అంతా టేస్టీ... అరచేతిలో టోస్టీ
రీచార్జబుల్ టార్జి లైట్లను చూశాం.. రీచార్జబుల్ హెయిర్ డ్రైయర్‌ను చూశాం.. కానీ రీచార్జబుల్ టోస్టర్‌ని చూశారా..? కనీసం వాటి గురించైనా విన్నారా? అంతేకాదు, అలాంటిది ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? వెజిబుల్ టోస్టరే కొత్తగా అనిపిస్తే.. ఈ పోర్టబుల్ టోస్టర్ మరింత కొత్తగా ఉంది కదూ..! అవునండీ.. ఈ రీచార్జబుల్ టోస్టర్‌ను ఇకపై మీ బ్యాగుల్లో వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మీకు ఆకలేసిన ప్రతిసారీ బ్రెడ్‌ను అప్పటికప్పుడే టోస్ట్ చేసుకొని తినొచ్చు. జర్నీలో.. ఆఫీసు క్యాంటీన్లో.. ఇలా ఎక్కడైనా రెండు నిమిషాల్లో బ్రెడ్‌ను టోస్ట్ చేసుకోవచ్చు.
ఈ టోస్టర్ పైభాగం ఆన్ చేయక ముందు ఖాళీగా కనిపిస్తుంది. కానీ బ్రెడ్ టోస్ట్ అవుతున్నప్పుడు బటర్‌ఫ్లై, పువ్వులు కనిపిస్తాయి. వాటి కదలికలను బట్టి టోస్ట్ అయిందా.. లేదా అన్న సంగతిని తెలుసుకోవచ్చు (బటర్‌ఫ్లై పూల మధ్యకు రాగానే టోస్టర్‌ను ఆఫ్ చేసుకోవాలి). అలాగే దీని అడుగుభాగంలో రంధ్రాలుంటాయి. వాటి ద్వారానే బ్రెడ్ టోస్ట్ అవుతుంది. ఒకసారి టోస్టర్ ఆఫ్ అవగానే వాటంతటవే మూసుకుపోతాయి.