Recreation club
-
జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: న్యాయమూర్తుల కోసం గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నాయని.. కానీ, దేశంలోనే తొలిసారిగా హైకోర్టు జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయనుండటం ఆనందదాయకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని వికార్ మంజిల్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్ సెంటర్, గెస్ట్‌హౌస్ నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా న్యాయమూర్తుల గెస్ట్‌హౌస్ అం«శం పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు పలు అవసరాల కోసం వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే న్యాయమూర్తులకు వసతి కల్పించేందుకు ఈ గెస్ట్‌హౌస్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతుల కల్పన చేయబోయేది తెలంగాణ హైకోర్టేనని చెప్పారు. రాష్ట్ర సర్కార్ తీరు హర్షణీయం.. ప్రతిపాదన చేయగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై సీజేఐ హర్షం వ్యక్తం చేశారు. భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పడంపై ఆనందం వెలిబుచ్చారు. కోర్టులకు భవనాల నిర్మాణాలు ఎలా ఉండాలో నమూనాను రూపొందిస్తూ తయారు చేసిన ‘న్యాయ నిర్మాణ్’పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ భూయాన్ ఆవిష్కరించారు. జస్టిస్ పి.నవీన్‌రావు నేతృత్వంలోని కమిటీ న్యాయ నిర్మాణ్ నమూనాను రూపొందించిందని సీజేఐ తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. కలెక్టరేట్, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల భవనాల మాదిరిగానే ప్రజలు గుర్తించే రీతిలో కోర్టు భవనాలు జిల్లా, తాలూకా స్థాయిల్లో కూడా ఉండాలన్నారు. జడ్జీల పోస్టుల భర్తీతోపాటు మౌలిక వసతుల కల్పన చేస్తేనే న్యాయం అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 22 ఏళ్లుగా న్యాయమూర్తిగా సేవలు అందించానని, ఈ నెల 27న సుప్రీంకోర్టు సీజేగా పదవీ విరమణ చేయబోతున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ స్థాయికి రావడానికి, న్యాయమూర్తిగా సేవలు అందించడానికి ఎంతోమంది తనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. 20 సూట్లు.. 12 డీలక్స్‌లు.. 2.27 ఎకరాల్లో నిర్మించనున్న హైకోర్టు జడ్జీల గెస్ట్‌హౌస్, కల్చరల్ సెంటర్ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం పట్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధన్యవాదాలు తెలియజేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ఐదు వీఐపీ సూట్లు, మరో 20 సూట్లు, 12 డీలక్స్ గదులు, సాంస్కృతిక భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జస్టిస్ నవీన్‌రావు, పలువురు న్యాయమూర్తులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్, సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
రిక్రియేషన్ క్లబ్
రిక్రియేషన్ క్లబ్లో ప్రజల వినోదం కోసం క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్ వంటి ఆటలు ఆడించాలి.. పేకాట, క్రికెట్ బెట్టింగుల వంటివి ఉండకూడదు. అక్కడ వచ్చే డబ్బు క్లబ్ మెయింటెన్స్‌కు మాత్రమే వాడుకోవాలి. మేనేజరుకు ముందే డబ్బు చెల్లించి కాయిన్స్ తీసుకుని 13 కార్డుల రమ్మీ ఆడుకోవచ్చు. ఎలాంటి డబ్బు లావాదేవీలు ఉండకూడదు. మదనవల్లెలో ఏం జరుగుతోందంటే.... రిక్రియేషన్ క్లబ్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా జూదం నిర్వహిస్తున్నారు. వినోదం పేరుతో కర్ణాటక రాష్ర్టం నుంచి జూదరులను పిలిపించి, వారికి కావలసిన వసతులు కల్పించి పేకాట జోరుగా నడుపుతున్నారు. ప్రతి రోజు రూ.లక్షల్లో చేతులు మారుతోంది. ఈ వ్యాపారం తెలుగుదేశం పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పోలీసులను సైతం బెదిరిస్తూ ఉండటంతో నామ మాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిపిన పోలీసు దాడుల్లో భారీ నగదు, పలువురు జూదరులను అదుపులోకి తీసుకొన్న విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. - కర్ణాటక నుంచి వస్తున్న పేకాట రాయుళ్లు - పట్టణ నడిబొడ్డునే జోరుగా జూదం - అడ్డాగా మారిన మూతబడిన థియేటర్ - టీడీపీ నాయకులకు కాసుల వర్షం మదనపల్లె : రెండు నెలల క్రితం టీడీపీ నాయకులు మదనపల్లె పట్టణ నడిబొడ్డున ఓ మూత పడిన సినిమా థియేటర్లో రిక్రియేషన్ క్లబ్‌ను ప్రారంభించారు. మొదట ఎవరికి అనుమానం రాకుండా క్రీడా పరికరాలను సమకూర్చారు. మరిన్ని హంగులతో జూదరులను ఆకర్షించే విధంగా తయారు చేశారు. విషయం బయటకు పొక్కడంతో జూదరులు ఆటలు ఆడేందుకు అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఈ వ్యవహారం నెలరోజులపాటు జోరుగా సాగింది. అక్కడికి వచ్చిపోయో వారి నుంచి నిర్వాహకులు ముందుగా వేలల్లో సభ్యత్వం తీసుకుని వారినే లోనికి అనుమతిస్తూ వచ్చారు. మెల్లమెల్లగా నిర్వాహకులు కాయిన్స్ బూచిగా చూపి పేకాటను ఆడించటం మొదలు పెట్టారు. రోజూ అధిక సంఖ్యలో క్లబ్‌కు జూదరులు క్యూ కట్టారు. క్లబ్ నిర్వాకులు రూ.లక్షల్లో దండుకోవటం ప్రారంభించారు. జూదం జోరుగా సాగుతోందని ప్రచారం పట్టణంలో చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఇటీవల రిక్రియేషన్ క్లబ్‌పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో నిర్వాహకులు తమకు హైకోర్టు నుంచి అనుమతి ఉందని పోలీసులకు ఆధారాలు చూపించి పక్కదారి పట్టించి మేనేజ్ చేసినట్లు సమాచారం. సభ్యత్వం ఉన్న వారిని లోనికి అనుమతించి కాయిన్స్ పెట్టి రమ్మి ఆడిస్తున్నామని బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసు దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. - క్లబ్ వ్యవహారంపై నిర్వాహకులను వివరణ కోరగా తాము అక్రమంగా క్లబ్ నిర్వహించడం లేదన్నారు. సొసైటీకి అనుమతి ఉందని, ఆ మేరకే నిర్వహిస్తున్నామన్నారు. కేసు నమోదు చేశాం క్లబ్ వ్యవహారంపై టూ టౌన్ ఎస్ఐ గంగిరెడ్డిని వివరణ కోరగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు. -
హ్యాపీ రిసార్ట అద్భుతం
సినీ హీరోయిన్ నందిత ఆత్మకూరు (మంగళగిరి రూరల్) ఆత్మకూరు గ్రామ పరిధిలో సర్వహంగులతో నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకున్న హ్యాపీ రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్‌ను సినీ హీరోయిన్, ప్రేమకథాచిత్రం ఫేం కుమారి నందిత శనివారం ప్రారంభించారు. అనంతరం నందిత మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు నగరాల మధ్య నిర్మించిన హ్యాపీరిసార్ట్స్ అద్భుతంగా వుందని కొనియాడారు. చిన్నపిల్లల కోసం రెయిన్ డ్యాన్స్, గేమ్స్ జోన్, మినీ జూ, స్విమ్మింగ్‌ఫూల్ తదితర సదుపాయాలు వున్నాయని చెప్పారు. హ్యాపీ రిసార్ట్స్ రిక్రియేషన్స్ క్లబ్ ఈ ప్రాంతవాసులకు మధురానుభూతిని కల్పించేవిధంగా వుందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. తమిళంతో పాటు ఇతర భాషల్లో నిర్మించే చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని, అయితే తెలుగు చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. తెలుగు చిత్రాల్లో నటించేందుకు పోటీవున్నా తనకు ఎటువంటి సమస్య లేదన్నారు. అనంతరం ఆమె రిసార్ట్స్‌లోని స్విమ్నింగ్ఫూల్ను సందర్శించి సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహనకృష్ణ, డెరైక్టర్లు వాసు, కొండవీటి లక్ష్మణరావు, విజయ్‌సాయి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
రిక్రియేషన్ క్లబ్‌ల మీద నిషేధాజ్ఞలా?
ఆదిలాబాద్, కరీంనగర్, ని జామాబాద్లలోని పలు రిక్రి యేషన్ క్లబ్‌లలో రమ్మీ చీట్ల పేకాటను నిషేధిస్తూ పోలీసు లు తీసుకున్న చర్యల ఫలితం గా ఆ అంశం మరోసారి వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిషేధం విధించినట్టు పోలీసులు చెబుతున్నారు. నిజానికి ఈ నిషేధం సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమైనది. ఇంకా చెప్పాలం టే, రమ్మీ ‘నైపుణ్యం’తో కూడుకున్న ఆట కాబట్టి, జూద నిషేధచట్టం దీనికి వర్తించదని న్యాయస్థానా లు స్పష్టంచేశాయి. కాబట్టి రిక్రియేషన్ క్లబ్‌లలో రమ్మీని నిషేధించడం న్యాయసమ్మతం కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న క్లబ్‌ల గతం కొంత తెలుసుకోవాలి. ఈ క్లబ్‌లు స్వచ్ఛంద సంస్థలుగా రిజిస్టరవుతాయి. ఇందులో ఎక్కువ ఆఫీ సర్స్ క్లబ్, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్, నిర్మల్ ఆఫీ సర్స్ క్లబ్ వంటి పేర్లతో 70 ఏళ్ల క్రితమే ఏర్పాటై నాయి. వీటికి కలెక్టర్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. ఎస్పీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తారు. నిర్మల్ వంటి ఇతర పట్టణాలలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఆ పదవులను నిర్వహిస్తూ ఉం టారు. ఇప్పుడు నిర్మల్ ఆఫీసర్స్ క్లబ్, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్‌లలో రమ్మీపై నిషేధం విధించారు. నిర్మల్ క్లబ్లో రమ్మీని నిషేధిస్తున్నట్టు ఎస్పీ ప్రకటించారని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన ఆజ్ఞలను ఆయన ఒక దినపత్రిక ద్వారా వెల్లడించారు. దీనిని సవాలు చేస్తూ క్లబ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దానితో ఆ క్లబ్లో రమ్మీ ఆటకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. నిజామాబాద్ క్లబ్ మీద కూడా ఇదే రీతిలో సెప్టెంబర్‌లో నిషేధం విధించారు. ముఖ్యమంత్రి నిజామాబాద్ పర్యటన దరిమిలా ఈ పరిణామం చోటు చేసుకుంది. 2007లో కూడా ఇక్కడ రమ్మీ ఆట మీద నిషేధం విధించినపుడు హైకోర్టుకు వెళ్లి, ఆటను కొనసాగించడానికి అనుమతి తెచ్చుకున్నట్టు క్లబ్ నిర్వాహకులు చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో క్లబ్ మీద పోలీ సులు ఎలాంటి నిషేధం విధించకూడదు. దీన్ని జూదంగా పరిగణించి నిషేధిస్తే, క్లబ్‌ను జూదగృహంగా భావించినట్టేనని, ఇది 1967లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదే శాలకు విరుద్ధమని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. ఇందుకు సంబంధించి ప్రఖ్యాతమైన ‘ది స్టేట్ ఆఫ్ ఏపీ వర్సెస్ కె.సత్యనారాయణ, ఇత రుల కేసు’లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశికాలను గమనించాలి. 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కీలకమైన తీర్పులో ఇలా ప్రకటించింది. ‘రమ్మీ ఆట మూడు ముక్కలాట వలె చాన్సుల మీద ఆధారపడినది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ ఆటకు కొంత నైపుణ్యం అవసరం. ఇది ప్రధానంగా, అసమానమైన నైపుణ్యం అవసరమయ్యే ఆట. రమ్మీలో చాన్సు ఎలాంటిదంటే, బ్రిడ్జ్ ఆటలో ఉండే చాన్సు వంటిదే.’ కాబట్టి జూద నిషేధ చట్టం రమ్మీ ఆటకు వర్తించదు. ఈ చట్టం పరిధిలోకి రమ్మీ ఆట చేరనపుడు నిషేధం ఎలా విధిస్తారు? ఇంతకు ముం దు కొన్ని కేసులలో సుప్రీంకోర్టు, హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యల ఫలితంగా పదవులకు రాజీనా మా చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎన్. సం జీవరెడ్డి, ఎన్.జనార్దనరెడ్డిల విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ అంశా లను ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలించాలి. సుప్రీంకోర్టు నిర్ణయం గురించి తెలిసి ఉన్న ఏ ము ఖ్యమంత్రి అయినా కావాలని దానికి వ్యతిరేకంగా వ్యవహరించడు. క్లబ్‌ల మీద నిషేధం అమలు చేయ మని ఆదిలాబాద్ ఎస్పీ దినపత్రిక ద్వారా తన సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం సమంజసమా? ఎలాంటి ముందస్తు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయకుండా క్లబ్‌ల మీద నిషేధం విధించమని నోటి మాటతో ఆదేశాలు ఇవ్వడం ఏం న్యాయం? కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఈ నిషేధం ఎత్తివేయడానికి తక్షణం చర్యలు తీసుకుంటారని ఆశించవచ్చు. (వ్యాసకర్త మాజీ ఎంపీ, నిజామాబాద్) ఎం. నారాయణరెడ్డి -
పేకాడుకుందాం రా..!