నాసాను చూసి..!
వాషింగ్టన్: నాసా శాస్త్రవేత్తలు తయారుచేసిన 'యాంటీ-గ్రావిటీ సూట్' ను ఆదర్శంగా తీసుకున్న ఓ కంపెనీ 'మిరాకిల్ సూట్' అనే పేరుతో ప్రసవంలో ఎక్కవ రక్తస్రావం అవకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణను చేసింది.
కాలిఫోర్నియాలోని జోఎక్స్ కార్పొరేషన్ అనే స్టార్టప్ కంపెనీ సూట్ లో ప్రెజర్ ను ఉపయోగించి మహిళలకు ప్రసవాన్ని చేయడం వల్ల ఎక్కువ రక్తాన్ని కోల్పోకుండా ఉండేలా చేసింది.
మిలటరీ, ఏవియేషన్ రంగాల్లో లాగా ఎక్కువ ప్రెజర్ తో అవసరం ఉండదు కాబట్టి, పాత తరహా జీ-సూట్ మోడల్ లోనే ఈ సూట్ ను తయారుచేశారు. తాజాగా నాసా ఏమ్స్ పరిశోధనా కేంద్రం, మరికొన్ని పరిశోధనా కేంద్రాలు చేసిన స్టడీల్లో పాకిస్తాన్ లో ప్రసవం కోసం వచ్చిన 14 మంది గర్భిణీ స్త్రీలలో 13 మంది మహిళల ప్రాణాలను ఈ సూట్ కాపాడినట్లు తేలింది. ఈజిప్టు, నైజీరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం రక్తస్రావ మరణాలను తగ్గించినట్టు మరో పరిశోధనలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, శిశు మరణాలకు తగ్గించేందుకు కృషి చేస్తున్నఓ సంస్థ ఈ సూట్ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు స్త్రీ, శిశు మరణాల రేటు తగ్గించడానికి చాలా ప్రయత్నించామని అయినా ఇంత పెద్ద మొత్తంలో ఫలితాలు రాబట్టలేకపోయామని పేర్కొంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజిస్ట్స్ లు ఈ మిరాకిల్ సూట్ ను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉపయోగించుకోవాలని సూచించాయి. ఇప్పటివరకు 20 దేశాలు స్పందించి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి.
ప్రపంచంలో ప్రతి ఏడాది 70,000 మంది మహిళలు డెలివరీ సమయంలో రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారు.