Regional Transport Offices
-
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడగానే లైసెన్స్ ఫట్
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను హరించే మందుబాబుల కట్టడికి నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త విధానాలను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినవారి డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్)లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ)లకు ట్రాఫిక్ పోలీసులు భౌతికంగా లేఖలు పంపించేవారు. కానీ, ఇక నుంచి ఆ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరిగిపోనుంది. ట్రాఫిక్ యాప్‌లో డీఎల్ రద్దు అనే కొత్త ఫీచర్‌ను జోడించారు. దీనిని ఆర్టీఏతో అనుసంధానించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వెంటనే యాప్‌లో డీఎల్ రద్దు ఫీచర్‌ను నొక్కగానే క్షణాల్లో సంబంధిత సమాచారం ఆర్టీఏ అధికారులకు చేరుతుంది. వాళ్లు ఆయా డీఎల్‌ను పరిశీలించి రద్దుచేస్తారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో సమయం ఆదా అవటమే కాకుండా డ్రంకెన్ డ్రైవ్ వాహనదారులకు భయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 255 డీఎల్లు రద్దయ్యాయి. అత్యధికంగా గతేడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9,981 డీఎల్ రద్దులను ఆర్టీఏకు పంపించగా, 215 డీఎల్లు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్‌లో 25, రాచకొండలో 15 లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఔటర్‌పై డ్రంకెన్ డ్రైవ్‌లు రాష్ట్ర, జాతీయ రహదారులతోపాటు ఓఆర్‌ఆర్‌పైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో ఓఆర్ఆర్పై కూడా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రైవింగ్ స్కూల్ వాహనాలకు ఔటర్ రింగ్ రోడ్‌పైకి అనుమతి లేదు. గతేడాది సైబరాబాద్‌లో 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 759 మంది మరణించారు. సైబరాబాద్ పరిధిలోకి వచ్చే ఓఆర్ఆర్పై 191 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాచకొండ పరిధిలో జరిగిన 2,529 రోడ్డు ప్రమాదాల్లో 618 మంది చనిపోయారు. గతేడాది రాచకొండ పరిధిలోకి వచ్చే ఔటర్‌పై 41 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 19 మంది మరణించారు. 13 రోడ్డు ప్రమాదాల్లో 50 మందికి గాయాలయ్యాయి. పరిమితవేగాన్ని మించొద్దు ఔటర్‌పై వాహనాలను జాగ్రత్తగా నడపాలి. టోల్‌గేట్స్ వద్ద మంచు ఎక్కువ ఉందని, వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించే ఏర్పాట్లు చేశాం. పరిమిత వేగానికి మించితే లేజర్ గన్‌తో చిత్రీకరించి జరిమానాలు విధిస్తున్నాం. – డి. శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ -
పోటెత్తుతున్న వాహనాలు
రోజూ నగర రోడ్లపైకి 1,309 నూతన వాహనాలు 2015-16 ఆర్థిక ఏడాదిలో 4.78 లక్షల నూతన వాహనాల నమోదు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 24,078 ఎక్కువ వాహనాల సంఖ్యలో ఢిల్లీ తర్వాత బెంగళూరు రెండో స్థానం బెంగళూరు: బెంగళూరు నగరంలో వాహన రద్దీ పెరుగుతోంది. సగటున రోజుకు 1,309 నూతన వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇందులో మెజారిటీ వాటా ద్విచక్ర వాహనాలదే. రాష్ట్ర రవాణాశాఖ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బెంగళూరు నగరంలోని 11 రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు ఉండగా (ఆర్టీవో) 2015 ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చ్ 31 వరకూ మొత్తం 4.78 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంతకు ముందు ఆర్థిక ఏడాది (2014-15)తో పోలిస్తే ఈ సంఖ్య 