ఇక ‘డైరెక్టు’గా ఇంట్లోనే చదువు
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న వాటి కంటే విభిన్నంగా రూపొందించిన కార్యక్రమాలతో యాభై డీటీహెచ్ (డెరైక్ట్-టు-హోమ్) ఎడ్యుకేషన్ చానల్స్ త్వరలో రాబోతున్నాయి. రికార్డింగ్ పాఠాలను కాకుండా ఇవి క్లాసు నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఎన్ఎంఈఐసీటీ జాతీయ వర్క్‌షాప్‌లో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి ఆశిక్ ఠాకూర్ మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రపంచంలోనే ఇదే మొదటిదని ఆశిక్ చెప్పారు. ఇటువంటి చానల్స్‌ను భవిష్యత్‌లో వెయ్యి వరకూ విస్తరిస్తామని తెలిపారు. ఇదో పెద్ద క్లాస్ కాబోతోందని, దీనితో మారుమూల ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యాప్రమాణాలు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.