అనంతపురం : ఎర్ర చందనం స్మగ్లర్లు తమ పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. తాజాగా వాహనంలో అరటి గెలల మధ్య ఎర్రచందనాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. పెనుకొండ మండలం హరిపురం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం బయటపడింది. కాగా స్మగర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.