24,078 ఎక్కువ. ఇందులో 3.78 లక్షల వాహనాలు ద్విచక్రవాహనాలు కాగా, మిగిలినవి కార్లు, లారీ, బస్సులు తదితరాలు. ఈ లెక్కన రోజూ సగటున 1,309 వానాలు బెంగళూరు రోడ్ల పైకి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక మొత్తం బెంగళూరులో ఈ ఏడాది మార్చి 31 వరకూ 61 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో 88.5 (54 లక్షలు) శాతం ప్రైవేటు వాహనాలు కావడమే గమనార్హం. మిగిలినవి ప్రజారవాణా వ్యవస్థకు వినియోగించే కేఎస్ ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలకు చెందిన వాహనాలు ఉన్నాయి. నగరంలోని విభాగాలవారిగా తీసుకుంటే పశ్చిమ బెంగళూరు విభాగం అత్యధికంగా 7.2 లక్షల ద్విచక్ర వాహనాలు కలిగి ఉండగా ఆ తర్వాతి స్థానంలో దక్షిణ విభాగం (7 లక్షల వాహనాలు) ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.62 కోట్ల వాహనాలు ఉన్నాయని రాష్ట్ర రవాణాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ప్రతి పది వాహనాల్లో దాదాపు నాలుగు వాహనాలు బెంగళూరులోనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక దేశ వ్యాప్తంగా తీసుకుంటే ఢిల్లీ 88.3 లక్షల వాహనాలతో మొదటి స్థానంలో ఉండగా అటు పై బెంగళూరు 61.1 లక్షల వాహనాలతో రెండోస్థానంలో, 42.4లక్షల వాహనాలతో చెన్నై మూడో స్థానంలో ఉంది. ఇక కొలకత్తా (38.6 లక్షల వాహనాలు), ముంబై (27 లక్షల వాహనాలు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉండటం గమానార్హం. -
రవాణా ఇక భద్రం!
మోటారు వాహన చట్టంలో కీలక మార్పులు సవరణలతో త్వరలో పార్లమెంటు ముందుకు న్యూఢిల్లీ: ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం, విధానాల్లో పారదర్శకత పాటించడం.. ఇవి లక్ష్యంగా మోటార్ వాహన చట్టంలో పలు కీలక సవరణలకు కేంద్రం సిద్ధమైంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, కెనడా, సింగపూర్లలో అమల్లో ఉన్న విధానాలపై అధ్యయనం జరిపిన కేంద్ర ప్రభుత్వం.. అవసరమైన సవరణలతో మోటారు వాహన చట్టం సవరణల బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ప్రతిపాదిత సవరణల వివరాలు! దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులకు 24 గంటల్లో చేతికి చలాను అందేలా చర్యలు.రవాణా శాఖలో అవినీతిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను ఆన్లైన్ చేయడం. రవాణా వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు ఇ- గవర్నెన్స్‌ను అమల్లోకి తేవడం.ఒక్క క్లిక్ ద్వారా వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్సు వివరాలు తెలిసేలా రవాణా వ్యవస్థను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయడం. ఆన్లైన్లోనే పర్మిట్లు జారీచేసేలా చర్యలు. {పజల భద్రతకు సవాలుగా మారిన భారీ వాహనాల డిజైన్లలో మార్పునకు మార్గదర్శకాలు. టోల్ పాలసీలోనూ మార్పులు.. టోల్ చార్జీలకు సంబంధించిన పాలసీని మార్చాలని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ భావిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులు 75 శాతం పూర్తై చాలు.. టోల్ చార్జీలు వసూలు చేసుకోవచ్చని ప్రస్తుతమున్న పాలసీ చెబుతోంది. అయితే వంద శాతం నిర్మాణం పనులు పూర్తై తరువాతే టోల్‌చార్జీలు వసూలు చేసేలా నిబంధనలను మార్చాలని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అలాగే, కొన్ని రహదారుల్లో నిర్మాణ వ్యయం ఆర్జించినప్పటికీ వాహనాల నుంచి టోల్ చార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. జాతీయ రహదారుల నిర్మాణానికి పెట్టిన ఖర్చు మొత్తం టోల్ చార్జీల ద్వారా వసూలై ఉంటే, ఆ రహదారుల్లో ఇక ముందు నుంచి టోల్‌చార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించింది.