Rebound
-
గత నెలలో పుంజుకున్న గ్లోబల్ సేల్స్!
న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్ల వృద్ధి, ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు ఏప్రిల్‌లో పుంజుకున్నాయి. నాలుగు నెలల గరిష్టానికి చేరాయి. ఇందుకు సంబంధించిన పీఎంఐ సూచీ (ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) మార్చిలో 56.4 పాయింట్లు ఉండగా ఏప్రిల్‌లో 57.2 పాయింట్లకు పెరిగింది. సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. అంతర్జాతీయంగా అమ్మకాలు పెరుగుతుండటం, సరఫరా వ్యవస్థపరమైన పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటివి కూడా ఇందుకు దోహదపడినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోల్యానా డి లిమా తెలిపారు. దీనికి సంబంధించిన సర్వే ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఉత్పత్తి వృద్ధి రేటు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరిగిందని, తగ్గిపోయే నిల్వలను భర్తీ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు కూడా మరింతగా ముడి సరుకులను కొనుగోలు చేస్తున్నాయని లిమా వివరించారు. భారతీయ తయారీ సంస్థలు ముందుకు దూసుకెళ్లడానికి పుష్కలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని లిమా పేర్కొన్నారు. మార్కెట్లో సానుకూల పరిస్థితులు, డిమాండ్ మెరుగ్గా ఉండటం వంటి అంశాలు కొత్త ఆర్డర్లకు దోహదపడుతున్నాయని చెప్పారు. -
మార్కెట్ రీబౌండ్: భారీ నష్టాల్లో ఐటీ షేర్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో పప్రారంభమైనాయి. అయితే ఆరంభంలో అమ్మకాల ఒత్తిడినుంచి కీలక సూచీలు కోలుకున్నాయి. కానీ తీవ్ర ఊగిసలాట కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 58, 828 వద్ద కొనసాగుతోంది. తద్వారా 58వేల 800 స్థాయిని తిరిగి నిల బెట్టుకుంది. నిఫ్టీ లాభాల్లోకి పుంజుకుంది. 7 పాయింట్ల లాభంతో 17481 కొనసాగుతోంది. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పాయి. అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్ నష్టపోతున్నాయి. -
పుంజుకున్న సూచీలు, లాభాల జోరు
సాక్షి, ముంబై : వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు రీబౌండ్ అయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దాదాపు 850 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 29300ని టచ్ చేసింది. నిఫ్టీ 8500 పాయింట్లను అధిగమించింది. అయితే లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 564 పాయింట్ల లాభాలకు పరిమితమై 2907 వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు ఎగిసి 8450 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ ఏవియేషన్ ఇలా అన్ని రంగాలు లాభపడుతున్నాయి. కానీ కీలక మద్దతు స్థాయిలకు దిగువన కొనసాగుతున్నాయి. -
స్టాక్‌మార్కెట్ లో ఉగాది కళ
సాక్షి, ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లోకి మళ్లాయి. ఆరంభ నష్టాలనుంచి వెనువెంటనే తేరుకున్న సూచీలు మిడ్ సెషన్ నుంచి దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 441 పాయింట్లు దూసుకుపోయింది. అన్ని రంగాల షేర్లు లాభాలతో కళ కళ లాడుతున్నాయి. సెన్సెక్స్ 28వేల పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 8200ల పాయింట్ల స్థాయిని సునాయాసంగా అధిగమించింది. కోవిడ్ -19 విస్తరణ నేపథ్యంలో ద్రవ్య సమస్యలు అధిగమించేందుకు ప్రధానంగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు బ్యాంకు క్రెడిట్ లైన్ ను ప్రకటించడంతో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరునెలకొంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ ఆ సమయంలో 5.7 శాతం పెరిగింది.యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్‌డిఎఫ్‌సి 7 శాతం నుంచి 10 శాతం ఎగిసాయి. వీటితోపాటు హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర బ్యాంకింగ్ షేర్లు లాభపడుతున్నాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ , ఒఎన్జీసీ నష్టపోతున్నాయి. దీనికితోడు వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాపై పోరాటానికి అమెరికా కాంగ్రెస్ 2-ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ ఉగాదివేళ కొనుగోళ్లతో కళకళలాడుతోంది. చదవండి : కరోనా క్రాష్ : రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి -
షార్ట్ కవరింగ్ : సెన్సెక్స్ హై జంప్
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. తద్వారా సోమవారం నాటి మహాపతనం నుంచి భారీ రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 1286 పాయింట్లు ఎగిసి 27314 వద్ద, నిఫ్టీ 400 పాయింట్లు లాభపడి 8003 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా, సెన్సెక్స్ నిఫ్టీ 8 వేల మార్క్‌ను దాటింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. అయితే దేశీయంగా కూడా విమాన సర్వీసులను రద్దు చేయడంతో విమానయాన రంగ షేర్లు నష్టపోతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మ లాభపడుతున్నాయి. హెచ్ యూల్, ఇన్ఫోసిస్, హెచ్ ససీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, రిలయన్స్, ఎస్బీఐ టాప్ లూజర్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్ రీబౌండ్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవడం ముఖ్యమని, ట్రేడర్లు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ గా చమురు ధరలు భారీగా పుంజుకున్నాయి. -
బ్యాంకుల రీబౌండ్, 200 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి సూచీలు మిడ్ సెషన్‌కు మరింత క్షీణించాయి. తిరిగి పుంజుకున్నాయి. లాభనష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడుతూ సెన్సెక్స్ ప్రస్తుతం 203 పాయింట్లు ఎగిసి 40870 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు ఎగిసి 12048 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే కనిష్టస్థాయి 31,444.00 నుంచి 434 పాయింట్లు లాభపడి 31,878.35 స్థాయిని అందుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్‌గా ఉండగా, యస్‌బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పీఎన్బీ, ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మాత్రం స్వల్పంగా నష్టపోతున్నాయి. టాటా మోటార్స్, వేదాంతా, టాటా స్టీల్, సన్ ఫార్మా ఓఎన్జీసీ లాభపడుతున్నాయి. మరోవైపు రిలయన్స్, కోల్ ఇండియా, ఐవోసీ, మారుతి సుజుకి ఏషియన్ పెయింట్స్, నెస్లే నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి. -
భారీ లాభాల్లోకి సూచీలు, బ్యాంక్స్ అప్
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు ఉన్నట్టుండి లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 366 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభాలతో కొనసాగుతోంది. ఆరంభంలో నామమాత్రపు లాభాలతో ఉన్నకీలక సూచీలు ఒక దశలో 100 పాయింట్లకు పైగా క్షీణించాయి. కానీ అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్స్‌క్స్355 పాయింట్ల లాభంతో 37901 వద్ద నిఫ్టీ 101 పాయింట్లు ఎగిసి 11227 వద్ద కొనసాగుతున్నాయి.ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్లకుభారీ మద్దతునిస్తున్నాయి. బ్యాంక్‌నిఫ్టీ 600 పాయింట్లకుపైగా ఎగిసింది. అటు ఆటో షేర్లు కూడా లాభపడుతున్నాయి. మరోవైపు ఐటీ, ఫార్మా బలహీనంగా ఉన్నాయి. భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎం అండ్ఎం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్‌మహీంద్ర, యాక్సిస్, ఎల్ అండ్ టీ మారుతి సుజుకి, టాటా మోటార్స్, భారీగా లాభపడుతున్నాయి. యస్‌బ్యాంకు, టైటన్, హెచ్‌సీఎల్,టెక్, జీ, ఐటీసీ, హీరో, మోటో, టీసీఎస్,యూపిఎల్,రిలయన్స్‌నష్టపోతున్నాయి. అలాగే బై బ్యాక్ ఆఫర్‌తో ఇండియా బుల్స్ 10 శాతానికి పైగా ఎగిసింది. ప్రస్తుతం 5శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ అయింది. -
లాభాల్లో మార్కెట్లు, 10850కి పైన నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్నాయి. రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మధ్యలో అమ్మకాలు పెరిగి ఊగిసలాటకు లోనయ్యాయి. తిరిగి పుంజుకుని ప్రస్తుతం సెన్సెక్స్ 164 పాయింట్లు పెరిగి 36,645 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 10,862 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ వడ్డీ తగ్గింపు అంచనాలు, ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. 36,713 వరకూ ఎగసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. ప్రధానంగా ఆయిల్ రంగషేర్లు, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, రియల్టీ షేర్ల లాభాలు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. కెనరా, ఎస్బీఐ, యూనియన్, పీఎన్బీ, బీవోబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్, జేఅండ్‌కే తదితర బ్యాంకింగ్ షేర్లు, మెటల్ స్టాక్స్‌లో ఎన్ఎండీసీ, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హింద్ జింక్, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభపడుతున్నాయి. వీటితోపాటు బజాజ్ ఫైనాన్స్, గెయిల్, బజాజ్ ఫిన్, ఏషియన్ పెయింట్స్, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బ్రిటానియా, ఓఎన్‌సీజీ, కోల్ ఇండియా, యూపీఎల్, ఎయిర్టెల్, ఐషర్, ఐటీసీ, మారుతీ, సన్ ఫార్మా, సిప్లా నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయికూడా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. -
లాభాల్లోకి మార్కెట్ల రీబౌండ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో ఆరంభ నష్టాలనుంచి కీలక సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలకు ఎగువకు చేరాయి. ఈ బౌన్స్‌బ్యాక్ తో సెన్సెక్స్ కనిష్టం నుంచి దాదాపు 400 పాయింట్లు ఎగిసింది. దీంతో సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించాయి. కానీ మిడ్ సెషన్ తరువాత వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 95 పాయింట్లు పుంజుకుని 37070 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు లాభాలకుపరిమితమై 10975 వద్ద ఉంది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో రంగాలు లాభపడుతుండగా, ఐటీ స్వల్పంగా నష్టపోతోంది. యూపీఎల్, ఎల్అండ్టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎయిర్టెల్ భారీ లాభపడుతుండగా, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. -
మార్కెట్ల రీబౌండ్, ఆటో జూమ్
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా రీబౌండ్ అయ్యాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ అవుతున్నాయి. వారాంతంలో షార్ట్ కవరింగ్, ఆటో షేర్లలో కొనుగోళ్ల కారణంగా మిడ్ సెషన్ తరువాత కనిష్టంనుంచి దాదాపు 400 పాయింట్లు ఎగిసాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 37433 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పుంజకుని 11065 వద్ద కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఆటో పుంజుకోగా, ఐటీ, ఫార్మ నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు, మారుతి సుజుకి, ఇండస్ ఇండ్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఎం అండ్ ఎం టాప విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు ఇండియా బుల్స్ హౌసింగ్, టీసీఎస్, డా.రెడ్డీస్, సన్ ఫార్మ, టాటా స్టీల్, వేదాంతా, హిందాల్కో, టెక్ మహీంద్ర నష్టపోతున్నాయి. -
కొనుగోళ్ల జోష్: మార్కెట్ల రీబౌండ్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సందేశాలతో 300పాయింట్లకుపైగా మార్కెట్లు అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయి. ట్రేడర్ల కొనుగోళ్లతో నిఫ్టీ తిరిగి 11వేల ఎగువకి చేరడం విశేషం. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు 400 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఆటో ఇండెస్స్ కూడా 3శాతం ఎగియడంతో స్టాక్‌మార్కెట్లు తిరిగా లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 182 పాయింట్లు పుంజుకని 37200 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు ఎగిసి 11025 వద్ద కొనసాగుతోంది. క్యూ 1 ఫలితాల జోష్‌తో హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
మార్కెట్ల రీబౌండ్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో రీబౌండ్ అయ్యాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, వెంటనే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. అనంతరం కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్ 171 పాయింట్లు ఎగిసి 38202 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 11394 వద్ద కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ, ఆటో రంగాల షేర్లు లాభ పడుతున్నాయి. యస్‌బ్యాంకు, కొటక్ మహీంద్రా, యూపీఎల్ తోపాటు, ఐసీఐసీఐ, యీక్సిస్, పవర్‌గ్రిడ్, టైటన్, ఐటీసీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, గెయిల్, ఐషర్ , హీరోమెటో కార్ప్ లాభపడుతున్నాయి. రియల్టీ కౌంటర్లలో శోభా, ఒబెరాయ్, బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మహీంద్రా లైఫ్, డీఎల్ఎఫ్ లాభపడుతున్నాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ, జీ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐబీ హౌసింగ్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, సిప్లా నష్టపోతున్నాయి. -
చివర్లో కొనుగోళ్లు : మార్కెట్ల రీబౌండ్
సాక్షి, ముంబై : ఆరంభంలాభాల నుంచి వెనక్కి తగ్గిన స్టాక్‌మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు చివర్లో ఆఖరి గంటలో నష్టాలనుంచి భారీగా పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకున్నాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు ఎగిసి 39749 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 11928 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ భారీగా ఎగిసింది. హెచ్డీఎఫ్సీ లాభాలు బ్యాంక్‌నిఫ్టీకి బలాన్నిచ్చాయి. ఎస్‌బ్యాంకు. ఇండస్, ఆర్బెల్,కోటక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, విప్రో, అదానీ, రిలయన్స్, డిష్‌టీవీ, లాభాల్లో ముగిసాయి. మరోవైపు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయన్నవార్త నేపథ్యంలో భారీగా నష్టపోయింది. దీంతోపాటు భారతి ఇన్ఫ్రాటెల్, హీరో మోటో, ఎంఅండ్ ఎం, టాటా మోటార్స్ , బజాజ్ ఫిన్, ఎల్ అండ్‌టీ, గ్రాసిం, పీఎన్బీ, స్పైస్‌జెట్ నష్టపోయాయి. -
కొనుగోళ్లతో పుంజుకున్న మార్కెట్లు
సాక్షి, ముంబై : కీలక మద్దతు స్థాయి వల్ల దేశీయ స్టాక్‌మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో నష్టాలనుంచి క్రమంగా పుంజుకుంటూ లాభాలవైపు మళ్లాయి. మిడ్ సెషన్ తరువాత పుంజుకున్న కొనుగోళ్లతో సెంచరీకిపైగా లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు పుంజుకుని 36615 , నిఫ్టీ 33 పాయింట్లు ఎగిసి 10924 వద్ద పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఐబీ హౌసింగ్, హిందాల్కో, టాటా స్టీల్, యస్ బ్యాంక్, సిప్లా, హెచ్‌పీసీఎల్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అయితే టైటన్, ఓఎన్జీసీ, ఐషర్, బజాజ్ ఆటో, ఆర్ఐఎల్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. -
మార్కెట్లు రీబౌండ్ : ఇన్ఫీ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలనుంచి బాగా కోలుకున్నాయి. వరుసగా అయిదు సెషన్లుగా లాభపడిన సూచీలు మంగళవారం ప్రతికూలంగా ఆరంభమైనాయి. అనంతరం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆఖరి గంటలో రీబౌండ్ అయ్యాయి. దాదాపు 60 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి. దీంతో నిఫ్టీ 10900 స్థాయిని అధిగమించగా, సెన్సెక్స్ 36330 ఎగువన ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకుల లాభాల మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే. సన్‌ఫార్మా టాప్ గెయినర్‌గా ఉంది. బ్యాంకింగ్ షేర్లలో పీఎన్బీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, కెనరా తదితర బ్యాంకులు లాభపడుతున్నాయి. ఇంకా పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతున్నవాటిలో ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ టాప్ లూజర్‌గా వుండగా, ఎస్‌బ్యాంకు, జీ, యూపీఎల్ తదితరాలు నష్టపోతున్నాయి. -
7రోజుల నష్టాలకు బ్రేక్: ఫార్మ, బ్యాంకింగ్ జోష్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీగా రీబౌండ్ అయ్యాయి. గత ఏడు సెషన్లుగా భారీగా కుదేలవుతున్న సూచీలు చివరికి లాభాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లలో కొనుగోళ్ల ధోరణి కనిపించింది. దీంతో రోజంతా భారీ లాభాలతో కదిలాడిన సెన్సెక్స్ 330 పాయింట్లు జంప్‌చేసి 34,413 వద్ద , నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 10,577 వద్ద ముగిసింది. ఫార్మ టాప్ విన్నర్‌గా ఉండగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ , మెటల్, ఐటీ, ఆటో రంగాల షేర్లులాభపడ్డాయి. ప్రధానంగా సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఇండెక్స్ హెవీవెయిట్స్ బాగా లాభపడ్డాయి. సిప్లా, అంబుజా, ఇన్ఫ్రాటెల్, ఐబీ హౌసింగ్, యూపీఎల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ లాభాల్లో, అరబిందో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటర్స్, హిందాల్కో నష్టాల్లోనూ ముగిశాయి. -
యూ టర్న్.. డబుల్ సెంచరీ
సాక్షి, ముంబై: గుజరాత్ ఎన్నికల ఫలితాలను ప్రతిబింబిస్తూ స్టాక్‌మార్కెట్లు కదులుతున్నాయి. ఆరంభంలో 700 పాయింట్లకుపైగా మార్కెట్లు తాజా ఫలితాల సరళి నేపథ్యంలో భారీ నష్టాల్లోంచి అనూహ్యంగా లాభాల్లోకి మళ్ళాయి. సెన్సెక్స్ 188పాయింట్లు ఎగిసి 33,651 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో వద్ద 10, 395 వద్ద కొనసాగుతుండడం విశేషం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే బాటలో భారీగా పుంచుకుంది. మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాల్లో ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియల్టీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా వేదాంతా 3.5 శాతం జంప్‌చేసింది. అలాగే సిప్లా, గెయిల్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ ఉన్నాయి. ఐవోసీ, టెక్‌మహీంద్రా, సన్‌ఫార్మ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, హీరోమోటో, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్నాయి. మరోవైపు ఫైనల్ ఫిగర్స్ వచ్చేంతవరకు కీలక సూచీల్లో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని మార్కెట్ విశ్లేషకుల భావన. -
సెన్సెక్స్ సెంచరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా కోలుకున్నాయి. ఆరంభంలో డీలాపడినప్పటికీ ట్రేడర్లు షార్ట్ కవరింగ్ కారణగా సెన్సెక్స్ 100పాయింట్లకు పైగా పుంజుకుంది. నిఫ్టీ 9750 కీలక మద్దతు స్తాయికి ఎగువకి చేరింది. సెన్సెక్స్ 106 పాయింట్లు పుంజుకుని 31,266వద్ద, నిఫ్టీ20 పాయింట్లు బలపడి 9,756 వద్ద ట్రేడవుతోంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. అటు డాలర్‌మారకంలో రూపాయి బలహీనత కొనసాగుతోంది. 0.6పైసల నష్టంతో రూ.65.77వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పదిగ్రా. స్వల్పంగా లాభపడి 29,668 వద్ద ఉంది. -
లాభాల్లో మార్కెట్లు ప్రారంభం
తొమ్మిది రోజుల కరెక్షన్ అనంతరం ఫార్మా షేర్లు తిరిగి పుంజుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాభాల్లో ఎగిసిన కొద్దిసేపటికే మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 90 పాయింట్ల లాభంలో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 9.58 పాయింట్ల లాభంలో 25,816 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 7,908గా ట్రేడ్ అవుతోంది. టాటా స్టీల్, ఐటీసీ, సిప్లా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ లాభాల్లో నడుస్తుండగా.. హీరో మోటార్ కార్ప్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, మహింద్రా అండ్ మహింద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాలు పాలవుతున్నాయి. గెయిల్ ఇండియా నిఫ్టీలో టాప్ లూజర్‌గా ట్రేడ్ అవుతోంది. ఈ కంపెనీ షేర్లు 1.16 శాతం పడిపోయాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పడిపోయి 67.84గా ఎంట్రీ ఇచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో అటు బంగారం ధరలు 56 రూపాయలు పెరిగి 27,050గా ట్రేడ్ అవుతున్నాయి.