సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలనుంచి బాగా కోలుకున్నాయి. వరుసగా అయిదు సెషన్లుగా లాభపడిన సూచీలు మంగళవారం ప్రతికూలంగా ఆరంభమైనాయి. అనంతరం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆఖరి గంటలో రీబౌండ్ అయ్యాయి. దాదాపు 60 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి. దీంతో నిఫ్టీ 10900 స్థాయిని అధిగమించగా, సెన్సెక్స్ 36330 ఎగువన ట్రేడ్ అవుతోంది.
ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకుల లాభాల మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే. సన్‌ఫార్మా టాప్ గెయినర్‌గా ఉంది. బ్యాంకింగ్ షేర్లలో పీఎన్‌బీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కెనరా తదితర బ్యాంకులు లాభపడుతున్నాయి. ఇంకా పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతున్నవాటిలో ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ టాప్ లూజర్‌గా వుండగా, ఎస్‌బ్యాంకు, జీ, యూపీఎల్ తదితరాలు నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment