
సాక్షి, ముంబై : కీలక మద్దతు స్థాయి వల్ల దేశీయ స్టాక్‌మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో నష్టాలనుంచి క్రమంగా పుంజుకుంటూ లాభాలవైపు మళ్లాయి. మిడ్ సెషన్ తరువాత పుంజుకున్న కొనుగోళ్లతో సెంచరీకిపైగా లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు పుంజుకుని 36615 , నిఫ్టీ 33 పాయింట్లు ఎగిసి 10924 వద్ద పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి.
ఐబీ హౌసింగ్, హిందాల్కో, టాటా స్టీల్, యస్ బ్యాంక్, సిప్లా, హెచ్‌పీసీఎల్, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అయితే టైటన్, ఓఎన్‌జీసీ, ఐషర్, బజాజ్ ఆటో, ఆర్‌ఐఎల్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment