయి. అంతేకాకుండా పీఎంఏవై పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు కేటాయించడం కూడా ఇందుకు దోహదపడనున్నట్లు విశ్లేషించాయి. -
రియల్టీ షేర్లకు మరాఠీ జోష్
కోవిడ్-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్లనుంచి రియల్టీ రంగానికి ఉపశమనాన్ని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. గృహ వినియోగదారులకు మద్దతుగా స్టాంప్ డ్యూటీ తగ్గింపు నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబర్‌వరకూ అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా 2021 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ 3 శాతం స్టాంప్ డ్యూటీని మాత్రమే విధించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్టాంప్ డ్యూటీ 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గనుంది. 2021 జనవరి- మార్చి మధ్య కాలంలో 2 శాతంగా అమలుకానుంది. కరోనా వైరస్ విస్తృతితో ఇటీవల డీలాపడ్డ రియల్టీకి మద్దతుగా స్టాంప్ డ్యూటీని తగ్గించమంటూ కొంతకాలంగా రియల్టీ కంపెనీలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తలతో ఒక్కసారిగా రియల్టీ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం 3.3 శాతం ఎగసింది. ప్రస్తుతం పలు కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ర్యాలీ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సన్‌టెక్ రియల్టీ 8.5 శాతం దూసుకెళ్లి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఒబెరాయ్ రియల్టీ 6.3 శాతం జంప్‌చేసి రూ. 390ను తాకగా.. ఇండియాబుల్స్ రియల్టీ 4.7 శాతం ఎగసి రూ. 73కు చేరింది. ఇతర కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్ 4.5 శాతం పెరిగి రూ. 889 వద్ద, శోభా లిమిటెడ్ 2.25 శాతం బలపడి రూ. 261 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదేవిధంగా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 2 శాతం పుంజుకుని రూ. 245 వద్ద, బ్రిగేడ్ 2 శాతం లాభంతో రూ. 175 వద్ద కదులుతున్నాయి. ఇక ఒమాక్స్ 1.2 శాతం పెరిగి రూ. 75ను అధిగమించగా.. ఫీనిక్స్ 0.7 శాతం బలపడి రూ. 655 వద్ద, డీఎల్ఎఫ్ 0.7 శాతం లాభపడి రూ. 161 వద్ద ట్రేడవుతున్నాయి. -
180 బిలియన్ డాలర్లకి రియల్టీ పరిశ్రమ!
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ న్యూఢిల్లీ: దేశీ రియల్టీ పరిశ్రమ 2020 నాటికి 180 బిలియన్ డాలర్లకి చేరుతుందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) అంచనా వేసింది. స్మార్ట్ సిటీల నిర్మాణం, రీట్స్‌కు పన్ను ప్రోత్సాహకాలు వంటి పలు అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా నిలుస్తాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పలు సంస్కరణల కారణంగా దేశీ రియల్టీ రంగం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి చూరగొంటుందని, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తుందని ఎన్‌హెచ్‌బీ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో శ్రీరామ్ కల్యాణరామన్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. జీఎస్టీ బిల్లు అమలులోకి వస్తే.. వేర్‌హౌస్ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. రియల్టీ వృద్ధికి సమతుల్యంతో కూడిన నిబంధనలు సహా పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన చాలా అవసరమని సీబీఆర్ఈ చైర్మన్ (ఇండియా, దక్షిణ తూర్పు ఆసియా) అన్సుమన్ మేగజిన్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ రంగం సహకారం లేకుండా రియల్టీలో వృద్ధి కష్టసాధ్యమని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. కొత్త రియల్టీ చట్టం.. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి దోహదపడుతుంద ని సీఐఐ చైర్పర్సన్ రుమ్జుమ్ చటర్జీ తెలిపారు.