redwood smuggler
-
ఎర్రచందనం స్మగ్లర్లపై ఆపరేషన్ సక్సెస్
సాక్షి, కడప: జిల్లాలోని అటవీప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను నరికివేసి, బెంగళూరు, చెన్నై నగరాలకు అక్రమంగా తరలిస్తున్న ‘ఎర్ర’గ్యాంగ్‌ల ఆట కట్టించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషి సఫలీకృతమవుతోంది. తమిళనాడు రాష్ట్రంలో గ్యాంగ్‌లను తయారు చేసుకుని, జిల్లా నుంచి ఆ తరువాత బెంగళూరు నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తీసుకుని వెళ్లే బాషాభాయ్‌ని, అతనికి సహకరించేవారిని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరికొందరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతో అక్రమార్కుల ఆట కట్టించినట్లయింది. స్మగ్లర్ల రూటు ఇలా.. కర్ణాటక రాష్ట్రం కటిగేనహళ్లికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు ఖలీల్‌ఖాన్, అఫ్రోజ్‌ఖాన్‌లు జిల్లాలోని రైల్వేకోడూరుకు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ బాబును ఆశ్రయించారు. అతని ద్వారా జిల్లాలో రైల్వేకోడూరు, నందలూరు, ఒంటిమిట్ట, పుల్లంపేట, మైదుకూరు పరిసర ప్రాంతాల్లో లోకల్ ఎర్రగ్యాంగ్‌లను తయారు చేసుకున్నారు. వీరి ద్వారా తమిళకూలీలు వచ్చి అటవీ ప్రాంతాల్లోని ఎర్రచందనం దుంగలను నరికి డంప్‌లను తయారు చేయించి వెళతారు. తరువాత ప్రధాన నిందితుల సూచనల మేరకు వాహనాలలో ఎర్రచందనం దుంగలను లోడింగ్ చేసుకుని అక్రమంగా కటిగెనహళ్లికి తరలిస్తుంటారు. వేర్వేరు ప్రాంతాల్లో 20 మంది అరెస్టు మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలో ప్రధాన నిందితులు ఖలీల్‌ఖాన్, అఫ్రోజ్‌ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ల ప్రధాన అనుచరుడైన షేక్ మస్తాన్‌తో పాటు గిరిచంద్ర, అశోక్‌కుమార్, శివయ్య, రాజారెడ్డి, సురేష్, విజయకుమార్, మల్లారెడ్డి, వెంకటశివకుమార్‌రెడ్డిలను సిద్దవటం మండలం భాకరాపేట దగ్గరగల శనేశ్వరస్వామి దేవాలయం సమీపంలో అరెస్టు చేశారు. నందలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆల్విన్ ఫ్యాక్టరీ వద్ద సురేంద్రనాథరెడ్డి, శివప్రసాద్, రమ్మ మోహన్, అశోక్, చంద్రశేఖర్ నాయుడు, గంగాధర్‌లను అరెస్ట్ చేశారు. పుల్లంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వత్తలూరు సబ్‌స్టేషన్‌కు దగ్గర జింకల సుబ్రమణ్యం, గణేష్, చెంచయ్య, సుబ్బారెడ్డి, నాగేంద్ర, వెంకటేష్‌లను, రైల్వేకోడూరు పరిధిలో సూరపరాజుపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో బురుసు రమేష్, నాగేశ్వర, శ్యాంసుందర్, గుండాల శంకరమ్మ, సుబ్బరాజు, వెంకటసుబ్బయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు టన్నుల బరువున్న 98 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ఐదు వాహనాలను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్ ఆధ్వర్యంలో మైదుకూరు డీఎస్పీ విజయకుమార్, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డిలు, సీఐలు, ఎస్ఐలు ప్రత్యేక బందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంతమంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేస్తామని ఎస్పీ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియాకు వెల్లడించారు. పీడీ యాక్టుకు ప్రతిపాదనలు ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. గత నెలలో ఇద్దరిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, మరో ఆరుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ సంఘటనల్లో నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. -
గుట్టుగా దాటిస్తూ.. కోట్లు కొల్లగొడుతూ..
