Redmi phones
-
రూ.80 లక్షల విలువైన ఫోన్లు చోరీ
మంగళగిరి/గుంటూరు రూరల్ (ప్రత్తిపాడు)/వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): లక్షా రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.80 లక్షల విలువైన సెల్ఫోన్లను దొంగిలించిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద వెలుగుచూసింది. సినీ ఫక్కీలో కంటైనర్‌లోకి చొరబడిన ఆగంతకులు.. ఫాక్స్‌కాన్ పరిశ్రమలో తయారైన 980 రెడ్మి ఫోన్లను గోతాల్లో నింపుకుని పారిపోయారు. చోరీ ఎలా జరిగిందంటే.. శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు సెల్ఫోన్ల లోడుతో బయలుదేరిన కంటైనర్ వెనుక తాళాలను కత్తిరించిన దుండగులు.. లోపలకి చొరబడి కొన్ని మొబైల్స్‌ను దొంగిలించి, వాహనం ఆగిన సమయంలో దిగి పారిపోయారు. వెనుకగా వస్తున్న వాహనదారులు కాజ టోల్ ప్లాజా వద్ద కంటైనర్ డ్రైవర్‌కు ఆగంతకులు చొరబడిన విషయాన్ని చెప్పారు. దీంతో డ్రైవర్, సిబ్బంది బుధవారం ఉదయం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు కంటైనర్‌తో సహా చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ మంగళగిరి చేరుకుని వివరాలు సేకరించారు. కంటైనర్‌లో మొత్తం రూ.9 కోట్లు విలువైన సెల్ఫోన్లు ఉన్నట్లు వెల్లడించారు. 3 ఏళ్ల కిందట కూడా ఇదే తరహాలో.. సరిగ్గా మూడేళ్ల కిందట కూడా ఇదే పరిశ్రమలో తయారైన మొబైల్ ఫోన్లు తరలిస్తున్న కంటైనర్ లారీ నెల్లూరుకు సమీపంలో చోరీకి గురైంది. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి పాల్పడిన ముఠాను గుర్తించి కొంతమేరకు రికవరీ చేశారు. అదే ముఠా చోరీకి పాల్పడిందా? లేదా? మరో ముఠా అలాంటి పన్నాగం పన్నిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్మి ఫోన్ల సునామీ; 90సెకన్లలో నో స్టాక్
సాక్షి, న్యూఢిల్లీ: షియోమి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ఫోన్లు 90 సెకన్లలోనే అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. గత వారమే ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ రోజు అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఫస్ట్‌సేల్‌లో ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదనపు ఆకర్షణలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్‌తో పాటు ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం, ఎం స్టూడియో స్టోర్లలోనూ ఈ ఫోన్ కొనుగోళ్ల సునామీ సృష్టించింది. దీంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోసేల్‌ను ఈ నెల 24న నిర్వహించనున్నట్టు షియోమీ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు. అమెజాన్‌లో ఈ ఫోన్లు విక్రయానికి పెట్టిన 90 సెకన్లలోనే అమ్ముడుపోయినట్టు మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ,128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్లో భాగంగా హెచ్డీఎప్సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. ఎయిర్టెల్ రూ.298, రూ.398 అన్లిమిటెడ్ ప్యాక్‌లపై డబుల్ డేటా వంటి ప్రయోజనాలను సైతం అందిస్తోంది. రెడ్మి నోట్ 9 ప్రొ ఫీచర్లు ఈ విధంగా.. - 6.67 అంగుళాల ఫుల్ హెడ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే - 48 ఎంపీ ప్రధాన సెన్సార్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనక నాలుగు కెమెరాలు - ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ - 512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం - 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
మార్కెట్లోకి రెడ్మి నోట్ 6 ప్రో
న్యూఢిల్లీ: చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్మి నోట్ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ ఉండే ఫోన్ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్, ఫ్లిప్‌కార్ట్, మి హోమ్ స్టోర్స్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ.1,000 డిస్కౌంట్‌పై ఇవి లభిస్తాయి. ముందు రెండు (12 ఎంపీ+5ఎంపీ), వెనుక రెండు (20ఎంపీ+2ఎంపీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో మొత్తం నాలుగు కెమెరాల సెటప్ ఇందులో ఉంటుంది. 6.26 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 4జీబీ, 6జీబీ ర్యామ్‌లలో రెడ్మి నోట్ 6 ప్రో లభిస్తుందని షావోమీ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడంతో తమ ఉత్పత్తులపై ధరలపరంగా ఒత్తిడి ఉంటోందని ఆయన చెప్పారు. తమ ఫోన్లు, పవర్ బ్యాంకులను భారత్‌లోనే తయారు చేస్తున్నప్పటికీ, అవసరమైన ముడి సరుకు, కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ అసెంబ్లీ (పీసీబీఏ)ని డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి వస్తుండటమే ఇందుకు కారణమన్నారు. -
టీవీ మార్కెట్‌పై కన్ను
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో, చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి జట్టు కట్టనున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో లీడర్‌గా ఉన్న షావోమి టీవీ మార్కెట్లో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఇండియాలోకి తీసుకురానున్న షావోమి టీవీలను జియో రీటైల్ దుకాణాల్లో లాంచ్ చేసేందుకు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్య చర్చలు నడుస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తున్న షావోమి ఆఫ్‌లైన్ విక్రయాలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భాగస్వాముల కోసం చూస్తోంది. అలాగే వినియోగదారుల ఉత్పత్తులు మాత్రమే కాకుండా, బీ టూ బీ ఉత్పత్తులను కూడా ఇండియాకు తీసుకురావాలని ఆశ పడుతోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, షావోమి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య ఈ మేరకు పలుమార్లు చర్చలు జరిపాయి. చర్చలు ఒక కొలిక్కి వచ్చి..ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఈ ఏడాది నుంచే రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్స్ ద్వారా ఎంఐ, రెడ్ మీ బ్రాండ్లను విక్రయించనుంది. అలాగే షావోమీ టీవీలను కూడా విక్రయించనుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస్థల ధరలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్, రిచ్, హై ఎండ్ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కాగా పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించిన షావోమి 2018 లో తన ఆన్లైన్ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. -
దూసుకుపోతున్న రెడ్ మి అమ్మకాలు
స్మార్ట్ ఫోన్ల వ్యాపారాల్లో ఇటు చైనా తర్వాతే ఏ కంపెనీలైనా.. ఇటు నాణ్యతకు నాణ్యత.. అటు ధరకు ధర, అమ్మకాలకు అమ్మకాలు. ఇదే జోష్ తో ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ షియోమి అందంగా ఆకట్టుకునే విధంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెడ్ మి ఫోన్లు అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయట. ప్రతి నాలుగు సెకన్లకు 5 రెడ్ మి ఫోన్లు అమ్ముడు పోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. కేవలం చైనాలో మాత్రమే కాక, కంపెనీకి రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ మార్కెట్లో కూడా ఇంతే అమ్మకాలను నమోదుచేస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రెడ్ మీ ఫోన్ 2013 ఆగస్ట్ లో ఆవిష్కరించారు. అప్పటినుంచి మొత్తం 1100లక్షల రెడ్ మీ ఫోన్లు అమ్ముడు పోయినట్టు షియోమీ గ్లోబల్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బార ట్వీట్ చేశారు. మూడేళ్లలో ఒక సెకనుకు 1.21 యూనిట్లు అమ్మినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. అనువైన ధరలతో రెడ్ మి ఫోన్లను షియోమి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రత్యేకతల్లోను ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫ్లాష్ సేల్స్ ద్వారానే తన చాలా పోన్లను అమ్మినట్టు షియోమి పేర్కొంది. షియోమి తాజాగా రెడ్ మీ నోట్ 3 ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ, 3జీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమరీ ఆప్షన్ లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 2జీ ర్యామ్ ఫోన్ ధర రూ.9,999. 3జీబీ ర్యామ్ ధర రూ.11,999. 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్, 128 జీబీ విస్తరణ మెమరీ ఈ ఫోన్ ఫీచర్లు.