రవాణా ఇక భద్రం! | Key changes in the motor vehicle | Sakshi
Sakshi News home page

రవాణా ఇక భద్రం!

Published Mon, Aug 25 2014 2:32 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

రవాణా ఇక భద్రం! - Sakshi

రవాణా ఇక భద్రం!

మోటారు వాహన చట్టంలో కీలక మార్పులు 
సవరణలతో త్వరలో పార్లమెంటు ముందుకు

 
న్యూఢిల్లీ: ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం, విధానాల్లో పారదర్శకత పాటించడం.. ఇవి లక్ష్యంగా మోటార్ వాహన చట్టంలో పలు కీలక సవరణలకు కేంద్రం సిద్ధమైంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, కెనడా, సింగపూర్‌లలో అమల్లో ఉన్న విధానాలపై అధ్యయనం జరిపిన కేంద్ర ప్రభుత్వం.. అవసరమైన సవరణలతో మోటారు వాహన చట్టం సవరణల బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

ప్రతిపాదిత సవరణల వివరాలు!

దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులకు 24 గంటల్లో చేతికి చలాను అందేలా చర్యలు.రవాణా శాఖలో అవినీతిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను ఆన్‌లైన్ చేయడం. రవాణా వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు ఇ- గవర్నెన్స్‌ను అమల్లోకి తేవడం.ఒక్క క్లిక్ ద్వారా వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్సు వివరాలు తెలిసేలా రవాణా వ్యవస్థను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయడం.  ఆన్‌లైన్‌లోనే పర్మిట్లు జారీచేసేలా చర్యలు. {పజల భద్రతకు సవాలుగా మారిన  భారీ వాహనాల డిజైన్లలో మార్పునకు మార్గదర్శకాలు.

టోల్ పాలసీలోనూ మార్పులు..

టోల్ చార్జీలకు సంబంధించిన పాలసీని మార్చాలని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ భావిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులు 75 శాతం పూర్తై చాలు.. టోల్ చార్జీలు వసూలు చేసుకోవచ్చని ప్రస్తుతమున్న పాలసీ చెబుతోంది. అయితే వంద శాతం నిర్మాణం పనులు పూర్తై తరువాతే టోల్‌చార్జీలు వసూలు చేసేలా నిబంధనలను మార్చాలని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అలాగే, కొన్ని రహదారుల్లో నిర్మాణ వ్యయం ఆర్జించినప్పటికీ వాహనాల నుంచి టోల్ చార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. జాతీయ రహదారుల నిర్మాణానికి పెట్టిన ఖర్చు మొత్తం టోల్ చార్జీల ద్వారా వసూలై ఉంటే, ఆ రహదారుల్లో ఇక ముందు నుంచి టోల్‌చార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement