redlight area
-
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!
‘పేద, దిక్కు మొక్కు లేని స్త్రీల హత్యలు పేపర్లలో వస్తుంటాయి. ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో మీరెప్పుడైనా పట్టించుకున్నారా?’ అని అడుగుతుంది రిజులా దాస్. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా ‘సోనాగాచి’లో ఎవరికీ పట్టని వేశ్యల హత్యల నేపథ్యంతో ఆమె రాసిన ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ నవల విశేషంగా పాఠకాదరణ పొందింది. వెబ్ సిరీస్‌గా కూడా రానుంది. వేశ్యల జీవితాలపై ఎన్ని నవలలు వచ్చినా వారి గురించి సంపూర్ణంగా తెలిసే అవకాశం లేదు అంటున్న రిజులా ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తన పుస్తకానికై చేసిన పరిశోధన గురించి మాట్లాడింది. ‘మురికివాడల్లో ఉన్న స్త్రీలు, భవన నిర్మాణ రంగంలో ఉన్న స్త్రీలు, కూలి పని చేసే మహిళలు, వేశ్యలు, ఇంకా ఇలాంటి మార్జినలైజ్డ్ సెక్షన్లలో ఉన్న ఆడవాళ్లలో ఎవరైనా హత్యకు గురైతే ఈ వార్త పేపర్లలో వస్తుంటుంది. మనం చదువుతాం. ఆ తర్వాత సౌకర్యంగా మర్చిపోతాం. ఆ హత్యలు చేసింది ఎవరో వారికి శిక్ష పడిందో లేదో పట్టించుకోము. మన సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ. ఆ ప్రాణాలు తీసింది ఎవరో మనకు తెలియాలి. కాని ఇలాంటి స్త్రీలు మరణిస్తే ఎవరికీ పట్టదు. పోలీసులకూ పట్టదు. వారివి ప్రాణాలు కాదా? వారు చంపదగ్గ వారే అనుకుంటున్నామా మనం’ అంటుంది రిజులా దాస్. ఆమె రాసిన తొలి నవల ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ గత సంవత్సరం విడుదలైంది. త్వరలో అమెరికన్ ఎడిషన్ రానుంది. ఇప్పటికే వెబ్ సిరీస్‌కు కూడా తీసుకున్నారు. ‘మీరు వెంటనే ఇదేదో మర్డర్ మిస్టరీ అని చదవడానికి బయలుదేరకండి. నా నవల యాంటీ మర్డర్ మిస్టరీ... యాంటీ థ్రిల్లర్. సమాజంలో ఒక అనామక స్త్రీ చనిపోతే ఆ కేసు తేలకపోవడం గురించి మీకెలా చింత లేదో నా నవలలో హత్యకు గురైన వేశ్య కేసు తేలాలన్న చింత నాకూ లేదు. సమాజంలో ఏ ధోరణి ఉందో ఆ ధోరణే నా నవలలో ఉంటుంది’ అంటుందామె. కోల్‌కతాకు చెందిన రిజులా దాస్ చాలా ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఆమె అక్కడ క్రియేటివ్ ఫిక్షన్లో పిహెచ్డి చేసింది. తన తొలి నవల రాయడానికి దక్షిణ ఏసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన ‘సోనాగాచి’ (కోల్‌కతా) గురించి ఆమె దాదాపు నాలుగైదేళ్లు పరిశోధన చేసింది. మరో రెండేళ్లు రాసింది. అంటే ఈ మొత్తం పనికి ఆమె ఏడేళ్లు వెచ్చించింది. ‘దీనిని రాసే ముందు నేను ఇది రాయడానికి అర్హురాలినా కాదా చూసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ జీవన నేపథ్యం లేదు. ఆ కష్టాలూ తెలియదు. కాని వారు అలా ఉండటానికి నేనూ నా నగరం కోల్‌కతా నా సమాజం కారణమే కదా అనుకున్నాను. అందుకే సోనాగాచి స్త్రీలను విడిగా కాకుండా కోల్‌కతాలో భాగంగా తీసుకున్నాను. నగరం ప్రమేయం లేకుండా సోనాగాచి లేదు’ అంటుందామె. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగు చేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. ‘అసలు సోనాగాచిలో ఉన్న సెక్స్‌వర్కర్లు తమను రక్షించి ఈ మురికి కూపం నుంచి బయటపడేయమని మనల్ని అడుగుతారా... లేదా వారి మానాన వారిని వదిలేయమంటారా అనేది మనం ఎప్పటికీ కనిపెట్టలేం’ అంటుంది రిజులా దాస్. ఆమె ఈ నవలను ‘లలీ’ అనే వేశ్య పాత్ర ద్వారా చెబుతుంది. నాసిరకం సరసకథలు రాసే రచయిత ఆమె ప్రియుడు. సోనాగాచిలో ఒక వేశ్య దారుణంగా హత్యకు గురైతే వ్యవస్థ అంతా ఇది మామూలే అని ఊరుకుంటుంది. కాని రిజులా ఏం చెబుతుందంటే అలా జరిగిన హత్యలు అంతటితో ఆగవు... అవి సోనాగాచిలో ఒక దానితో ఒకటిగా కలిసి అనేక స్త్రీ వ్యతిరేక ఘటనలకు కారణం అవుతాయి అని. ‘ఈ నవల రాసేప్పుడే డిమానిటైజేషన్ వచ్చింది. సెక్స్వర్కర్లది నోట్ల ఆధారిత వ్యవస్థ. ‘మేము ఎయిడ్స్ విజృంభించినప్పుడు తట్టుకుని నిలబడ్డాం కాని డిమానిటైజేషన్లో మాత్రం పూర్తిగా పతనమయ్యాం. అంతటి ఘోరమైన దెబ్బ మా జీవితాల్లో ఎరగం’ అని వారు అన్నారు. ఈ ముఖ్య పరిణామాన్ని నా నవలలో పెట్టడానికి మళ్లీ రీరైట్ చేశాను’ అంటుంది రిజులా. సెక్స్‌వర్కర్ల దగ్గర ఉన్న చాయిస్ ఏమిటి? సోనాగాచి విడిచిపెట్టి వెళ్లాలి అంటే వాళ్లకు పచ్చళ్లు పెట్టడం నేర్పించి పంపించేస్తే చాలా? లేదంటే సోనాగాచిలోనే ఉండిపోవాలి అంటే ఈ హింసాత్మకమైన బతుకును ఇలాగే బతకాలా? వారికి ఉన్న చాయిస్ ఏమిటి? సమాజం ఇచ్చే చాయిస్ ఏమిటి? ఈ ప్రశ్నలను లేవనెత్తుతూ ఈ నవల ముగుస్తుంది. ఇంగ్లిష్, బెంగాలీలలో రాసే రిజులా బాల్యంలో రష్యన్ సాహిత్యంతో ప్రభావితమైంది. రష్యన్లో కుప్రిన్ రాసిన ‘యమకూపం’ వేశ్యల మీద వచ్చిన గొప్ప నవల. ఇప్పుడు ఈమె రాసింది ఈ దేశ వేశ్యావాటికలను అర్థం చేయించే సమర్థమైన నవల. ఈ రెండూ మీరు చదవతగ్గవే. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగుచేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..
దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని హీరామండి గురించిన ఆసక్తికర విషయాలు... ఇది లాహోర్‌లో ఉంది. హీరామండి (డైమండ్ మార్కెట్) చాలా మంది వివాదాస్పద ప్రదేశంగా పేర్కొంటారు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ఇక్కడ స్త్రీలు పేదరికం కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి వేశ్యా వృత్తి తమ జీవనశైలిగా బతుకుతున్నారు. ఇది ఎందుకిలా మార్చబడిందో తెలుసుకోవాలంటే చరిత్రపుటల్లోకి తొంగిచూడాల్సిందే.. మిగతానగరాలు ఆధునీకరించబడినప్పటికీ ఈ నగరం మాత్రం చారిత్రక అవశేషంగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకుందాం.. ఆ మార్కెట్ స్థాపకుడు ఇతడే.. సిక్కుల మహారాజైన రంజిత్ సింగ్ మంత్రి అయిన హీరా సింగ్ పేరు మీదనే దీనికా పేరు వచ్చింది. హీరా సింగ్ అక్కడ ఓ ధాన్యం మార్కెట్‌ను స్థాపించాడు. అంతేకాకుండా తరచుగా తవైఫ్ (నర్తకి) లను కూడా ఆ మార్కెట్ తీసుకొచ్చేవాడు. సిక్కు రాజైన రంజిత్ సింగ్ ఆ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేవాడు. దీనికి షాహి మొహల్లా అని కూడా పేరుంది. లాహోర్ కోట పక్కనే ఉండటం వల్ల దీనికాపేరు వచ్చింది. మొగల్ రాజుల కాలంలో... మొగలుల సామ్రాజ్యంలో లాహోర్ కూడా ఒక భాగమే. దీని ఇతర నగరాల్లో హీరామండి ఒకటి. వీరికాలంలో ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల నుంచి అందమైన మహిళలను (వేశ్యలు) ఇక్కడికి తీసుకొచ్చేవారు. వారికి ముజ్రాస్ అనే సంప్రదాయ నృత్యాన్ని కఠిన శిక్షణతో నేర్పేవారు (ఆ కాలంలో డాన్స్, సంగీతం, లలిత కళలు, పెయింటింగ్‌లకు ఈ ప్రదేశం ప్రసిద్ధి). వీరితో ధనవంతులు కచేరీలు నిర్వహించేవారు. తర్వాత కాలంలో భారతదేశం నుంచి కూడా మహిళలు ఇక్కడికి రావడం ప్రారంభించారు. వీరు మొగల్ రాజుల ముందు శాస్త్రీయ నృత్యం చేసేవారు. తర్వాత కాలంలో ఈ నృత్యం కుటుంబ సంప్రదాయంగా మారింది. చివరికి మొగలుల వైభవం మసకబారసాగింది. విదేశీ దండయాత్రల కాలంలో రాజ భవనంలో ప్రత్యేకంగా నిర్మించిన తవైఫ్ఖానా ధ్వంసమైపోయింది. కాలక్రమేణా నృత్యకారిణుల ప్రతిష్ట దెబ్బతిని వేశ్యలుగా మారారు. క్రమంగా ఇది వేశ్యా కూపంగా మారింది. ఇప్పుడు అక్కడ నపుంసకులు నృత్యం చేస్తున్నారు. ప్రస్తుతం తవైఫ్ అనేపదం వేశ్యకు పర్యాయపదంగా అక్కడ వాడబడుతుంది. రెండు రకాలైన జీవనశైలి వాస్తవానికి ఇక్కడ రెండు రకాలైన జీవనశైలి కలిగిన స్త్రీలు నివసిస్తున్నారు. నిజానికి రాత్రిళ్లు 11 నుంచి1 గంటల మధ్య సమయంలో ఈ నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. తమ కష్టమర్లు వెళ్లిపోగానే మామూలు మహిళల్లానే వారిళ్లకు చేరుకుంటారు. ముజ్రా నృత్యం చేసేవారు సాధారణంగా ఈ రొంపిలోకి దిగరు. వీరు తమ వృత్తి పట్ల నిబద్థత, అంకిత భావం, గౌరవం ప్రదర్శిస్తున్నారు. తాము ముజ్రా నృత్యకారినులని గర్వంగా చెప్పుకొంటారు కూడా. ఇక మరొక రకం కేవలం రూ. 200 నుంచి 400 లకు వేశ్యా వృత్తిని జీవనోపాధిగా బతికేవారు. ఇది చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ వాస్తవం మాత్రం ఇది. ఎందుకంటే వీరి అజ్ఞానం, నిరక్ష్యరాస్యత అక్కడి పురుషుల విలాసానికి ప్రతీకగా ఎంచబడుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది. ఈ కథనం ఆధారంగా.. పగలంతా ఈ ప్రదేశం మామూలు మార్కెట్లా కనిపిస్తుంది. కానీ చీకటైతే మాత్రం రెడ్‌లైట్ ఏరియాగా మారిపోతుంది. కళంక్ సినిమాలో ఇక్కడి పరిస్థితిని కొంతమట్టుకు చూపారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ హీరా మండిపై సినిమాను తెరకెక్కించనున్నాడు. చదవండి: టీచర్ దారుణం.. స్నాక్స్ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు.. -
ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ముస్లిం మహిళలనుద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ముంబై, కోల్‌కతాల్లోని వేశ్యావాటికల్లో ముస్లిం మహిళలదే హవా అని అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథి వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేడీ సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయంపై చర్చిస్తూ సేథి పై విధంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్, అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రికార్డులనుంచి సేథి మాటలను తొలగించాలని డిమాండ్‌చేశారు. దీంతో మళ్లీ సేథి జీరో అవర్‌లో స్పందించారు. ‘వార్తాపత్రికలు, మేగజీన్లు చేసిన సర్వేల్లో వెల్లడైన వాస్తవాలనే నేను చెబుతున్నా. సర్వే వివరాలను చెప్పడంలో తప్పేముంది. ప్రత్యేకంగా ఏ వర్గాన్నో నేను తక్కువచేసి మాట్లాడటంలేదు. ముంబై, కోల్‌కతాల్లోని రెడ్‌లైట్ ఏరియాల్లో ముస్లిం మహిళలదే హవా అని ఆయా సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని అన్నారు. మైనార్టీల ఓట్ల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు ట్రిఫుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ట్రిఫుల్ తలాక్ బిల్లును ఆమోదించిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 38 దేశాల్లో ట్రిఫుల్ తలాక్‌ను రద్దు చేశారని వెల్లడించారు. ఈ బిల్లుతో మతానికి సంబంధం లేదని, సామాజిక రుగ్మతను రూపుమాపాలన్న ఉద్దేశంతోనే మోదీ సర్కారు దీన్ని ఆమోదించినట్టు ఎమ్మెల్యే బిష్ణు సేథి వివరించారు. ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టడంతో సభలో గందరగోళం రేగింది. స్పీకర్ నచ్చజెప్పినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను లంచ్ వరకు వాయిదా వేయాల్సివచ్చింది. -
రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లనివ్వలేదని..
ఇస్లామాబాద్ : అభివృద్ధి ప్రాజెక్టులపై చైనా, పాకిస్తాన్ కలిసి పనిచేస్తున్న క్రమంలో పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన చైనా కార్మికులపై పాకిస్తాన్ పోలీసులు ప్రతాపం చూపుతున్నారు. చైనా కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బందిని సెక్యూరిటీ కవర్ లేకుండా బయటకు అనుమతించకపోవడంపై వారు భగ్గుమంటున్నారు. అయితే చైనా కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్ధానిక పోలీసులపైనే చైనా కార్మికులు చేయి చేసుకుంటున్నారని పాక్ పత్రిక డాన్ పేర్కొంది. రెడ్ లైట్ ఏరియాలోకి వారిని అనుమతించనందునే చైనా కార్మికులు పోలీసులపై దాడులు చేశారని తెలిపింది. భహవల్పూర్-ఫైసలాబాద్ హైవే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకం రేపింది. చైనా ఇంజనీర్లు, కార్మికులను భద్రతా వలయం లేకుండా పాక్ పోలీసులు అనుమతించడం లేదని, ఇందుకు చైనా సిబ్బంది నిరాకరించడంతో వారిని బయటకు వెళ్లకుండా పోలీసులు నిలువరించారని స్ధానిక మీడియా పేర్కొంది. పోలీసులపై చైనా కార్మికులు దాడులకు తెగబడ్డారని, పోలీసుల కార్లపైనే పలువురు నిలబడ్డారని అధికారులు ఆరోపించారు. ]మరోవైపు పాక్ పోలీసుల తీరుపై చైనా కార్మికులు మండిపడుతున్నారు. తమపై స్ధానిక పోలీసులు దౌర్జన్యాలకు దిగుతున్నారని నిర్మాణ పనులను నిలిపివేసి ఆందోళనలకు దిగారు. ఈ ఘటనపై పాకిస్తాన్, చైనా ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. -
'డబ్బులివ్వకుంటే రెడ్‌లైట్ ఏరియాలో అమ్మేస్తాం'
-
'డబ్బులివ్వకుంటే రెడ్‌లైట్ ఏరియాలో అమ్మేస్తాం'
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్ర నగర్లో ఓ వివాహిత మహిళను దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పరపల్లి కాలనీలో మహేష్, రాధిక దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. అనిత అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. మహేష్ కోఠిలోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో పని చేస్తుంటాడు. కాగా, రాధిక గత సోమవారం ఇంట్లో గుడికి వెళ్లి వస్తానని చెప్పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మహేష్‌కు భార్య ఆచూకీ లేకపోవడంతో చుట్టుపక్కల వారిని సమాచారం అడిగాడు. అయినా ఆమె ఆచూకీ లభించక పోవడంతో భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. తిరిగి రాత్రి 9 గంటలకు భార్య నంబరు నుంచి మహేష్ కు ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి రాధికను కిడ్నాప్ చేశానని రూ. 3 లక్షలు ఇస్తేనే వదిలేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన మహేష్ వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు ఆశ్రయించాడు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదు. తాను అంత డబ్బు ఇవ్వలేనని, రూ. 50 వేలు మాత్రమే ఇవ్వగలనని మహేష్ నిందితుడితో చెప్పాడు. దీంతో నిందితుడు గురువారం రూ. 50 వేలు తీసుకొని, మోహంజాయి మార్కెట్ వద్దకు రావాలని చెప్పాడు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పి ఓ కానిస్టేబుల్ సహాయంతో మెహంజాయి మార్కెట్ దగ్గరకి వెళ్లిన మహేష్‌ను నిందితుడు కోఠి రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన మహేష్‌ను నిందితుడు కలవలేదు. చివరకి వాట్సప్ ద్వారా యాకత్పురా ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చి డబ్బులు అకౌంట్లో జమ చేయాలని నిందితుడు డిమాండ్ చేశాడు. దీంతో మహేష్ బ్యాంక్ అకౌంట్ నంబరు ఆధారంగా నిందితుడు మహ్మద్ అజార్‌ఖాన్ గా గుర్తించాడు. కాగా, నిందితుడు తిరిగి శుక్రవారం రాధిక చేయి, గొంతు కోసినట్లున్న రెండు ఫోటోలను వాట్సప్ ద్వారా మహేష్ కు పంపాడు. రాధిక ముంబైలో ఉందని, రూ. 3లక్షలు ఇవ్వకుంటే ముంబై రెడ్‌లైట్ ఏరియాలో అమ్మేస్తామని హెచ్చరించారు. కాగా దుండగలు తనకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కొడుతున్నారని బాధితురాలు ఫోన్ ద్వారా భర్తకు తెలిపింది. దీంతో మహేష్ నిందితుడు పంపిన ఆధారాలను శుక్రవారం పోలీసులకు తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు ...దుండగులు ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. పరిచయస్తులే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వివాహితను ముందుగానే వశపర్చుకుని కిడ్నాప్ చేసినట్టు గుర్తించినట్టు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఇప్పటికే 4 బృందాలను ఏర్పాటుచేసామన్నారు. కిడ్నాపర్ ను త్వరలో పట్టుకుంటామన్నారు.