భారీగా ఎర్రచందనం పట్టివేత, ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్
కడప: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ వ్యవహారం యధెచ్చగా కొనసాగుతోంది. వీరి ఆగడాలను అరికట్టేందుకు ఇటు పోలీసు యంత్రాంగం అటు అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ చర్యలో భాగంగా అందిన సమాచారం మేరకు పోలీసులు కడప జిల్లాలోని ఒబులావారిపల్లె మండలం గాదెలలంక వద్ద భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ రూ. కోటీ రూపాయలు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా పోలీసులపై ప్రతిదాడికి దిగారు. దాంతో పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేయగా, 20 మంది పరారైనట్టు పోలీసులు తెలిపారు.