కలెక్టరేట్లో వీఆరో ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్‌అర్బన్ :
అధికారుల వేధింపులు భరించలేక సోమవారం బిచ్కుంద మండలానికి చెందిన వీఆర్వో బి భూపతి కలెక్టరేట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు రావడంతో చికిత్స పొందిన తనను విధుల్లో చేరేందుకు రూ. 25 వేలు అడిగిన తహసీల్దార్‌ను, ఉప తహశీల్దార్‌ను జైలుకు పంపాలని బాధితుడు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూపతి ఆత్మహత్యాయత్నాన్ని చిత్రీకరించిన ఓ చానల్ రిపోర్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.