సాక్షి, కోటబొమ్మాళి: కొంతకాలం క్రితం మెళియాపుట్టి మండలంలో ఎర్రచందనం దుంగలు దొరికాయి.. దిల్లీకి చెందిన ఒక ముఠా వీటిని రైలు మార్గంలో తరలించేందుకు అనువైన ప్రదేశంలో ఉంచినట్టు పోలీసులు గుర్తించారు.. తాజాగా కోటబొమ్మాళి మండలం రేగులపాడు పంచా యతీ పరిధిలో జమ్ము క్వారీని ఆనుకొని ఉన్న కొండ పక్క భారీ సంఖ్యలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఈ దుంగలను ఉంచడం చూస్తుంటే.. గప్‌చుప్‌గా తరలించేందుకు ఏదో ఒక ముఠా పథకం పన్నిందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ ముఠాల గుట్టు రట్టు చేస్తామని ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎస్సై ఎస్.లక్ష్మణరావు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న 120 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు. కొన్ని సంవత్సరాల క్రితం జమ్ము గ్రానైట్ కంపెనీ ఎర్ర చందనం మొక్కలను నాటినట్లు స్థానికులు చెబుతున్నారు. క్రమేపీ మొక్కలు పెద్దవవ్వడంతో కొంతమంది వ్యక్తులు వాటిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న దుంగలను పరిశీలించారు. ఈ ఘటనల వెనుక సూత్రధారులు ఎవరన్న విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రేగులపాడుకు చెందిన గొలివి హరి అనే ట్రాక్టర్ డైవర్ ఎర్రచందనం దుంగలను లోడు చేస్తుండగా కొంతమంది గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోటబొమ్మాళి ఎస్ఐ ఎస్.లక్ష్మణరావు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అవి ఎర్రచందనం దుంగలని తనకు తెలియదని, వంట చెరుకు తెమ్మని చెప్పగా వెళ్లానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. విశ్వనాథపురం సమీపంలో గల జమ్ములో గ్రానైట్ సంస్థ 10 సంవత్సరాల క్రితం నాటిన చందనం మొక్కలను ప్రస్తుతం విక్రయించవల్సిందిగా సంబంధిత మెనేజ్మెంట్ చెప్పగా ఆమేరకు వాటిని విక్రయించేందుకు సిద్ధమైనట్లు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆర్.ఉమామహేశ్వరరావు తెలియజేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయంపై శ్రీకాకుళం అటవీశాఖలో పనిచేస్తున్న చల్ల శ్రీనివాసరావును పోలీసులు విచారించగా అవి అటవీశాఖ పరిధిలోవి కావని తేల్చినట్లు తెలిసింది. ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐలు నీలయ్య, రమణతోపాటు స్థానిక పోలీసులు రేగులపాడు, విశ్వనాథపురం గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై లక్షణరావు మాట్లాడుతూ.. అనుమానితులను రప్పించి విచారణ చేస్తున్నామని, మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి సమాచారం వస్తుందని తెలిపారు. -
11 మంది స్మగ్లర్లు అరెస్ట్
లక్కిరెడ్డిపల్లె: లక్కిరెడ్డిపల్లె సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చక్రాయపేట మండలాల పోలీసు స్టేషన్ల పరిధిలో 11మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి ,వారి వద్ద నుంచి 11 ఎర్రచందనం దుంగలు, ఒక టాటా సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజ తెలిపారు. గురువారం లక్కిరెడ్డిపల్లె సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. లక్కిరెడ్డిపల్లె మండలం పాళెంగొల్లపల్లె అటవీ ప్రాంతంలో ఎస్ఐ సురేష్ రెడ్డి తన సిబ్బందితో కలిసి చేసిన దాడుల్లో 3 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా, చక్రాయపేట ఇన్చార్జి ఎస్ఐ మంజునాథ తన సిబ్బందితో కలిసి చక్రాయపేట మండలం గొంది కడిశెల కోన అటవీ ప్రాంతంలో 3 దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. రామాపురం ఎస్ఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి శుద్ధమళ్ల అటవీ ప్రాంతంలో 5 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టాటా సుమోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 11 ఎర్రచందనం దుంగల విలువ రూ.4 లక్షల 60 వేలు ఉంటుందని, టాటా సుమో విలువ రూ.3 లక్షల 60 వేలు ఉంటుందని తెలిపారు. అరెస్టయిన వారిలో 9 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కాగా ఒకరు సుమో ఓనరు,మరొకరు సుమో డ్రైవరుగా గుర్తించామన్నారు. మరో 5మంది పరారీలో ఉన్నారన్నారు. పరారీలో ఉన్న పీర్ మహ్మద్ అనే అంతర్జాతీయ స్మగ్లర్‌తో పాటు తమిళనాడుకు చెందిన స్వామి, భాయ్, కర్నాటక బంగారు పేటకు చెందిన జావెద్, జబీ అనే వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీఐ రవిబాబు, ఎస్ఐలు సురేష్ రెడ్డి, మంజునాథ, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వస్తే దొంగలను చేస్తారా
* పశువుల కంటే హీనంగా కొట్టారు * కన్నీరు పెట్టుకున్న తమిళులు ప్రొద్దుటూరు క్రైం: జ్యోతి క్షేత్రానికి వస్తే మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చాం.. అయితే ఇక్కడి అటవీశాఖ అధికారులు మమ్మల్ని దొంగల్ని చేశారు.. పశువుల కంటే హీనంగా కొట్టారు .. అంటూ తమిళులు కన్నీరు పెట్టుకున్నారు. వనిపెంట అటవీశాఖ అధికారుల అదుపులో ఉన్న తమిళులు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వస్తే ఎర్రచందనం స్మగ్లర్లమని అదుపులోకి తీసుకుని నాలుగు రోజులపాటు పశువుల కంటే ఘోరంగా కొట్టారని వారు వివరించారు. తామందరం పనులు చేసుకునే వాళ్లమని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆమె ముందు వాపోయారు. తమ వద్ద ఉన్న రూ. 42 వేలతో పాటు సెల్ఫోన్లను కూడా లాక్కున్నారని తెలిపారు. కేవలం తమిళం మాట్లాడుతున్నామనే మమ్మల్ని ఇలా అదుపులోకి తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇళ్లు అడవిలో ఉంది.. ఇంటి వద్ద భార్యా పిల్లలు ఉన్నారు.. వారికి ఏం కావాలన్నా నేనే తీసుకుని వెళ్లాలి.. ఐదారు రోజుల నుంచి అన్నం లేకుండా ఎలా ఉన్నారో అంటూ సెల్వరాజ్ ఆస్పత్రిలో జయశ్రీ ముందు రోదించసాగాడు. అటవీశాఖ అధికారులకు దర్యాప్తు పట్టదా.. ఆస్పత్రిలో తమిళులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్న అనంతరం జయశ్రీ విలేకరులతో మాట్లాడారు. నేరంతో సంబంధం ఉందో లేదో తెలియడానికి దర్యాప్తు చేస్తారన్నారు. అయితే అటవీశాఖ అధికారులు ఎలాంటి విచారణ లేకుండా జ్యోతి క్షేత్రానికి వెళ్లి వస్తున్న తమిళులను అదుపులోకి తీసుకొని ఎర్రచందనం దొంగలుగా చిత్రీకరించడం విచారకరమని ఆమె తెలిపారు. వారిని ఈ నెల 17న అక్రమంగా అరెస్ట్ చేయడమేగాక విచక్షణా రహితంగా చితక్కొట్టారన్నారు. వారి వద్ద కొడవళ్లు దొరికాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరు మంది తమిళులకు రిమాండ్ వనిపెంట రేంజిలో అరెస్టు చేసిన ఆరు మంది తమిళులను సోమవారం అటవీశాఖాధికారులు కోర్టుకు హాజరుపరిచారు. తమిళనాడుకు చెందిన కెప్టెన్ ప్రభాకర్, మోహన్, సెల్వరాజ్, కృష్ణకుమార్, సుబ్రమణి కుమార్‌లు వనిపెంట వైపు వస్తుండగా ఈనెల ఈనెల 17న వనిపెంట అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో వారిలో కెప్టెన్ ప్రభాకర్, మోహన్, సెల్వరాజ్‌లు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వీరినికేసు నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారు కోలుకోవడంతో వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. ఈమేరకు పోలీసులు సోమవారం వారిని కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు డీఎఫ్ఓ శివశంకరరెడ్డి తెలిపారు. -
రూ.3 లక్షల విలువచేసే ఎర్రచందనం పట్టివేత
వైఎస్సార్ జిల్లా(కడప): ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికలను సైతం పట్టించుకోవడం లేదు. స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందకు యత్నించిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం వైకోట అటవీ ప్రాంతంలో అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎర్రచందనం తరలించిన ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్టు అటవీ అధికారులు తెలిపారు. -
ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్
బద్వేలు అర్బన్, న్యూస్‌లైన్: ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సబ్‌డివిజన్ ఫారెస్టు అధికారి ఆర్డీ వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓ స్వామి వివేకానందలు తెలిపారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతనెల 19న బాలాయపల్లె బీటు పరిధిలో దాడులు నిర్వహించి ఎర్రచందనం దుంగల తరలింపునకు సిద్ధంగా ఉన్న బత్తల వెంకటసుబ్బ య్య, మాతా దానంలను అరెస్టు చేసి, దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా మరో 10మంది పారిపోయారని తెలిపారు. మిగిలిన వారు మళ్లీ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున దాడులు చేయగా, రేకులకుంటకు చెందిన ఓబిలి ఓబయ్య అలియాస్ కర్రన్న, బత్తల వెంకటసుబ్బయ్య, బత్తల ఈశ్వర్, తప్పెట ఓబులేసు, నాగినేనిసుబ్బరాయుడు,కుమితి సుబ్బరాయుడు, శీలం గంగయ్యలు పట్టుబడ్డారని తెలిపారు. నందలూరులో... చెరువులో దాచి ఉంచిన 26 ఎర్ర చందనం దుంగలను సోమవారం నందలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కౌలుట్లయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆదివారం రాత్రి మండల కేంద్రానికి సమీపంలోని కన్యకల చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా *.4.5 లక్షల విలుైవె న దుంగలు కనిపించాయి. సోమవారం ఉదయం వాటిని స్టేషన్‌కు తరలించామన్నారు. 60ఎర్రచందనం దుంగలు స్వాధీనం రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బాలుపల్లె ఎఫ్ఎస్ఓ పిచ్చయ్య తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రేంజర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు శెట్టిగుంట తురకపల్లె బ్రిడ్జి వద్ద దాడులు నిర్వహించగా 60 దుంగలు పట్టుబడ్డాయన్నారు. వీటి బరువు రెండు టన్నులుంటుందని, *.2 లక్షల విలువ చేస్తాయన్నారు. రాజంపేటలో... అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్వో విజయకుమార్ తెలిపారు. గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద ఓ టెంపో ట్రావెలర్‌ను త నిఖీ చేయగా అందులో 41 దుంగలు పట్టుబడ్డాయన్నారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద స్కార్పియోలో తరలిస్తున్న 23 దుంగలతోపాటు, రెండు వాహనాల ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
విజయనగరం, న్యూస్‌లైన్: శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నెకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు విజయనగరం జిల్లాలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను స్వాధీనం చేసుకున్న అధికారులు అక్కడ ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జిల్లాలోని శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నెకు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 40 లక్షలు అవుతుందని అధికారుల అంచన. వివరాలు.. నాలుగు టన్నులకుపైగా ఎర్రచందనం దుంగలను విజయనగరం జిల్లా గర్భాం గ్రామ సమీపంలో నిందితులు లారీలోకి లోడ్ చేస్తుండగా పక్కా సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. విజయనగరం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.సోమసుందరం ఆధ్వర్యంలో అధికారులు ఎస్.పి.చౌదరి, కె.రామారావు, టి.సుధాకర్, వెంకట్ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కలపను స్వాధీనం చేసుకున్నారు. శిరివెళ్ల మండలం గంప్రమానుదిన్నెకు చెందిన తలారి రామపున్నయ్య సాతాంవలస పరిసర ప్రాంతాల్లో దుంగలను కొనుగోలు చేశాడని అటవీ శాఖాధికారులు తెలిపారు. సాతాంవలస గ్రామానికి చెందిన పెనుమత్స రవికిషోర్ ఇందుకు సహకరించినట్లు తెలిసిందన్నారు. దుంగలను గర్భాం మామిడితోటలోకి అద్దె ట్రాక్టర్లో తరలించి అక్కడి నుంచి లారీలోకి ఎక్కిస్తుండగా పట్టుకున్నామన్నారు. వీటిని కర్నూలుకు చెందిన రామచంద్రనాయుడు కోసం తరలిస్తున్నామని రామపున్నయ్య చెప్పినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి సోమసుందరం తెలిపారు. లారీ డ్రైవ ర్ కె.నాగేశ్వరరావు పరారయ్యాడన్నారు. అతని సెల్‌ఫోన్, డ్రైవింగ్ లెసైన్స్, ఇతర పేపర్లు స్వాధీనం చేసుకుని వాటి ఆధారంగా అతడు నెల్లూరు జిల్లా వర్దానపల్లెకు చెందిన వాడిగా గుర్తించామన్నారు. లారీ, ట్రాక్టర్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దుంగలు కొనుగోలు చేసి తరలిస్తున్న రామపున్నయ్య, ఇందుకు సహకరించిన మత్స రవికిశోర్, ట్రాక్టర్ డ్రైవర్ అదుపులో ఉన్నట్లు తెలిపారు. -
గుండ్లూరులో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట సమీపంలోని గుండ్లూరు వద్ద పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. స్మగ్లర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.