
సాక్షి, ముంబై : వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు రీబౌండ్ అయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దాదాపు 850 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 29300ని టచ్ చేసింది. నిఫ్టీ 8500 పాయింట్లను అధిగమించింది. అయితే లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 564 పాయింట్ల లాభాలకు పరిమితమై 2907 వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు ఎగిసి 8450 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ ఏవియేషన్ ఇలా అన్ని రంగాలు లాభపడుతున్నాయి. కానీ కీలక మద్దతు స్థాయిలకు దిగువన కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment