సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్నాయి. రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మధ్యలో అమ్మకాలు పెరిగి ఊగిసలాటకు లోనయ్యాయి. తిరిగి పుంజుకుని ప్రస్తుతం సెన్సెక్స్ 164 పాయింట్లు పెరిగి 36,645 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 10,862 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ వడ్డీ తగ్గింపు అంచనాలు, ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. 36,713 వరకూ ఎగసింది.
దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. ప్రధానంగా ఆయిల్ రంగషేర్లు, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, రియల్టీ షేర్ల లాభాలు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. కెనరా, ఎస్‌బీఐ, యూనియన్, పీఎన్‌బీ, బీవోబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్, జేఅండ్‌కే తదితర బ్యాంకింగ్ షేర్లు, మెటల్ స్టాక్స్‌లో ఎన్‌ఎండీసీ, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హింద్ జింక్, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభపడుతున్నాయి. వీటితోపాటు బజాజ్ ఫైనాన్స్, గెయిల్, బజాజ్ ఫిన్, ఏషియన్ పెయింట్స్, కొటక్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బ్రిటానియా, ఓఎన్‌సీజీ, కోల్ ఇండియా, యూపీఎల్, ఎయిర్‌టెల్, ఐషర్, ఐటీసీ, మారుతీ, సన్ ఫార్మా, సిప్లా నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయికూడా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment