RECENTLY
-
అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? అభిజ్ఞానంద ఏం చెప్పాడు?
జ్యోతిష్యం... ఇది నమ్మకాలకు సంబంధించిన శాస్త్రం. దీనిని నమ్మేవారు జాతకాల ప్రకారమే జీవితాలు ముందుకు సాగుతుంటాయని చెబుతుంటారు. దీనిని నమ్మనివారు జాతకాలనేవి మూఢ నమ్మకాలని చెబుతుంటారు. అయితే ఒక్కోసారి జ్యోతిష్కులు కాలగణనను అనుసరించి తెలిపే భవిష్యవాణి నిజమవుతుంటుంది. ఒక్కోసారి నిజాలు కాకుండా మిగిలిపోతాయి. దీంతో ఒక్కోసారి జ్యోతిష్కులు గొప్పవారని, మరోమారు వారు తప్పుదారి పట్టిస్తుంటారని పలువురు చెబుతుంటారు. ఏదిఏమైనా కర్నాటకలోని మైసూరువాసి అభిజ్ఞానంద చెప్పే భవిష్యవాణిపై కొందరు ఆసక్తి కనబరుస్తుంటారు. చిన్నవయసులోనే అపరిమితమైన విషయపరిజ్ఞానాన్ని సంపాదించి, అందరి మెప్పుపొందిన అభిజ్ఞానంద మరోమారు భవిష్యవాణి వినిపించారు. అభిజ్ఞానంద చెప్పిన కొంత భవిష్యవాణి నిజం కాగా, మరికొంత ఫెయిలయ్యింది. అయితే ఆ కుర్రాడి నాలెడ్జ్, పరిణతి అందరినీ ఆకట్టుకుంటోంది. 2006లో జన్మించిన అభిజ్ఞానంద బాల్యం నుంచే తన మేథోతనాన్ని ప్రదర్శించసాగాడు. కరోనా విపత్తు గురించి ముందే చెప్పి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరోవైపు 8 ఏళ్ల వయసుకే భగవద్గీతను కంఠతా పట్టేసి, వాటికి వివరణలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. పిన్నవయసులోనే ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన అభిజ్ఞానంద తాజాగా మరో భవిష్యవాణిని వినిపించాడు. ముంబై దాడులు జరిగిన సమయంలో ఎటువంటి గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెచ్చుమీరే పరిస్థితులున్నాయని అభిజ్ఞానంద జోస్యం చెప్పాడు. దీనికితోడు పలు విపత్తులు ప్రపంచాన్ని చుట్టిముడతాయని, దీంతో వరుస విషాదాలు వెంటాడుతాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబరు 14 తరువాత ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని ప్రాంతాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని అభిజ్ఞానంద తెలిపాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, ఇజ్రాయిల్‌పై దాడుల నేపధ్యంలో అభిజ్ఞానంద వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏ గ్రహగతుల కారణంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో ఆ వీడియోలో తెలియజేశాడు. తన వీడియోలో ఒక మ్యాప్ పొందుపరిచి.. ఏఏ ప్రాంతాల్లో కల్లోలం ఏర్పడుతుందో చూపించాడు. ఇజ్రాయెల్, పాలస్తీనాల యుద్ధ ప్రభావం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలపై కూడా ప్రభావం చూపనుందని పేర్కొన్నాడు. ఈ గ్రహతుల ప్రభావం భారతదేశంపైన కూడా ఉన్నదని అభిజ్ఞానంద తెలిపాడు. ఇది కూడా చదవండి: కిమ్ సోదరి యో జోంగ్ ఎందుకంత డేంజర్? -
బరితెగించిన మృగాళ్లు
ఆకివీడు : మృగాళ్లు బరితెగిస్తున్నారు. అభం శుభం తెలియని బాలికలపై అకృత్యాలకు తెగబడుతూనే ఉన్నారు. గతనెల 29న నిడదవోలు ప్రాంతంలో పెళ్లి కుమార్తెపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. తెల్లారితే వివాహం జరగాల్సిన యువతిని చెరకు తోటలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. 14 గంటలపాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయిన ఆ యువతి.. రైతులు గుర్తించడంతో ప్రాణాలతో బయటపడింది. ఆమె వివాహం నిలిచిపోగా.. పెళ్లింట తీరని విషాదం నెలకొంది. ఇదిలావుంటే.. ఈనెల 3న గణపవరంలో 16 ఏళ్ల బాలికపై తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్ల గ్రామానికి చెందిన మల్లాడి మణికంఠ అనే యువకుడు అత్యాచా రం చేశాడు. ఈ ఘటనల్ని మరువక ముందే సోమవారం ఆకివీడుకు చెందిన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బహిర్భూమికి వెళ్తుండగా.. ఆకివీడు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక సోమవారం వేకువజామున బహిర్భూమికి వెళ్తుండగా.. ముగ్గురు యువకులు అటకాయించారు. ఆమె నోరు నొక్కి మోటార్ సైకిల్‌పై బైపాస్ రోడ్డులోని పొలాల మధ్య గల పశువుల పాకలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ మృగాళ్లు ముగ్గురూ ఆకివీడు పెదపేటకు చెందిన బొండాడ కిరణ్, సోమల సునిల్, చీకటపల్లి కిరణ్‌గా పోలీసులు గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ దుర్మార్గంతో ఓ నిరుపేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ దారుణానికి బలైన బాలిక అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటోంది. తమ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లి అరబ్ దేశాలకు వెళ్లి పని చేస్తుండగా.. తండ్రి వేరు గ్రామంలో కూలి పనులు చేస్తున్నాడు. ఆ బాలిక, ఆమె సోదరి అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు అదును కోసం ఎదురు చూశారు. బాలిక తమ ఇంటికి సమీపంలో బహిర్భూమికి వెళ్తుండగా ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అదో మద్యం అడ్డా బాలిక అత్యాచారానికి గురైన పశువుల పాక ప్రాంతం మందుబాబులకు అడ్డాగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ పాకకు పక్కనే పదుల సంఖ్యలో ఖాళీ బీరు సీసాలు, మద్యం సీసాలు దర్శనమివ్వడం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, భీమవరం రూరల్ సీఐ ఎస్ఎస్వీ నాగరాజు, ఇన్చార్జి ఎస్సై ఎం.రవివర్మ పరిశీలించారు. నిందితులు ముగ్గురుపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.