అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. తద్వారా సోమవారం నాటి మహాపతనం నుంచి భారీ రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 1286 పాయింట్లు ఎగిసి 27314 వద్ద, నిఫ్టీ 400 పాయింట్లు లాభపడి 8003 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా, సెన్సెక్స్ నిఫ్టీ 8 వేల మార్క్ను దాటింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. అయితే దేశీయంగా కూడా విమాన సర్వీసులను రద్దు చేయడంతో విమానయాన రంగ షేర్లు నష్టపోతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మ లాభపడుతున్నాయి.
హెచ్ యూల్, ఇన్ఫోసిస్, హెచ్ ససీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, రిలయన్స్, ఎస్బీఐ టాప్ లూజర్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్ రీబౌండ్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవడం ముఖ్యమని, ట్రేడర్లు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ గా చమురు ధరలు భారీగా పుంజుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment