చంద్రబింబం
జూన్ 1 నుండి 7 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూములు, వాహనాల కొనుగోలు నిదానంగా సాగుతుంది. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి ఆశించిన ప్రగతి. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువర్గంతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే అవకాశం. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. కుటుంబసౌఖ్యం. ఆలయాలు సందర్శిస్తారు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమ ఫలించే సమయం. వాహనయోగం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు, పదవీయోగం. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఒక వ్యవహారంలో సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబసభ్యులతో వివాదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరుల నుంచి ధనలాభం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. దూరప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారంమధ్యలో మిత్రులతో వివాదాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ముఖ్యమైన పనులలో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకునే సమయం. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు కూడా తీరుస్తారు. వాహనాలు, భూములు కొంటారు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
బంధువుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు.