red sandalwood workers
-
చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన ఎర్ర కూలీలు
-
ఎర్ర కూలీలు, అటవీ అధికారుల మధ్య ఛేజింగ్
ఖాజీపేట : వైఎస్సార్ జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖాజీపేట మండలంలో ఎర్రచందనం కూలీలకు, అటవీ అధికారులకు మధ్య ఛేజింగ్ జరిగింది. అటవీశాఖ అధికారులకు అందిన ముందస్తు సమాచారంతో ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న కారును గుర్తించారు. దానిని ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వేగంగా వెళ్లడంతో అధికారులు ఛేజింగ్ చేశారు. అయినా ఎర్రకూలీల కారును అధికారులు అందుకోలేకపోయారు. దురదృష్టవశాత్తూ కూలీల కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోవడంతో ఇద్దరు ఎర్రచందనం కూలీలు అటవీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటనలో ఓ స్కార్పియోను, టన్ను ఎర్ర చందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్
చంద్రగిరి : చిత్తూరులో ఎర్రచందనం కూలీలు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కూలీలు ఎదురుపడ్డారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నస్తుండగా పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లక్ష్మీపురం చెరువు సమీపంలో ఇద్దరు కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది.