Regional Passport Officer
-
చేతి రాత పాస్‌పోర్టులను మార్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్: చేతి రాత పాస్‌పోర్టులను యంత్రం చదువగలిగిన తరహాలోకి మార్చుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలు www.passportindia.gov.in వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు. జాతీయ కాల్‌సెంటర్ 1800-258-1800 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా సంప్రదించ వచ్చని ఆమె వివరించారు. -
సికింద్రాబాద్‌లో 5న పాస్‌పోర్ట్ మేళా
సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. హోల్డ్‌లో ఉంచిన అప్లికేషన్లను మేళాలో పరిశీలించబోమని తెలిపారు. మేళాకు సంబంధించిన 300 స్లాట్లు మార్చి రెండో తేదీన పాస్‌పోర్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. -
కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ భేటీ
వచ్చే నెలలో కరీంనగర్ లో పాస్ పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ అశ్శిని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాస్ పోర్టు జారీలో కొత్తగా వచ్చిన సంస్కరణలను కేసీఆర్ కి వివరించారు. తర్వరలో వరంగల్ లో కూడా పాస్ పోర్టు కార్యాలయన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులను కోరారు. తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.