'ఎస్వీయూలో ర్యాగింగ్ వాస్తవమే'
తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వాస్తవమేనని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తెలిపారు. ఎస్వీ వర్సిటీలో కలకలం సృష్టించిన ర్యాగింగ్‌పై తిరుపతి ఆర్డీవో సోమవారం విచారణ ప్రారంభించారు. ఆర్డీవో వీరబ్రహ్మం వర్సిటీలోని డీ-బ్లాక్‌కు వెళ్లి ర్యాగింగ్ సంఘటనపై విద్యార్థులు, అధికారులతో చర్చించారు. అనంతరం వారు 'సాక్షి' మీడియాతో మాట్లాడారు.
ఐదుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించామన్నారు. అదే విధంగా ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్టు తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించినట్లు ఆర్డీవో వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ దేవరాజులు మీడియాకు తెలిపారు.